AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే స్టేషన్‌లో ఫుడ్‌ స్టాల్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి.? ఎంత ఖర్చు అవుతుంది.?

ఇండియన్‌ రైల్వేలో సుమారు 14 లక్షల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా పరోక్షంగా కూడా రైల్వే దేశంలో లక్షలాది మందికి ఉపాధిని అందిస్తోంది. స్టేషన్స్‌లో ఏర్పాటు చేసుకునే ఫుడ్‌ స్టాల్స్‌, బుక్‌ స్టాల్స్‌ ద్వారా కూడా వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే స్టేషన్స్‌లో ఉండే స్టాల్స్‌లో మంచి వ్యాపారం జరుగుతుంది. దీంతో ఈ దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారు...

Indian Railways: రైల్వే స్టేషన్‌లో ఫుడ్‌ స్టాల్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి.? ఎంత ఖర్చు అవుతుంది.?
Stalls In Railway Station
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 17, 2023 | 6:19 PM

Share

ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో ఇండియన్‌ రైల్వే ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారతీయ రైల్వేను భారతదేశ లైఫ్‌ లైన్‌గా అభివర్ణిస్తుంటారు. ఇండయన్‌ రైల్వే ద్వారా రోజూ కోట్లాది మంది ప్రయాణిస్తున్నారు. దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలను అందించే ఏకైక సంస్థ ఇండియన్‌ రైల్వే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇండియన్‌ రైల్వేలో సుమారు 14 లక్షల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా పరోక్షంగా కూడా రైల్వే దేశంలో లక్షలాది మందికి ఉపాధిని అందిస్తోంది. స్టేషన్స్‌లో ఏర్పాటు చేసుకునే ఫుడ్‌ స్టాల్స్‌, బుక్‌ స్టాల్స్‌ ద్వారా కూడా వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే స్టేషన్స్‌లో ఉండే స్టాల్స్‌లో మంచి వ్యాపారం జరుగుతుంది. దీంతో ఈ దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంతకీ రైల్వే స్టేషన్స్‌లో స్టాల్స్‌ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి.? ఇందుకోసం ఎంత ఖర్చవుతంది.? లాంటి వివరాలు ఇప్పుడ తెలుసుకుందాం..

సాధారణంగా రైల్వే స్టేషన్స్‌లో స్టాల్స్‌ను ఏర్పాటు చేయడానికి భారతీయ రైల్వే టెండర్లను జారీ చేస్తుంది. ఈ టెండర్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం ద్వారా స్టేషన్‌లో స్టాల్స్‌ ఏర్పాటు చేసుకునేందుకు లైసెన్స్‌ పొందొచ్చు. రైల్వే స్టేషన్‌లో ఒక్కో స్టాల్‌కు ఒక్కో రకమైన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. స్టాల్‌ ప్రదేశాన్ని బట్టి ఫీజు వసూలు చేస్తారు. బుక్‌ స్టాల్‌, ఫుడ్‌ స్టాల్‌, టీ-కాఫీ స్టాల్‌ వంటి వాటికి ఏరియా ఆధారంగా రూ. 40 వేల నుంచి రూ. 3 లక్షల వరకు ఖర్చవుతుంది.

ఇక రైల్వే స్టేషన్స్‌లో బుక్‌ స్టాల్‌ లేదా ఫుడ్‌ స్టాల్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే పాన్‌ కార్డ్‌, ఆధార్‌ కార్డ్, ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్ట్ వంటి ఏదైనా డాక్యుమెంట్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఐఆర్‌సీటీసీతో పాటు ఇండియన్‌ రైల్వే వెబ్‌సైట్‌లోనూ టెండర్‌ విభాగం ఉంటుంది. ఇందులోకి వెళ్లి స్టేషన్స్‌లో ఫుడ్‌ స్టాల్స్‌ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి సమాచారం పొందొచ్చు. రైల్వే సైట్‌లో టెండర్లయ్యకే ఛార్జీలతో పాటు ఇతర కండిషన్స్‌కు సంబంధించిన వివరాలు పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..