AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

video: చేతిలో పసిబిడ్డ.. హెలికాప్టర్‌ దిగుతూ పడబోయిన ఉషా వాన్స్‌.. చూస్తూ ఉండిపోయిన సిబ్బంది!

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ భార్య ఉషా వాన్స్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. తన తొమ్మిది వారాల చిన్నారిని ఎత్తుకుని హెలికాప్టర్‌ నుంచి దిగుతున్న సమయంలో ఆమె ఒక్కసారిగా తడబడ్డారు. హెలికాప్టర్‌ మెట్లపై నుంచి కిందకు దిగుతున్న ఉషా వాన్స్‌.. చివరి మెట్టు వద్ద అడుగు వేయడంతో కాస్త అదుపు తప్పినట్లు వీడియోలో కనిపించింది. వెంటనే రైలింగ్‌ను పట్టుకుని బ్యాలెన్స్ చేసుకోవడంతో ప్రమాదం తప్పింది. అయితే.. పక్కనే ఉన్న సిబ్బంది ఎవరూ వెంటనే సహాయం చేయకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

video: చేతిలో పసిబిడ్డ.. హెలికాప్టర్‌ దిగుతూ పడబోయిన ఉషా వాన్స్‌.. చూస్తూ ఉండిపోయిన సిబ్బంది!
Usha Vance Nearly Falls While Carrying Son Off Helicopter
Sharada V
|

Updated on: Oct 06, 2026 | 4:40 PM

Share

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ సోమవారం మేరీల్యాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద హెలికాప్టర్ నుంచి దిగుతుండగా తడబడ్డారు. ఆ సమయంలో ఆమె తన తొమ్మిది వారాల కుమారుడు అలెక్ నీల్ వాన్స్‌ ను బేబీ క్యారియర్‌లో మోస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. హెలికాప్టర్ మెట్ల చివరి భాగానికి చేరుకున్న సమయంలో ఉషా వాన్స్ ఒక్క అడుగు వేయబోయి తడబడినట్లు కనిపించింది. అయితే ఆమె వెంటనే పక్కనే ఉన్న రైలింగ్‌ను పట్టుకున్నారు. కొన్ని క్షణాల్లోనే బ్యాలెన్స్ చేసుకుని తిరిగి నిలబడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

బిడ్డను వెంటనే చూసుకున్న ఉషా

తడబడిన తర్వాత ఉషా వాన్స్ వెంటనే తన బిడ్డను పరిశీలించారు. బేబీ క్యారియర్‌లో ఉన్న అలెక్‌కు ఏమైనా జరిగిందా అని చూసుకున్న తర్వాత ఆమె సాధారణంగానే ముందుకు నడిచారు. ఆ సమయంలో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా హెలికాప్టర్ నుంచి దిగుతున్నారు. ఆయన తమ నాలుగేళ్ల కుమార్తె మిరాబెల్‌ను ఎత్తుకుని ఉన్నారు. అయితే ఉషా తడబడిన ఘటనను జేడీ వాన్స్ గమనించలేదని వీడియోను బట్టి తెలుస్తోంది.

పక్కనే ఉన్నవారు ఎందుకు స్పందించలేదు?

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సెక్యూరిటీ అంశంపై చర్చ మొదలైంది. ఉషా వాన్స్ తడబడిన సమయంలో సమీపంలో కొంతమంది సిబ్బంది ఉన్నప్పటికీ.. వారు వెంటనే ఆమెకు సహాయం చేయడానికి ఎందుకు ముందుకు రాలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే వీడియోలో కనిపించిన దృశ్యాల ఆధారంగా వారు ఎందుకు స్పందించలేదో చెప్పడం సాధ్యం కాదు. అక్కడ భద్రతా నిబంధనలు లేదా ప్రత్యేక ప్రోటోకాల్ అమల్లో ఉందా అనే విషయం స్పష్టంగా తెలియదు.

‘50వ రాష్ట్రం’ అలాస్కాకు ఉష

ఈ ఘటన తర్వాత వాన్స్ కుటుంబం తమ ప్రయాణాన్ని కొనసాగించింది. అలాస్కాలో జరిగే రిపబ్లికన్ పార్టీ కార్యక్రమంలో  రిపబ్లికన్ నేషనల్ కమిటీ నిర్వహించే ర్యాలీలో రిపబ్లికన్ సెనేటర్ డాన్ సలైవన్ కు మద్దతుగా జేడీ వాన్స్ ప్రచారం చేయాల్సి ఉంది. ఆయన డెమొక్రటిక్ అభ్యర్థి మేరీ పెల్టోలాపై పోటీ చేస్తున్న సలైవన్‌కు మద్దతుగా ప్రసంగించనున్నారు.ఈ పర్యటనలో ఉషా వాన్స్ కూడా తన భర్తతో పాటు పిల్లలను తీసుకుని వెళ్లారు. అమెరికాలోని 50వ రాష్ట్రంగా అలాస్కాను సందర్శించబోతున్నట్లు జేడీ వాన్స్ తెలిపారు.అంతేకాదు.. తమ తొమ్మిది వారాల చిన్నారిని కూడా విమాన ప్రయాణంలో వెంట తీసుకెళ్తున్నట్లు ఆయన చెప్పారు. ఇంత చిన్న బిడ్డతో సుదీర్ఘ ప్రయాణం కావడంతో.. ఆ రోజు తన ప్రసంగం సమయంలో తాను అలసిపోయినట్లు కనిపిస్తే అందుకు కారణం విమాన ప్రయాణమే అని జేడీ వాన్స్ సరదాగా వ్యాఖ్యానించారు.

జూలై 19న జన్మించిన అలెక్

ఉషా, జేడీ వాన్స్ దంపతులకు అలెక్ నాలుగో సంతానం. జూలై 19న మేరీల్యాండ్‌లోని బెథెస్డాలో ఉన్న వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో అలెక్ జన్మించాడు. అలెక్‌కు ముందు ఈ దంపతులకు ఈవాన్ (9), వివేక్ (6), మిరాబెల్ (4) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. హెలికాప్టర్ నుంచి దిగుతున్న సమయంలో ఉషా వాన్స్ తడబడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది .

Follow Us