Ugadi 2025 Libra Horoscope: తుల రాశి ఉగాది ఫలితాలు.. అద్భుతమైన రాజయోగాలు
Ugadi 2025 Panchangam Thula Rashifal: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తుల వారికి శని ఆరవ స్థానంలోకి, గురువు భాగ్య స్థానంలోకి ప్రవేశించడం వల్ల అద్భుతమైన రాజయోగాలు ఏర్పడతాయి. ఆర్థికంగా, వృత్తిపరంగా, కుటుంబపరంగా అనూహ్యమైన విజయాలు సాధిస్తారు. వివాహం, ఉద్యోగంలో పదోన్నతులు, ఆరోగ్యం, ఇంటి శుభకార్యాలు అన్నీ శుభప్రదంగా ఉంటాయి. మీ రాశికి సంబంధించి తెలుగు కొత్త సంవత్సర (మార్చి 30, 2025 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు) ఫలాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు – తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం 11, వ్యయం 5 | రాజపూజ్యాలు 2, అవమానాలు 2
తుల రాశికి మార్చి 29 తర్వాత శని ఆరవ స్థానంలోకి, మే 25 తర్వాత గురువు భాగ్య స్థానంలోకి మారుతున్నందువల్ల ఈ ఏడాది ఈ రాశివారు విపరీత రాజయోగాలు అనుభవించే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు వంటి వాటి మీద పెట్టుబడులు పెట్టడం వల్ల అంచనాలకు మించి లాభాలు పొందుతారు. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి.
ఈ రాశివారికి కొత్త సంవత్సరమంతా శుభ పరిణామాలతో సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడడంతో పాటు శత్రు, రోగ, రుణ బాధలు బాగా తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లపై పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత పద వులు పొందుతారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనా రోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవ హారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఈ రాశివారు లలితా సహస్ర నామం పఠించడం మంచిది.
ఏప్రిల్ నుంచి ఈ రాశివారికి శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ సభ్యులు అనేక విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు సంతృప్తికరమైన ఫలితాలను పొందు తారు. మే నెలలో మరిన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వివాహ ప్రయత్నాలు సునాయాసంగా ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. మంచి హోదా, జీతభత్యాలతో ఇతర సంస్థలోకి మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు ఎక్కువగా అందే సూచనలున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ఖర్చుల కంటే ఆదాయం బాగా పెరిగి, బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాశివారు తరచూ శివార్చన చేయడం వల్ల మనసులోని చాలా కోరికలు, ఆశలు నెరవేరే అవకాశం ఉంది.