Signal App: వాట్సప్ ప్రైవసీ పాలసీ ఎఫెక్ట్.. నిలిచిపోయిన ‘సిగ్నల్’ యాప్.. అసలు కారణం ఇదే..

వాట్సప్ ప్రైవసీ పాలసీ నిబంధనతో వినియోగదారులంతా సిగ్నల్ యాప్ మారిపోతున్నారు. దీంతో ఒకేసారి ఆ యాప్ డౌన్‏లోడ్

Signal App: వాట్సప్ ప్రైవసీ పాలసీ ఎఫెక్ట్.. నిలిచిపోయిన 'సిగ్నల్' యాప్.. అసలు కారణం ఇదే..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 16, 2021 | 12:40 PM

Signal App: వాట్సప్ ప్రైవసీ పాలసీ నిబంధనతో వినియోగదారులంతా సిగ్నల్ యాప్ మారిపోతున్నారు. దీంతో ఒకేసారి ఆ యాప్ డౌన్‏లోడ్ చేస్తున్నవారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలో కొత్త యాప్ సర్వర్లు పనిచేయడం లేదంటూ సిగ్నల్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. సాంకేతికపరమైన సమస్యలు తలెత్తినట్టు తెలిపింది. ఒకేసారి మిలియన్ల మంది కొత్త యూజర్లు డౌన్ లోడ్ చేసుకోవడంతో సిగ్నల్ యాప్ పనిచేయడం ఆగిపోయిందని తెలిపింది. ఈ క్రమంలోనే కొన్ని గంటల పాటు, మొబైల్, డెస్క్ టాప్ యాప్స్ పనిచేయడం ఆగిపోయాయని తెలిపింది. ఇప్పటికే కొంత మంది యూజర్లు సిగ్నల్ యాప్ సాంకేతిక సమస్యలంటూ మేసేజులు వస్తున్నాయి. వీటికి ట్విట్టర్ వేదికగా సిగ్నల్ యాప్ స్పందించింది. రికార్డు స్థాయిలో సిగ్నల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడంతో సర్వర్లపై లోడ్ పడి మొరాయించాయని తెలిపింది. వాట్సప్ ప్రైవసీ పాలసీ నిబంధనతో స్వదేశీ యాప్‏లైన టెలిగ్రామ్ ఎన్ క్రిప్టెడ్ యాప్‏లను వాడటానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు.

Also Read: మహిళల భద్రతే లక్ష్యంగా ‘అభయం యాప్’ లాంచ్ చేసిన సీఎం జగన్, పానిక్ బటన్ నొక్కగానే

యూజర్లకు షాకింగ్ న్యూస్ ఇచ్చిన వాట్సాప్.. వచ్చే ఏడాది నుంచి వారి ఫోన్లలో వాట్సాప్ పనిచేయదా?