Power Crisis: కరెంట్ కష్టాలు అయిపోయాయని అనుకుంటున్నారా..? జూలై-ఆగస్టులో ముదరనున్న సంక్షోభం..

Power Crisis: భారత్ లో థర్మల్ పవర్ ప్లాంట్లలో రుతుపవనాలకు ముందు బొగ్గు నిల్వలు లేకపోవడం వల్ల, జూలై-ఆగస్టు నాటికి దేశంలో మరో ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.

Power Crisis: కరెంట్ కష్టాలు అయిపోయాయని అనుకుంటున్నారా..? జూలై-ఆగస్టులో ముదరనున్న సంక్షోభం..
Power Crisis
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 30, 2022 | 7:39 AM

Power Crisis: భారత్ లో థర్మల్ పవర్ ప్లాంట్లలో రుతుపవనాలకు ముందు బొగ్గు నిల్వలు లేకపోవడం వల్ల, జూలై-ఆగస్టు నాటికి దేశంలో మరో ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇండిపెండెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. పవర్ స్టేషన్లలో ప్రస్తుతం 13.5 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పవర్ ప్లాంట్లలో కేవలం 20.7 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి.

ఉత్పత్తి చేయడంలో విఫలమైంది: ఇండియాస్ ఎనర్జీ క్రైసిస్ ఈజ్ ఎ కోల్ మేనేజ్‌మెంట్ క్రైసిస్. అధికారిక వనరుల నుంచి సేకరించిన డేటా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఇంధన డిమాండ్‌లో స్వల్ప పెరుగుదలను కూడా తట్టుకోగలవని సూచిస్తున్నాయి. అథారిటీ అంచనా ప్రకారం ఆగస్టులో గరిష్ఠ ఇంధన డిమాండ్ 214 GWకి చేరుకుంటుంది. ఇది కాకుండా.. మే నెలలో సగటు విద్యుత్ డిమాండ్ 13,3426 మిలియన్ యూనిట్లకు మించి ఉండవచ్చని తెలిపింది.

నైరుతి రుతుపవనాల ఆగమనంతో, గనుల నుంచి విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణా, మైనింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని నివేదిక వెల్లడించింది. రుతుపవనాలకు ముందు బొగ్గు నిల్వలను తగినంత స్థాయిలో నిర్మించకపోతే, జూలై-ఆగస్టులో దేశం మరో విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించింది. దేశంలో ఇటీవల ఏర్పడిన విద్యుత్ సంక్షోభం బొగ్గు ఉత్పత్తి వల్ల కాదని, దాని “పంపిణీ, అధికారుల ఉదాసీనత” కారణంగా ఉందని నివేదిక పేర్కొంది. తగినంత బొగ్గు తవ్వకాలు జరుగుతున్నప్పటికీ.. థర్మల్ పవర్ ప్లాంట్లలో తగిన బొగ్గు నిల్వలు ఉంచబడలేదని డేటా నుంచి స్పష్టంగా తెలుస్తుంది. ఇది అంతకుముందు ఉత్పత్తి అయిన 71.60 మిలియన్ టన్నుల కంటే 8.54 శాతం ఎక్కువ.

2021-22లో దేశం మొత్తం మైనింగ్ సామర్థ్యం 150 మిలియన్ టన్నులు కాగా.. మొత్తం ఉత్పత్తి 777.2 మిలియన్ టన్నులుగా ఉంది. ఇది ఉత్పత్తి సామర్థ్యంలో సరిగ్గా సగం. నిజంగా బొగ్గు కొరత ఉంటే బొగ్గు కంపెనీలకు ఉత్పత్తిని పెంచే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితి ఇప్పుడే ఏర్పడింది కాదని.. మే 2020 నుంచి విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు నిల్వలు నిరంతరం తగ్గుతున్నాయి. వర్షాకాలానికి ముందు విద్యుత్ ప్లాంట్ నిర్వాహకులు తగినంత బొగ్గు నిల్వలను స్టాక్ చేసుకోకపోవటమే గత ఏడాది విద్యుత్ సంక్షోభానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.