ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ కార్డు హోల్డర్స్‏కు రూ.లక్ష వరకు లిమిట్..

ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ కార్డు హోల్డర్స్‏కు రూ.లక్ష వరకు లిమిట్..

ప్రముఖ ఐసీఐసీఐ బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఇక నుంచి కొత్త రకం సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు

Rajitha Chanti

|

Jan 16, 2021 | 11:15 AM

ICICI Bank:  ప్రముఖ ఐసీఐసీఐ బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఇక నుంచి కొత్త రకం సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు MSMEలకు ప్రిపెయిడ్ కార్డులను ఇవ్వనుంది. ఇందుకోసం నియో అనే ఫిన్‏టెక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇక నుంచి ఎంఎస్ఎంఈలకు ఐసీఐసీఐ బ్యాంక్ నియో భారత్ పేరోల్ కార్డులను ఇవ్వనుంది. ఇవి వీసా కార్డులు, వీటి ద్వారా ఎంఎస్ఎంఈలు తమ సంస్థలలోని ఉద్యోగులకు చాలా సులభంగా జీతాలు ఇవ్వొచ్చు. అంతేకాకుండా ఈ కార్డు అకౌంట్లోకి రూ.లక్ష వరకు పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయం వలన కొత్త ప్రిపెయిడ్ కార్డుల వర్కర్లకు ప్రయోజనం కలగనుంది. అలాగే ఎంఎస్ఎంఈలు నియో సంస్థలో కూడా చేరవచ్చు. అదేవిధంగా వీటి ద్వారా బ్యాంక్ ప్రిపెయిడ్ కార్డు సర్వీసులను కూడా పొందవచ్చు. వీటికోసం వర్కర్లు ఉన్న ప్రాంతానికే వచ్చి ఈ ప్రిపెయిడ్ కార్డులు ఇవ్వడమే కాకుండా.. కేవైసీ కోసం వర్కర్ల నుంచి బయోమెట్రిక్ కూడా తీసుకుంటుంది. ఆ తర్వాత అకౌంట్ క్రియేట్ చేసి ప్రిపెయిడ్ కార్డులను జారీ చేస్తారు. అలాగే ఏటీఎం నుంచి కూడా ఈ కార్డులను ఉపయోగించి డబ్బులు తీసుకోవచ్చు. పీఓఎస్ మెషీన్లలో నగదు లావాదేవీలు నిర్వహించవచ్చు. అలాగే ఆన్లైన్ షాపింగ్ కూడా చేయవచ్చు.

Also Read: అక్కడ దొంగలు కృష్ణుడిని తొలి గురువుగా భావిస్తారట! గోవర్ధనగిరి పూజలు చేస్తారట!

ఆ హోటల్ ఐదో అంతస్థులో ఓ అంతుచిక్కని మిస్టరీ.. కిమ్‌కు మాత్రమే తెలిసిన రహస్యం..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu