AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyundai Creta: అమ్మకాల్లో దుమ్మురేపుతున్న హ్యూందాయ్ క్రెటా.. మూడు నెలల్లో లక్ష కార్ల బుకింగ్..!

ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ ఎస్‌యూవీ కేవలం మూడు నెలల్లోనే లక్ష బుకింగ్ మార్క్‌ను దాటింది. సన్‌రూఫ్, కనెక్ట్ చేసేలా కార్ టెక్నాలజీని కలిగి ఉన్న వేరియంట్‌లు ఈ మైలురాయిని సాధించడంలో గణనీయంగా దోహదపడ్డాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ ఒక ప్రకటనలో సన్‌రూఫ్, కనెక్ట్ చేసేలా కార్ వేరియంట్‌లు మొత్తం బుకింగ్‌లలో వరుసగా 71 శాతం, 52 శాతం దోహదపడుతుండటం ఆసక్తికరంగా ఉందన్నారు.

Hyundai Creta: అమ్మకాల్లో దుమ్మురేపుతున్న హ్యూందాయ్ క్రెటా.. మూడు నెలల్లో లక్ష కార్ల బుకింగ్..!
Hyundai Creta N Line
Nikhil
|

Updated on: Apr 13, 2024 | 4:00 PM

Share

అత్యంత పోటీతత్వం ఉన్న ఆటోమార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా అమ్మకాలు ఇటీవల ఆకట్టుకుంటున్నాయి. క్రెటా కారు మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తనదైన ముద్ర వేసింది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఈ ఎస్‌యూవీ కేవలం మూడు నెలల్లోనే లక్ష బుకింగ్ మార్క్‌ను దాటింది. సన్‌రూఫ్, కనెక్ట్ చేసేలా కార్ టెక్నాలజీని కలిగి ఉన్న వేరియంట్‌లు ఈ మైలురాయిని సాధించడంలో గణనీయంగా దోహదపడ్డాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ ఒక ప్రకటనలో సన్‌రూఫ్, కనెక్ట్ చేసేలా కార్ వేరియంట్‌లు మొత్తం బుకింగ్‌లలో వరుసగా 71 శాతం, 52 శాతం దోహదపడుతుండటం ఆసక్తికరంగా ఉందన్నారు. ఇది యువ భారతీయ కస్టమర్ల మారుతున్న ఆకాంక్షలకు నిదర్శనమని పేర్కొన్నారు. హ్యూందాయ్ క్రెటా అమ్మకాలకు సంబంధించిన అన్ని విషయాలను ఓ సారి తెలుసుకుందాం.

కొత్త హ్యుందాయ్ క్రెటాతో, ‘మేక్ ఇన్ ఇండియా’పై హ్యుందాయ్ మోటార్ ఇండియా యొక్క నిబద్ధతను బలోపేతం చేస్తూ భారత మార్కెట్ కోసం అసాధారణమైన ఉత్పత్తులను పరిచయం చేసే మా ప్రయత్నాన్ని కొనసాగించాలమిన తరుణ్ గార్గ్ తెలిపారు. హ్యూందాయ్ క్రెటా  2015లో ప్రవేశపెట్టారు. ఈ కారు కొనుగోలుదారుల్లో విపరీతమైన ప్రజాదరణ పొందింది. 2024 హ్యుందాయ్ క్రెటా ఈ ప్రసిద్ధ ఎస్‌యూవీకు సంబందించిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జనవరి 16న ప్రారంభించబడిన ఈ వాహనం ఎక్స్-షోరూమ్ ధరలు బేస్-స్పెక్ వేరియంట్ కోసం రూ.10.99 లక్షల నుండి ప్రారంభమవుతాయి. కొత్తగా ప్రారంభించిన క్రెటా 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో సహా అనేక రకాల పవర్‌ట్రైన్ ఎంపికలను అందిస్తుంది. వాహనంలో నాలుగు ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ఉన్నాయి – 6-స్పీడ్ మాన్యువల్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (IVT), 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT), మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో వస్తుంది. 

కొత్త క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఏడు వేరియంట్‌లు మరియు ఆరు మోనోటోన్ కలర్ ఆప్షన్‌లతో కొనుగోలుదారులు వారి ప్రాధాన్యతలకు సరిపోయే ఎంపికల శ్రేణిని కలిగి ఉన్నారు. కొత్త హ్యుందాయ్ క్రెటా హ్యుందాయ్ యొక్క స్మార్ట్‌సెన్స్ లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్)ను కూడా కలిగి ఉంది. ఇది యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్‌ల అతుకులు లేని ఏకీకరణను నిర్ధారిస్తుంది. హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ సూట్‌లో ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఎవైవెన్స్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్, లేన్ కీపింగ్ అసిస్ట్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ మొదలైన 19 ఫీచర్లు ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు. సరౌండ్ వ్యూ మానిటర్, టెలిమాటిక్స్ స్విచ్‌లతో కూడిన ఎలక్ట్రో క్రోమిక్ మిర్రర్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్ వంటి ఫీచర్లతో ఈ కారు అందినీ ఆకట్టుకుంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి