Hero: తక్కువ ధరకే భారీగా మైలేజ్‌ ఇచ్చే బైక్‌.. లీటర్‌ పెట్రోల్‌తో ఏకంగా 70 కి.మీల వరకు..

ఇక మైలేజ్‌ తర్వాత ఆలోచించే అంశం ధర. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌ ఇచ్చే బైక్‌ను కొనుగోలు చేయాలని ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తుంటారు. అయితే తక్కువ ధరలో మంచి మైలేజ్‌ ఇచ్చే బైక్స్‌ కొన్ని మాత్రమే అందుబాటులోకి ఉంటాయి. ఇలాంటి బైక్స్‌లో తాజాగా భారత ఆటో మొబైల్‌ రంగంలోకి ఓ కొత్త బైక్‌ లాంచ్‌ అయ్యింది. హీరో కంపెనీకి చెందిన ఈ బైక్‌ను తక్కువ బడ్జెట్‌లోనే ఏకంగా...

Hero: తక్కువ ధరకే భారీగా మైలేజ్‌ ఇచ్చే బైక్‌.. లీటర్‌ పెట్రోల్‌తో ఏకంగా 70 కి.మీల వరకు..
Hero Hf 100
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 15, 2023 | 10:21 PM

సాధారణంగా ఎవరైనా కొత్త బైక్‌ కొనాలనుకున్నప్పుడు ముందుగా పరిగణలోకి తీసుకునే అంశం మైలేజ్‌. ప్రతీ ఒక్క భారతీయుడి ఆలోచన ఇలాగే ఉంటుంది. భారీ సీసీతో స్టైల్‌, స్పీడ్‌ కోసం ఆలోచించే వారు మైలేజ్‌ను పెద్దగా పట్టించుకోక పోయినా సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు మాత్రం ఎంత మైలేజ్‌ ఇస్తుందన్న దానిని దృష్టిలో పెట్టుకొనే బైక్‌ను కొనుగోలు చేస్తారు.

ఇక మైలేజ్‌ తర్వాత ఆలోచించే అంశం ధర. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌ ఇచ్చే బైక్‌ను కొనుగోలు చేయాలని ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తుంటారు. అయితే తక్కువ ధరలో మంచి మైలేజ్‌ ఇచ్చే బైక్స్‌ కొన్ని మాత్రమే అందుబాటులోకి ఉంటాయి. ఇలాంటి బైక్స్‌లో తాజాగా భారత ఆటో మొబైల్‌ రంగంలోకి ఓ కొత్త బైక్‌ లాంచ్‌ అయ్యింది. హీరో కంపెనీకి చెందిన ఈ బైక్‌ను తక్కువ బడ్జెట్‌లోనే ఏకంగా 60 నుంచి 70 కి.మీల మైలేజ్‌ చేస్తుంది. ఇంతకీ ఈ బైక్‌ ఏంటీ.? దీని ఫీచర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

హీరో హెచ్‌ఎఫ్‌ 100 పేరుతో మార్కెట్లోకి కొత్త బైక్‌ను లాంచ్‌ చేసింది. ఈ బైక్‌లో 97.2 cc ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ని అందించారు. ఈ బైక్‌ 8000 rpm వద్ద 7.91 bhp పవర్‌ను, 6000 rpm వద్ద 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో 4 స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇచ్చారు. ఇక బైక్‌ ముందు భాగంలో లిస్కోపిక్ ఫోర్కులు, హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లను అందించారు. ఇక ఐ3ఎస్‌ స్టాప్‌-స్టార్ట్ అనే టెక్నాలజీ ఈ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

అయితే ఈ బైక్‌లో డిస్క్‌ బ్రేక్‌, సెల్ఫ్‌ స్టార్ట్ ఆప్షన్‌ ఇవ్వలేదు. కంపెనీ చెబుతోన్న దాని ప్రకారం ఈ బైక్‌ లీటర్‌ పెట్రోల్‌తో ఏకంగా 65 నుంచి 72 కి.మీల దూరం ప్రయాణిస్తోందని చెబుతోంది. ధర విషయానికొస్తే హీరో హెచ్‌ఎఫ్‌ 100 ఢిల్లీ ఎక్స్‌ షో రూమ్‌ ధర రూ. 59,018గా ఉంది. ఈ బైక్‌ నెక్సస్‌ బ్లూ, బ్లాక్‌, రెడ్‌ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక తక్కువ ధరలో హోండా కంపెనీకి చెందిన బైక్‌ కూడా అందుబాటులో ఉంది. హోండా షైన్‌ 100 బైక్‌ ఢిల్లీ ఎక్స్‌ షోరూమ్‌ ప్రైస్‌ రూ. 64,900గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..