What’s APP: ప్రైవసీ పాలసీ నిబంధనను వాయిదా వేసుకున్న వాట్సప్.. తిరిగి ఆరోజు నుంచి అమలులోకి.. కారణం ఎంటంటే ?
ఇటీవల ప్రవేశపెట్టిన ప్రైవసీ పాలసీ నిబంధనను కొద్ది రోజులపాటు వాట్సప్ వాయిదా వేసింది. ఈ విషయాన్ని తన బ్లాగ్‌పోస్ట్‌లో ప్రకటించింది.
What’s App Privacy policy: ఇటీవల ప్రవేశపెట్టిన ప్రైవసీ పాలసీ నిబంధనను కొద్ది రోజులపాటు వాట్సప్ వాయిదా వేసింది. ఈ విషయాన్ని తన బ్లాగ్‌పోస్ట్‌లో ప్రకటించింది. యూజర్ల వ్యక్తిగత సమాచారం ఫేస్‌బుక్‌కు షేర్ చేస్తోందంటూ అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాట్సప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్ చేస్తోందంటూ.. ఇప్పటీకే చాలా మంది వాట్సప్ వినియోగదారులు దాని ప్రత్యమ్నాయ యాప్స్ టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకు మారిపోతున్నారు. ఈ క్రమంలోనే యూజర్ల వ్యక్తిగత సమాచారం సమీక్షించుకునేందుకు ఇంకా కాస్తా సమయం పడుతుందని తెలిపింది. ప్రైవసీ పాలసీపై వస్తున్న తప్పుడు వార్తలతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొందని.. అందుకోసమే ఈ నిబంధనను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ముందుగా వాట్సప్ ప్రైవసీ పాలసీ నిబందన ఫిబ్రవరి 8 వరకు ఉండగా.. తాజాగా దానిని మే 15 వరకు వాయిదా వేసింది. దీంతో ఫిబ్రవరి 8 తర్వాత ఎవరి ఖాతాలు నిలిపివేయడం కానీ, తొలగించడం కానీ లేదని తన బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కోంది. ఇప్పటివరకు ప్రైవసీ పాలసీ పై యూజర్లలో నెలకొన్న అపోహలను నివృత్తి చేస్తామని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల భద్రాత గోప్యతపై వాట్సప్ చాలా వరకు సహయపడింది. అలాగే రానున్న కాలంలోనూ ఇది మరింత సహయపడుతుంది. ఇప్పటివరకు వినియోగదారుల వ్యక్తిగత సమాచారం షేరింగ్ పై వస్తున్న వార్తలను ఆపడానికి సహయం చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు అంటూ వాట్సప్ తన బ్లాగ్‌లో పేర్కొంది.
Also Read: మహిళల భద్రతే లక్ష్యంగా ‘అభయం యాప్’ లాంచ్ చేసిన సీఎం జగన్, పానిక్ బటన్ నొక్కగానే