Maruti Suzuki: ఆ కారుపై ఏకంగా రూ. 59,000 వరకూ డిస్కౌంట్.. మరికొన్నిరోజులే అవకాశం..
ఫెస్టివ్ సీజన్లో భాగంగా మారుతి సుజుకీ పలు మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. వాటిల్లో మారుతి సుజుకి సెలేరియోకి సంబంధించిన వివరాలు మనం ఇప్పడు చూద్దాం. ఈ కారు కొనుగోలుపై దాదాపు రూ. 59,000 వరకూ తగ్గింపు లభిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ తో పాటు ఎక్స్ చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉంటాయి. దేశంలోని నెక్సా, అరెనా డీలర్ షిప్స్ వద్ద ఈ ఆఫర్లు ఉంటాయి.
మారుతి సుజుకి.. మన దేశంలో టాప్ కార్ బ్రాండ్. తక్కువ ధరలో అత్యద్భుత ఫీచర్లతో అందుబాటులో ఉండే కార్లు ఈ కంపెనీకి చెందినవి అధికంగా ఉంటాయి. దేశంలో అత్యధికంగా అమ్మడయ్యే కార్లు కూడా మారుతి సుజుకీవే ఉంటాయి. టాప్ టెన్ కనీసం ఐదు తగ్గకుండా ఈ కంపెనీ కార్లే ఉంటాయి. ఏ త్రైమాసికంలో లెక్కలు మనం గమనించిన టాప్ సెల్లింగ్ కార్లు మారుతి సుజుకీవే కనిపిస్తాయి. అంతటి డిమాండ్ ఉన్న ఈ కంపెనీ కార్లు ఆఫర్లో దొరుకుతుంటే ఎవరైనా వద్దంటారా? ఫెస్టివ్ సీజన్లో భాగంగా మారుతి సుజుకీ పలు మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. వాటిల్లో మారుతి సుజుకి సెలేరియోకి సంబంధించిన వివరాలు మనం ఇప్పడు చూద్దాం. ఈ కారు కొనుగోలుపై దాదాపు రూ. 59,000 వరకూ తగ్గింపు లభిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ తో పాటు ఎక్స్ చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉంటాయి. దేశంలోని నెక్సా, అరెనా డీలర్ షిప్స్ వద్ద ఈ ఆఫర్లు ఉంటాయి. వీటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆఫర్ వివరాలు ఇవి..
మారుతి సుజుకి సెలెరియో వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ పెట్రోల్, ఎంటీ వేరియంట్లపై రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పాత కారు ఎక్స్ చేంజ్ చేస్తే బోనస్ కింద రూ. 20,000 ఇస్తారు. దీనికి అదనంగా రూ. 4,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తారు. ఇవే కార్లు ఏఎంటీ వేరియంట్లు అయితే రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 20,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4,000 ఇస్తారు. అలాగే ఈ మోడల్ కార్లు సీఎన్జీ వేరియంట్లు అయితే రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 30,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 20,000 అందిస్తారు.
మారుతి సెలెరియా స్పెసిఫికేషన్లు..
సెలెరియో ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ వంటి నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు ఏడు రంగుల ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మోడల్ 1.0-లీటర్, మూడు-సిలిండర్, పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కారులో ఐదు-స్పీడ్ మాన్యువల్ యూనిట్, అలాగే ఏఎంటీ యూనిట్ కూడా ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ 66బీహెచ్పీ, 89ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా సీఎన్జీ వెర్షన్ 56బీహెచ్పీ, 82ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.
ఈ కారుపైనే కాకుండా మారుతి సుజుకీకి చెందిన వ్యాగన్ ఆర్, ఆల్టో, స్విఫ్ట్ వంటి మోడళ్లపై కూడా పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ అక్టోబర్ వరకూ ఈ ఆఫర్లు కొనసాగుతాయి. మరిన్ని వివరాలు కావాలంటే సమీపంలోని మారుతీ సుజుకీ డీలర్లను సంప్రదించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..