Ants find Gold: అక్కడ లక్షల టన్నులు బంగారం గనులు.. చీమల వల్ల వెలుగులోకి

మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న జాముయ్‌లో బంగారం నిల్వలను కనుగొనడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ బంగారం నిల్వలు ఉన్నాయని కనుగొనడానికి చీమల వల్లనే సాధ్యమైందని తెలుస్తోంది.

Ants find Gold: అక్కడ లక్షల టన్నులు బంగారం గనులు.. చీమల వల్ల వెలుగులోకి
Gold Mine In Jamui
Follow us

|

Updated on: May 30, 2022 | 8:08 AM

Ants find Gold: బీహార్ లో కుబేరుడి సంపద ఉన్నట్లు పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. దేశంలోని బంగారం నిల్వల్లో 44 శాతం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వాన్ని చెందిన వివిధ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈసారి ‘దేశంలోనే అతి పెద్ద’ బంగారు గని తవ్వకాలకు బీహార్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. జముయ్ జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 222.88 మిలియన్ టన్నుల బంగారంతో పాటు.. 37.6 టన్నుల ఖనిజ ఖనిజం కూడా ఉన్నట్లు  జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) తేల్చింది. ఈ నేపథ్యంలో తాజాగా జముయ్ జిల్లాలోని ఆ ప్రాంతంలో బంగారం వెతకాలని నితీశ్ కుమార్ ప్రభుత్వం నిర్ణయించింది.

బీహార్ లో బంగారం నిల్వలపై కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి సైతం గతేడాది లోక్ సభలో లిఖిత పూర్వక సమాధాం ఇచ్చారు. మైనింగ్‌పై బీహార్ రాష్ట్ర గనులు, భూగర్భ శాస్త్ర శాఖతో కేంద్ర ఏజెన్సీ చర్చలు జరిపిందని బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హర్జోత్ కౌర్ తెలిపారు. ఈ విషయమై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులను కూడా సంప్రదించారు.

బీహార్‌లోని ఏ ప్రాంతాల్లో బంగారు గని వెలుగులోకి వచ్చిందంటే.. 

జముయ్ జిల్లాలోని కర్మతియా, ఝఝా, సోనో ప్రాంతాల్లో గనులు ఉన్నట్లు తెలిసింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గత ఏడాది లోక్‌సభలో వ్రాతపూర్వక సమాధానంలో బీహార్‌లో బంగారం తవ్వకాల అంశాన్ని లేవనెత్తారు. దేశంలోని మొత్తం బంగారంలో 44 శాతం బీహార్ లోని గనుల్లో దొరుకుతుందని కేంద్ర మంత్రి లోక్ సభకు తెలిపారు. బంగారం మొత్తం దాదాపు 230 మిలియన్ టన్నులు ఉండవచ్చు అని చెప్పారు. ఈ భారీ బంగారు గని అన్వేషణకు ముందు వచ్చే నెలలో బీహార్ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీతో ఎంఓయూ కుదుర్చుకునే అవకాశం ఉందని నితీష్ కుమార్ ప్రభుత్వ వర్గాల సమాచారం. బంగారం అన్వేషణ కోసం బీహార్ ప్రభుత్వం ప్రాథమిక దశలో లేదా జీ-3 స్థాయిలో కేంద్ర ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకోవచ్చని సమాచారం.

ఈ బంగారం ఎలా దొరికిందంటే..?

మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న జాముయ్‌లోని ఎర్రమట్టి కింద ఇంత భారీ బంగారం నిల్వ ఉందని ఎవరూ గుర్తించలేదు.. ఇక్కడ బంగారం నిల్వలను కనుగొనడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ బంగారం నిల్వలు ఉన్నాయని కనుగొనడానికి చీమల వల్లనే సాధ్యమైందని తెలుస్తోంది. ఇక్కడ నలభై సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఒక భారీ మర్రి చెట్టు ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. ఎండ వేడి నుండి తప్పించుకోవడానికి, చీమలు మర్రి చెట్టు కింద పుట్టలు  నిర్మించడం ప్రారంభించాయి. చీమలు భూమి నుంచి మట్టిని పైకి లేపి పుట్టలు పెట్టడం ప్రారంభించినప్పుడు, స్థానికులు మట్టిలో పసుపు గులకరాళ్ళ చిన్న రేణువులను చూశారు. ఈ వార్త ఆ ప్రాంత ప్రజల్లో వ్యాపించింది. అలా ప్రభుతం దృష్టికి చేరుకుంది. అప్పుడు రంగంలోకి దిగిన ప్రభుతం బంగారం కోసం అన్వేషణ ప్రారంభించింది. ఇప్పుడు బీహార్ ప్రభుత్వం  బంగారం కోసం చూస్తోంది. నితీష్ ప్రభుత్వ వర్గాల నుంచి ఇదే మాట వినిపిస్తోంది. అయితే దీనిపై GSI ఇంకా సమాచారం ఇవ్వాల్సిఉంది.

దేశంలో ఇతర ప్రాంతాల్లో బంగారం గనులున్నాయంటే.. 

భారతదేశంలో అత్యధిక బంగారం కర్ణాటక రాష్ట్రంలో దొరుకుతుంది. ఈ రాష్ట్రంలోని కోలార్ బంగారు గని భారతదేశంలోని పురాతన, ప్రధాన బంగారు గనులలో ఒకటి. అయితే 2001లో బంగారు గని మూతపడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..