మహిళల భద్రతే లక్ష్యంగా ‘అభయం యాప్’ లాంచ్ చేసిన సీఎం జగన్, పానిక్ బటన్ నొక్కగానే

మహిళల భద్రతే లక్ష్యంగా అభయ్ యాప్‌ను లాంచ్ చేశారు ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడేందుకు తమ ప్రభుత్వం ఎన్నో అడుగులు ముందుకు వేస్తోందని చెప్పారు.

  • Ram Naramaneni
  • Publish Date - 12:42 pm, Mon, 23 November 20
మహిళల భద్రతే లక్ష్యంగా 'అభయం యాప్' లాంచ్ చేసిన సీఎం జగన్, పానిక్ బటన్ నొక్కగానే

మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యంగా అభయం యాప్‌ను లాంచ్ చేశారు ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడేందుకు తమ ప్రభుత్వం ఎన్నో అడుగులు ముందుకు వేస్తోందని చెప్పారు. మహిళలకు తోడుగా నిలబడుతూ, వారిని అన్ని రకాలుగా తమ కాళ్లపై నిలబడే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. అమ్మఒడి, ఆసరా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు ద్వారా డబ్బును మహిళల ఖాతాల్లో పడేలా చేసి..వారికి ఆర్థిక స్వావలంబన ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నామినేటెడ్ పదువుల్లో 50 శాతం కేటాయించామని, హోం మంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో కూడా వారికి ప్రాధాన్యత ఇచ్చామని గుర్తుచేశారు.

మహిళల రక్షణ కోసం అడుగులు ముందుకు వెయ్యాల్సిన అవసరాన్ని గ్రహించి..దిశ బిల్లును ప్రవేశపెట్టి..మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. పోలీస్ వ్యవస్థ ద్వారా దిశ యాప్‌ను కూడా తీసుకొచ్చామని, ఇప్పుడు రవాణా వ్యవస్థ ద్వారా అభయం యాప్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు వెల్లడించారు. వాహనాల్లో మహిళలు సేఫ్‌గా ప్రయాణించేందుకు, ప్రయాణ సమయంలో వారికి ఎటువంటి ఆపదలు రాకుండా చూసుకునేందుకు అభయం యాప్ తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రతి ఆటోలోను, ప్రతి ట్యాక్సీలోనూ డివైజ్‌లు అమర్చబడతాయని, ఏమైనా ఇబ్బంది వచ్చి మహిళలు పానిక్ బటన్ నొక్కితే 10 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకుంటారని వివరించారు.

Also Read :

తీవ్ర విషాదం, కరోనాతో మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్​ ధుపేలియా మృతి

గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంట తీవ్ర విషాదం, మేనల్లుడు ఆత్మహత్య

ఆ ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు అక్కడే ఉండాలి, జగన్ సర్కార్ కీలక ఆదేశాలు

గ్రేటర్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్, బీజేపీలోకి విజయశాంతి, రేపే ముహూర్తం