Stock Market: భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్ల అప్..
అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు(Stock Market) లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్ పాజిటివ్‌లో ముగియడంతో పాటు ఆసియా మార్కెట్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి.
అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు(Stock Market) లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్ పాజిటివ్‌లో ముగియడంతో పాటు ఆసియా మార్కెట్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఇటు సింగపూర్ ఎస్‌జీఎక్స్ నిఫ్టీ కూడా పాజిటివ్‌వో ఉంది. ఉదయం 9:35గంటలకు బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్ 800 పాయింట్లు పెరిగి 55,712 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ(NSE) నిఫ్టీ 250 పాయింట్ల్ పెరిగి 16,602 వద్ద కొనసాగుతోంది. మిడ్‌క్యాప్ 1.15, స్మాల్ క్యాప్1.26 శాతం పెరిగాయి.
సబ్ ఇండెక్స్‌లు నిఫ్టీ ఐటీ 2.51, నిఫ్టీ కన్సూమర్ డ్యూరబుల్స్ 1.91 శాతం పెరిగాయి. ఇన్ఫోసిస్ టాప్ గెయినర్‌గా కొనసాగుతోంది. ఈ స్టాక్ 2.85 శాతం పెరిగి రూ.1,503 వద్ద ట్రేడవుతోంది. యూపీఎల్, టాటా మోటర్స్, హెచ్‌సీఎల్ టెక్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. బీఎస్‌ఈ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా, ఎల్‌ఆండ్‌టీ ఇన్ఫోటెక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, రియలన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా లాభాల్లో ట్రేడవుతున్నాయి.