AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RC Transfer: సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేశారా? ఆర్‌సీ బదిలీ చేయించుకోకపోతే ఇక అంతే..!

సొంత వాహనం అనేది ప్రతి కుటుంబానికి తప్పనిసరి అవసరంగా మారుతుంది. కారు కావచ్చు.. బైక్ కావచ్చు అవసరానికి బయటకు వెళ్లాలంటే వాహనం తప్పనిసరి. అయితే పెరిగిన రేట్ల నేపథ్యంలో చాలా మంది సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలా కొనుగోలు చేసుకున్న వారికి వాహన ఆర్‌సీ బదిలీ చాలా ప్రహసనంగా మారుతుంది. ఈ నేపథ్యంలో సింపుల్ టిప్స్‌తో వెహికల్ ఆర్‌సీ ఎలా బదిలీ చేయవచ్చో? తెలుసుకుందాం.

RC Transfer: సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేశారా? ఆర్‌సీ బదిలీ చేయించుకోకపోతే ఇక అంతే..!
Transfer Vehicle Rc
Nikhil
|

Updated on: May 18, 2025 | 5:30 PM

Share

ప్రస్తుత రోజుల్లో వాహన కొనుగోలు ఎంత సులభమైన విషయమో? అమ్మకం అంత కఠిన విషయంగా మారుతుంది. ముఖ్యంగా వాహనం అమ్మిన తర్వాత వాహన ఆర్‌సీ సజావుగా బదిలీ చేయాల్సిన బాధ్యత అమ్మకపుదారుడిపై ఉంటుంది. లేకపోతే ఆ వాహనం ద్వారా ఏదైనా ప్రమాదం జరిగినా, చట్ట వ్యతిరేక పనుల్లో వాహనం పట్టుబడినా పూర్తి బాధ్యత ఆర్‌సీ హోల్డర్‌పై ఉంటుంది. అలాగే మన వాహనంపై రుణం ఉన్నా ఆర్‌సీ బదిలీ కుదరదు. ఈ నేపథ్యంలో ఆర్‌సీ బదిలీ విషయంలో అన్ని నియమాలు సజావుగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. కాబట్టి వాహన బదిలీకి అవసరమైన పత్రాలు ఏమిటో చూద్దాం.

వాహన బదిలీ కోసం అవసరమయ్యే పత్రాలు

  • మీ ఒరిజినల్ అసలు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, కొనుగోలు ఇన్వాయిస్ అవసరం. 
  • అలాగే ఫారమ్ 29 (విక్రేత ద్వారా బదిలీ నోటీసు), ఫారమ్ 30 (కొత్త యజమాని ద్వారా రిజిస్ట్రేషన్ బదిలీ కోసం దరఖాస్తు) సిద్ధంగా ఉంచుకోవాలి.
  • చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ (పీయూసీ) సర్టిఫికేట్, బీమా పాలసీ కాపీ, కొనుగోలుదారు, విక్రేత ఇద్దరి చిరునామా రుజువులు
  • రెండు పార్టీల పాన్ కార్డులు, కొనుగోలుదారుడి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు అవసరం
  • మీ వాహనానికి రుణం ఉంటే మీ బ్యాంకు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ( ఎన్ఓసీ) అవసరం అవుతుంది. 
  • రాష్ట్రాల మధ్య బదిలీల కోసం అదనపు ఫారమ్‌లు అవసరం అవుతాయి. 

ఆయా పత్రాలతో మీ వాహనం రిజిస్టర్ అయిన ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్‌టీఓ)కి వెళ్లాలి. మీ అన్ని పత్రాలను సమర్పించి ఆర్‌టీఓ కౌంటర్లో అవసరమైన రుసుములను చెల్లించండి. అధికారులు మీ అన్ని పత్రాలను, వాహనం వివరాలను ధృవీకరిస్తారు. అయితే ఈ రోజుల్లో ప్రక్రియ సరళీకృతం చేశారు. ఈ ప్రక్రియ ప్రభుత్వ పరివాహన్ పోర్టల్లో సులభంగా పూర్తి చేయవచ్చు 

పరివాహన్ పోర్టల్‌లో ఇలా

  • పరివాహన్ అధికారిక పోర్టల్‌లో వాహన బదిలీ ఆప్షన్ ఎంచుకుని మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను  నమోదు చేసి “ప్రొసీడ్”పై క్లిక్ చేయాలి.
  • “బేసిక్ సర్వీసెస్” ఎంపికను ఎంచుకుని మీ ఛాసిస్ నంబర్ చివరి 5 అంకెలను నమోదు చేసి, ఆపై వ్యాలిడేట్ చాసిస్ నెంబర్‌పై పై క్లిక్ చేయండి. 
  • అప్పుడు రిజిస్టర్డ్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి కొనసాగాలి.
  • తరువాత, “ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్షిప్”ని ఎంచుకుని అవసరమైన సేవా వివరాలను పూరించాలి.
  • మీ బీమా సమాచారాన్ని అప్‌డేట్ చేసి ఫీజు ప్యానెల్‌ను సమీక్షించాలి. అనంతరం అక్కడ చూపిన రుసుమును చెల్లించాలి. 
  • అవసరమైతే పత్రాలను అప్లోడ్ చేస్తే అపాయింట్మెంట్ రసీదు జనరేట్ అవుతుంది.
  • ఈ రసీదుతో నిర్ణీత తేదీ రోజు సమీప ఆర్‌టీఓ ఆఫీస్‌కు వెళ్తే వాహన ఆర్‌సీ బదిలీ సులభతరం అవుతుంది.