AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రియల్టీ రంగంలో మెరిసిపోతున్న హైదరాబాద్ నగరం.. మేజర్ డీల్స్ ఆ అవసరాలకే..

Telangana: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో భాగంగా దావోస్‌ పర్యటనలో తెలంగాణ మంచి పెట్టుబడి ఒప్పందాలను చేసుకుంది. వీటి వల్ల తెలంగాణలో అతిపెద్ద నగరమైన హైదరాబాద్‌కు ప్రధాన లబ్ధి చేకూరుతుంది.

Telangana: రియల్టీ రంగంలో మెరిసిపోతున్న హైదరాబాద్ నగరం.. మేజర్ డీల్స్ ఆ అవసరాలకే..
Real Estate
Ayyappa Mamidi
|

Updated on: May 30, 2022 | 10:30 AM

Share

Telangana: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో భాగంగా దావోస్‌ పర్యటనలో తెలంగాణ మంచి పెట్టుబడి ఒప్పందాలను చేసుకుంది. వీటి వల్ల తెలంగాణలో అతిపెద్ద నగరమైన హైదరాబాద్‌కు ప్రధాన లబ్ధి చేకూరుతుంది. భూ లావాదేవీలకు హైదరాబాద్ నగరం మంచి ఎంపికగా నిలుస్తోంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ఇటీవలి నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి ప్రాపర్టీ డెవలపర్ల ద్వారా జరిగిన 1,237 ఎకరాల ల్యాండ్ డీల్స్‌లో.. 59 శాతం అంటే 715 ఎకరాలు హైదరాబాద్‌లో జరిగాయి. హైదరాబాద్‌లోని 600 ఎకరాల భూమిని రూ.350 కోట్లు వెచ్చించి హెటెరో గ్రూప్ కొనుగోలు చేసింది. మైక్రోసాఫ్ట్ తన డేటా డెవలప్‌మెంట్ సెంటర్ కోసం 40 ఎకరాలను ఈ నగరంలోనే కొనుగోలు చేసింది.

స్విట్జర్లాండ్‌కు చెందిన స్విస్ రీ కూడా ఆగస్టులో హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. మెుత్తం 715 ఎకారాల్లో UAEకి చెందిన లూలూ గ్రూప్‌, బెంగళూరులో 140 ఎకరాలకు మూడు వేర్వేరు ఒప్పందాలు, ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) 106.3 ఎకరాల ఐదు లావాదేవీలు జరిగాయి. పూణేలో 91.1 ఎకరాలకు పైగా ఐదు వేర్వేరు ఒప్పందాలు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో 54.85 ఎకరాలకు ఐదు ఒప్పందాలు జరిగాయి.

ఇవి కూడా చదవండి

2021 జనవరి నుంచి జూన్‌ వరకు 14 డీల్స్ ద్వారా జరిగిన 763 ఎకరాలతో పోలిస్తే.. ఈ ఏడాది 28 డీల్స్‌ ద్వారా లావాదేవీలు జరిపిన మొత్తం విస్తీర్ణం 38.3 శాతం ఎక్కువగా ఉందని తేలింది. ఈ డీల్స్ రెసిడెన్షియల్, మిక్స్డ్ యూజ్, డేటా సెంటర్, లాజిస్టిక్స్ సెంటర్ డెవలప్‌మెంట్‌ కోసం జరిగాయని తెలుస్తోంది. రెసిడెన్షియల్ డెవలప్‌మెంట్స్ కోసం ల్యాండ్ పార్సెల్లను కొనుగోలు చేసిన ప్రముఖ డెవలపర్లలో గోద్రేజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియాల్టీ, మహీంద్రా లైఫ్‌స్పేస్‌లు ఉన్నాయి. 2021 మొదటి అర్ధభాగంతో పోలిస్తే.. డీల్స్ సంఖ్య రెండింతలు పెరిగింది. వడ్డీ రేటు పెంపు ఉన్నప్పటికీ.. రియల్ ఎస్టేట్ డెవలపర్‌లకు నివాస అభివృద్ధి ప్రధాన ఫోకస్‌గా కొనసాగుతోంది. ప్రాపర్టీ రేట్లు, వడ్డీ రేట్ల పెంపు ఉన్నప్పటికీ రియల్టీ రంగంలో బలమైన హౌసింగ్ డిమాండ్ ఉంది.