RGIA: RGIAకు మరో పురస్కారం.. స్కైట్రాక్స్ బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాప్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఆసియా అవార్డ్ సొంతం..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో పురస్కారం వచ్చింది. విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలను వేగంగా అందిస్తున్నందుకు ‘స్కైట్రాక్స్ బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాప్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఆసియా’ అవార్డును శుక్రవారం జీహెచ్‌ఐఏఎల్ అధికారులు అందుకున్నారు...
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో పురస్కారం వచ్చింది. విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలను వేగంగా అందిస్తున్నందుకు ‘స్కైట్రాక్స్ బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాప్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఆసియా’ అవార్డును శుక్రవారం జీహెచ్‌ఐఏఎల్ అధికారులు అందుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం కార్యనిర్వహణాధికారి ప్రదీప్ ఫణీకర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రముఖ 100 విమానాశ్రయాల్లో 64వ స్థానంలో ఉన్న శంషాబాద్ 63వ స్థానానికి చేరిందని ఆనందం వ్యక్తం చేశారు. 100 దేశాల్లో 550కి పైగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు చెక్-ఇన్, రాకపోకలు, బదిలీలు, ఇమ్మిగ్రేషన్, కస్ట్‌మ్స్, షాపింగ్, భద్రత విభాగాల్లో అందిస్తున్న సేవలకుగాను ఈ పురస్కారాన్ని అందించిందని పేర్కొన్నారు.
ప్రపంచంలోని టాప్ 100 ఎయిర్‌పోర్ట్ లీగ్‌లో 2021లో 64వ స్థానం నుండి 2022లో 63వ స్థానానికి చేరుకుంది. RGIA భారతదేశం, దక్షిణాసియా 2022లో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయాల్లో రెండో ర్యాంక్ సాధించింది.