AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రూ.300 దర్శనం టికెట్ల విడుదలపై బిగ్ అప్‌డేట్..

మీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ కోసమే టీటీడీ అత్యంత కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. త్వరలో ప్రారంభం కానున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం మరింత సులభతరం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. రద్దీని అదుపు చేసేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు పలు ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేస్తూ, భక్తుల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రూ.300 దర్శనం టికెట్ల విడుదలపై బిగ్ అప్‌డేట్..
Ttd Rs 300 Darshan Tickets Release Date
Raju M P R
| Edited By: |

Updated on: Oct 06, 2026 | 4:40 PM

Share

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి మాసం రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధారణ భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాల రోజులకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబర్ 7 బుధవారం నాడు ఉదయం 10:00 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు అధికారిక వెబ్‌‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని అధికారులు స్పష్టం చేశారు.

అక్టోబర్ 11 నుంచి 20 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు తమిళుల పవిత్ర పెరటాసి మాసం చివరి వారం కలిసి రావడంతో భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో సామాన్య భక్తులకు త్వరితగతిన, సులభంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ప్రాధాన్యతనిస్తోంది. అందుకోసం అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. వీటితో పాటు వృద్ధులు, దివ్యాంగుల దర్శనాలు చంటిపిల్లల తల్లిదండ్రుల దర్శనాలు, ఎన్‌ఆర్‌‌, డిఫెన్స్ సిబ్బంది ప్రత్యేక దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

సిఫార్సు లేఖలు స్వీకరించబడవు

వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు నేపథ్యంలో అక్టోబర్ 10 నుంచి 19వ తేదీ వరకు ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించే ప్రసక్తే లేదని టీటీడీ తేల్చి చెప్పింది. భక్తులు ఈ మార్పులను గమనించి, అందుకు అనుగుణంగా తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Follow Us