AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Honey Trap: Facebookలో ఫేక్‌ మహిళా ప్రొఫైల్‌.. రిటైర్డ్‌ ఉద్యోగికి వల వేసి రూ.38 లక్షలు స్వాహా!

Hyderabad Honey Trap: క్రిమినల్‌ కేసుల నుంచి తప్పించేందుకు లేదా కేసు పెట్టకుండా ఉండేందుకు పోలీసులు ఫోన్‌లో డబ్బులు అడగరని స్పష్టం చేశారు. ఇలాంటి బెదిరింపులతో ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే అది మోసగాడేనని గుర్తించి వెంటనే కాల్‌ కట్‌ చేసి..

Hyderabad Honey Trap: Facebookలో ఫేక్‌ మహిళా ప్రొఫైల్‌.. రిటైర్డ్‌ ఉద్యోగికి వల వేసి రూ.38 లక్షలు స్వాహా!
Hyderabad Honey Trap
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Oct 06, 2026 | 4:44 PM

Share

Hyderabad Honey Trap: హైదరాబాద్‌లో ఓ రిటైర్డ్‌ ఉద్యోగి హనీట్రాప్‌ మోసానికి గురై ఏకంగా రూ.38 లక్షలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌లో మహిళ పేరుతో ఫేక్ ప్రొఫైల్‌ సృష్టించిన మోసగాడు.. బాధితుడితో స్నేహం పెంచుకుని, తరచూ చాటింగ్‌ చేస్తూ అతని నమ్మకాన్ని సంపాదించాడు. అనంతరం ఇంటి ఖర్చులకు ఆర్థిక సాయం కావాలంటూ డబ్బులు అడగడంతో బాధితుడు పలుమార్లు నగదు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత నిందితుడు అసలు స్వరూపాన్ని బయటపెట్టి, తప్పుడు కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరించి మరింత డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మోసంపై 70 ఏళ్ల బాధితుడు 2025 జూన్‌ 17న హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 26 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై ఐటీ చట్టంలోని 66C, 66D సెక్షన్లతో పాటు BNSలోని 308(2) (బెదిరించి డబ్బులు వసూలు చేయడం), 318(4) (మోసం), 319(2) (మారువేషంలో మోసం) కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌ పోలీసులు ప్రజలను, ముఖ్యంగా వృద్ధులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దని, వ్యక్తిగత వివరాలు లేదా సున్నితమైన సమాచారాన్ని పంచుకోవద్దని, అపరిచితులతో సన్నిహితంగా చాటింగ్‌ చేయవద్దని హెచ్చరించారు.

అలాగే, క్రిమినల్‌ కేసుల నుంచి తప్పించేందుకు లేదా కేసు పెట్టకుండా ఉండేందుకు పోలీసులు ఫోన్‌లో డబ్బులు అడగరని స్పష్టం చేశారు. ఇలాంటి బెదిరింపులతో ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే అది మోసగాడేనని గుర్తించి వెంటనే కాల్‌ కట్‌ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఇది కూడా చదవండి: DMartలో అన్ని ఉన్నా ఇవి మాత్రం ఎందుకు ఉండవు.. వెనుకున్న అసలు బిజినెస్ సీక్రెట్ ఇదే!

ఇది కూడా చదవండి: Gold Price: బంగారం ప్రియులకు తీపి కబురు.. రూ.1.34 లక్షలకు దిగిరానున్న తులం బంగారం ధర? నిపుణులు ఏమంటున్నారంటే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us