AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banking: కేవైసీ అంటే తెలుసు.. మరి సీకేవైసీ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలేంటి..

సీకేవైసీతో ఖాతాదారులకు వేగవంతంగా సేవలు అందుతాయి. ఆర్థిక సంస్థలకు కూడా వెరిఫై చేసే పని ఉండదు. దీని ద్వారా మీ కేవైసీని ప్రాసెస్‌ చేసి, ప్రత్యేక 14 అంకెల సంఖ్యను కేటాయిస్తారు. ఆ నంబర్ చెబితే మీ లావాదేవీ వేగవంతంగా పూర్తవుతుంది. ఉదాహరణకు కొత్త ఖాతా తెరవాలనుకున్నప్పుడు మీరు సీకేవైసీ నంబర్ చెబితే ప్రక్రియ చాలా సులువుగా పూర్తవుతుంది.

Banking: కేవైసీ అంటే తెలుసు.. మరి సీకేవైసీ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలేంటి..
Banking
Madhu
|

Updated on: Apr 13, 2024 | 4:21 PM

Share

బ్యాంకులు, ఇతర నాన్ ఫైనాన్షియల్ సంస్థలలో లావాదేవీలు నిర్వహించేటప్పుడు ఖాతాదారులు తమ కేవైసీ పత్రాలను సమర్పించాలి. అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు తదితర వాటిని అందజేయాలి. వాటిని పరిశీలించిన అనంతరం మన పనిని అధికారులు ప్రారంభిస్తారు. లావాదేవీలు నిర్వహించే ప్రతిసారీ ఇలా చేయడం ఇబ్బందిగా ఉంటుంది. పని కూడా ఆలస్యమవుతుంది. దీనిని నివారించడంతో పాటు ఖాతాదారులకు వేగవంతంగా సేవలు అందేలా చేయడం కోసం ప్రభుత్వం సీకేవైసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఖాతాదారుల కేవైసీ రికార్డులను భద్రపరిచే విధానాన్నే సీకేవైసీ అంటారు. అంటే సెంట్రల్ నో యువర్ కస్టమర్ అని అర్థం.

సేవలు వేగవంతం..

సీకేవైసీతో ఖాతాదారులకు వేగవంతంగా సేవలు అందుతాయి. ఆర్థిక సంస్థలకు కూడా వెరిఫై చేసే పని ఉండదు. దీని ద్వారా మీ కేవైసీని ప్రాసెస్‌ చేసి, ప్రత్యేక 14 అంకెల సంఖ్యను కేటాయిస్తారు. ఆ నంబర్ చెబితే మీ లావాదేవీ వేగవంతంగా పూర్తవుతుంది. ఉదాహరణకు కొత్త ఖాతా తెరవాలనుకున్నప్పుడు మీరు సీకేవైసీ నంబర్ చెబితే ప్రక్రియ చాలా సులువుగా పూర్తవుతుంది.

కేంద్రీకృత డేటాబేస్..

సీకేవైసీ అనేది వ్యక్తుల కేవైసీ సమాచారాన్ని నిల్వ చేసే కేంద్ర రిపోజిటరీగా పనిచేస్తుంది. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్‌లు, బీమా కంపెనీలు మొదలైన వివిధ ఆర్థిక సంస్థలతో లావాదేవీలను నిర్వహించేటప్పుడు పదేపదే పత్రాలను సమర్పించాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది.

ప్రయోజనాలు..

  • ఆర్థిక లావాదేవీల కోసం ధ్రువీకరణ కోసం కేవైసీ పత్రాలను అందజేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రక్రియ వేగవంతం అవుతుంది.
  • సీకేవైసీ పూర్తయిన తర్వాత 14 అంకెల నంబర్ ను కేటాయిస్తారు. దాని ద్వారా వివిధ ఆర్థిక సంస్థలతో లావాదేవీల జరిపేటప్పుడు ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ లను అందజేయాల్సిన అవసరం ఉండదు. సీకేవైసీ నంబర్ చెబితే సరిపోతుంది.
  • ఆర్థిక సంస్థలు, ఖాతాదారులిద్దకీ సీకేవైసీ వల్ల లాభం ఉంటుంది. ముఖ్యంగా సమయం ఆదా అవుతుంది. ఖాతాదారులు వేగవంతమైన సేవలు పొందుతారు.
  • ఆర్థిక సంస్థలు తమ పనులను సమర్థంగా నిర్వహించుకోవడానికి ఖాతాదారులు కూడా వేగంగా సేవలు పొందడం కోసం ప్రభుత్వం సీకేవైసీని ప్రవేశపెట్టింది.
  • మనీలాండరింగ్ నిరోధక చట్టం, భారత ప్రభుత్వం, ఆర్ బీఐ, సెబీ, ఐఆర్ డీఏ, పీఎఫ్ఆర్ డీఏ తదితర నియంత్రణ సంస్థలు రూపొందించిన నిబంధనల ప్రకారం అధీకృత సంస్థలు లేదా ఇతర నోటిఫైడ్ సంస్థలు సీకేవైసీని యాక్సెస్ చేస్తాయి.
  • సీకేవైసీ అనేది వ్యక్తి గత సమాచారం కనుక ఏ వెబ్‌సైట్‌లోనూ ప్రదర్శించరు.
  • సీకేవైసీని ఒక్కసారి చేసుకుంటే జీవితాంతం ఉపయోగంలో ఉంటుంది. అవసరమైనప్పుడు అప్ డేట్ చేసుకుంటూ ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us