Indian Street Food: ఏ రాష్ట్రంలో ఎక్కువగా పానీపూరి తింటారో మీకు తెలుసా..?
పానీపూరి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. దీని క్రంచీ రుచికి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది పానీపూరీ తింటారో మీకు తెలుసా..? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

పానీపూరి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమైన స్నాక్. స్ట్రీట్ ఫుడ్ లో ఇది ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. పూరీ లోపల మసాలా, బఠాణీ, తీపి చట్నీ, పులుసు నీళ్లు వేసుకొని తింటే భలే రుచిగా ఉంటుంది. ఈ క్రంచీ ఫుడ్ తింటే నోట్లో రుచుల పండుగే. కానీ మన దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా పానీపూరి తింటారో మీకు తెలుసా..?
పానీపూరి అంటే కేవలం స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు, అది రుచి, సంతోషం కలిపిన ఒక అనుభూతి. దీనిలో తీపి, పులుపు, ఉప్పు, కారం, మసాలా అన్నీ కలిసేలా ఉండటం వల్ల దీన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటారు. ఒకసారి తిన్నాక మళ్లీ మళ్లీ తినాలనిపించే అలవాటు చేసే ఫుడ్ ఇది. అందుకే ఇది ప్రతి ఒక్కరి ఫేవరెట్‌గా మారింది.
భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పానీపూరి ప్రజాదరణ పొందినప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో దీని క్రేజ్ మరీ ఎక్కువ. ముఖ్యంగా మహారాష్ట్రలో పానీపూరి విపరీతంగా అమ్ముడవుతోంది.
కొన్ని నివేదికల ప్రకారం.. మహారాష్ట్ర రాష్ట్రంలో పానీపూరి అత్యధికంగా తినే స్ట్రీట్ ఫుడ్‌గా ఉంది. ముంబై, పూణే, నాగ్‌పూర్ లాంటి నగరాల్లో దీని డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా ముంబై వీధుల్లో పానీపూరి స్టాళ్ల సంఖ్య చాలా ఎక్కువ.
ముంబైలో చోపాటి బీచ్, జుహూ బీచ్, బాంద్రా స్ట్రీట్ ఫుడ్ మార్కెట్, సదర్ బజార్ వంటి ప్రదేశాల్లో పానీపూరి స్టాళ్లు కనిపిస్తాయి. రాత్రివేళల్లోనూ ఈ స్టాళ్ల ముందు జనాలు క్యూ కట్టడం సాధారణమే.
పానీపూరి తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండే ఓ స్నాక్. దీన్ని బట్టే దేశవ్యాప్తంగా దీనికి ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. నేటి తరం యువత నుంచి వృద్ధుల వరకూ అందరూ దీన్ని ఇష్టంగా తింటారు.