Donald Trump: మళ్ళీ మొదటికొచ్చిన డొనాల్డ్ ట్రంప్, ఈ ఎన్నిక అక్రమం, ఫేక్ న్యూస్ మీడియా దృష్టిలోనే ఆయన ఎన్నిక !
అమెరికా ఎన్నికల్లో ఓటమి చవి చూసిన డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ మొదటికొచ్చారు. తన ఓటమిని దాదాపు అంగీకరించినట్టుగా నిన్న వ్యాఖ్యానించిన ఆయన..
అమెరికా ఎన్నికల్లో ఓటమి చవి చూసిన డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ మొదటికొచ్చారు. తన ఓటమిని దాదాపు అంగీకరించినట్టుగా నిన్న వ్యాఖ్యానించిన ఆయన.. తాజాగా తిరిగి పాత పాటే పాడారు. ఈ ఎన్నిక అక్రమమని (రిగ్డ్ ఎలెక్షన్) అని అన్నారు. నా ఓటమిని అంగీకరించే ప్రసక్తి లేదని, ఫేక్ న్యూస్ మీడియా దృష్టిలోనే ఆయన (జో బైడెన్) గెలిచారని ట్వీట్ చేశారు. ‘మేమే గెలుస్తాం’ అని కూడా అన్నారు. ఓటింగ్ లో రిగ్గింగ్ జరిగిందని, నేను పోరాడుతూనే ఉంటానని ట్రంప్ పేర్కొన్నారు. ఇక ఈయన కాంపెయిన్ అడ్వైజర్ అయిన జేసన్ మిల్లర్ కూడా తమ నాయకుడు ఓటమిని ఒప్పుకోవడం లేదని తెలిపారు. మీడియా మైండ్ సెట్ ని ఆయన ప్రస్తావిస్తున్నారని, ఎన్నిక సక్రమంగా ఉండాలన్నదే ఆయన ఉద్దేశమని అన్నారు.’ ఓటింగ్ లో జరిగిన అవకతవకలు, అక్రమాలను ఎక్స్ పోజ్ చేస్తాం..డెమొక్రాట్ల రాజ్యాంగ విరుధ్దమైన ఎలెక్షన్ మేనేజ్ మెంట్ ను రచ్ఛకీడుస్తాం’ అని మిల్లర్ గర్జించారు.
ఈ ఎన్నికల్లో జో బైడెన్ కు 306 ఎలెక్టోరల్ ఓట్లు, ట్రంప్ కి 232 ఓట్లు వచ్చాయని ఈ నెల 13 న అసోసియేటెడ్ ప్రెస్, దాని అనుబంధ నెట్ వర్కులు పేర్కొన్నాయి. పైగా కోర్టుల్లో ట్రంప్ దాఖలు చేసిన దావాల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని మరో పుల్ల వేశాయి. ఇక వాషింగ్టన్ లో వేలాది ట్రంప్ మద్దతుదారులు ఆయనకు అనుకూలంగా భారీ ర్యాలీ నిర్వహించడం విశేషం. బహుశా దీంతో ఆయన మళ్ళీ నేనే విజేత అనే పల్లవినెత్తుకున్నట్టు కనిపిస్తోంది. .
He only won in the eyes of the FAKE NEWS MEDIA. I concede NOTHING! We have a long way to go. This was a RIGGED ELECTION!
— Donald J. Trump (@realDonaldTrump) November 15, 2020