Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హోటల్ ఐదో అంతస్థులో ఓ అంతుచిక్కని మిస్టరీ.. కిమ్‌కు మాత్రమే తెలిసిన రహస్యం..!

ప్రపంచానికి అర్ధంకాని దేశం ఏదైనా ఉందంటే అది నార్త్ కొరియా. కిమ్ జోంగ్ ఉన్ అధ్యక్షుడిగా ఉన్న ఈ దేశంలో ఎన్నో మిస్టరీలు దాగి ఉన్నాయి.

ఆ హోటల్ ఐదో అంతస్థులో ఓ అంతుచిక్కని మిస్టరీ.. కిమ్‌కు మాత్రమే తెలిసిన రహస్యం..!
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 15, 2020 | 8:53 PM

Yanggakdo International Hotel: ప్రపంచానికి అర్ధంకాని దేశం ఏదైనా ఉందంటే అది నార్త్ కొరియా. కిమ్ జోంగ్ ఉన్ అధ్యక్షుడిగా ఉన్న ఈ దేశంలో ఎన్నో మిస్టరీలు దాగి ఉన్నాయి. అక్కడి ఇన్ఫర్మేషన్ ఏదీ కూడా ప్రపంచానికి తెలియదు. ఇక బయట జరిగే విషయాలు ఆ దేశస్థులకు అసలు చేరనివ్వరు. నియంత పాలనను తలపించేలా కిమ్ అక్కడ కఠిన శిక్షలు కూడా విధిస్తుంటాడు. ఇలా కిమ్ దేశమంతా ఎన్నో రహస్యాలకు నిలయం. ఆ అంతుచిక్కని రహస్యాల్లో ఒకటే యంగ్గాక్‌డో ఇంటర్నేషనల్ హోటల్‌లోని ఐదో అంతస్తు. దాన్ని కిమ్ ప్రభుత్వం చాలా రహస్యంగా ఉంచుతోంది. అక్కడికి ఎవరికీ అనుమతి లేదు. ఆ అంతస్థుకు వెళ్తే తిరిగొస్తారన్న దాఖలాలు కూడా లేవు. అసలు ఆ హోటల్‌లో ఉన్న అంతుచిక్కని మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంలోని టాయిడాంగ్ నది ఒడ్డున ఉన్న యాంగ్గాక్‌డో హోటల్.. అక్కడ అత్యంత ఎత్తయిన భవంతుల్లో ఒకటి. 1986లో ఈ లగ్జరీ హోటల్ నిర్మాణం ప్రారంభమై 1992లో ముగిసింది. విదేశీ పర్యాటకుల ఎక్కువగా ఈ హోటల్‌లోనే బస చేస్తుంటారు. మొత్తంగా 47 అంతస్థులు ఉన్న ఈ హోటల్‌లో ఐదో అంతస్థుకు మాత్రం ఎవ్వరినీ అనుమతించరు. లిఫ్ట్‌లో ఐదో అంతస్థు బటన్ ఉండదు. లిఫ్ట్ కూడా ఆ అంతస్థులో ఆగదు. వినడానికి ఏదో హారర్ సినిమాలా ఉన్నా. ఇది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా అక్కడున్న అధికారులే చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఆ ఐదో అంతస్థు మిస్టరీ తెలుసుకునేందుకు కొంతమంది పర్యాటకులు డేర్ చేసి అక్కడికి వెళ్లారట. ఆ అంతస్థుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా తీశారు. అదృష్టవశాత్తు వాళ్లు క్షేమంగానే బయటపడ్డారట. వాళ్లు చెప్పిన ప్రకారం ఐదో అంతస్థు రెండుగా విభజించి ఉంటుందని.. ఒకటి, రెండు గదులు మినహా అన్ని తాళాలు వేసి ఉంటాయన్నారు. అంతేకాదు గోడలపై అమెరికా, జపాన్‌ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలతో నిండిన పోస్టర్లు అంటించి ఉన్నాయన్నారు. అయితే కొందరు మాత్రం అక్కడ ఏదో నిగూఢ రహస్యం దాగి ఉందని.. ప్రపంచానికి తెలియకుండా కిమ్ అక్కడ రహస్య కార్యకలాపాలు సాగిస్తున్నారని భావిస్తున్నారు. ఆ ఐదో అంతస్థు రహస్యం మాత్రం ఖచ్చితంగా కిమ్‌కు తెలుసని వారి అంచనా.