AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు శుభవార్త..! ప్రభుత్వం వీటి ఏర్పాటుకు సబ్సిడీ అందిస్తోంది..

Electric Vehicle: 2030 నాటికి అన్ని వాహనాలను ఎలక్ట్రిక్‌గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రోడ్లపై నడిచే ప్రతి వాహనం పెట్రోల్ లేదా డీజిల్‌తో కాకుండా

నిరుద్యోగులకు శుభవార్త..! ప్రభుత్వం వీటి ఏర్పాటుకు సబ్సిడీ అందిస్తోంది..
Ev Charging Station
uppula Raju
|

Updated on: Oct 31, 2021 | 7:00 PM

Share

Electric Vehicle: 2030 నాటికి అన్ని వాహనాలను ఎలక్ట్రిక్‌గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రోడ్లపై నడిచే ప్రతి వాహనం పెట్రోల్ లేదా డీజిల్‌తో కాకుండా విద్యుత్ లేదా బ్యాటరీతో నడుస్తాయి. ప్రస్తుతం దేశంలో 10 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు నడుస్తున్నాయి. అయితే వీటి శాతం ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించాల్సి ఉంటుంది. అయితే అన్ని ఛార్జింగ్ స్టేషన్లను ప్రభుత్వమే నిర్మిస్తుందని కాదు కొన్ని ప్రైవేట్‌ చేతుల్లో కూడా ఉంటాయి. నిరుద్యోగులు కూడా ఛార్జింగ్‌ స్టేషన్‌ నిర్మించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇందుకోసం సబ్సిడీ లోన్లను కూడా అందిస్తుంది.

అయితే EV ఛార్జింగ్ స్టేషన్‌ను తయారు చేయడానికి చాలా ఖర్చవుతుంది. కానీ సామాన్యుడు కూడా దీనిని నిర్మించవచ్చు. మంచి లాభాలు సంపాదించవచ్చు. ఇలాంటి ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అనేక ఇతర రకాల ఆర్థిక సహాయం కూడా అందిస్తోంది. జీఎస్టీకి సంబంధించి ఈ దిశగా తొలి అడుగు పడింది. ఇంతకుముందు EV ఛార్జింగ్ స్టేషన్ 18% GSTని ఆకర్షిస్తుంది. అది 5%కి తగ్గించారు. ఛార్జింగ్ స్టేషన్ కోసం ప్రత్యేక ప్లాట్ తీసుకుని దానిపై స్టేషన్లు నిర్మించాలన్నది మొదటి నిబంధన. ఇప్పుడు ఈ నిబంధనను రద్దు చేశారు. మీరు ఏదైనా వాణిజ్య లేదా ప్రైవేట్ స్థలంలో ఛార్జింగ్ స్టేషన్‌ను నిర్మించవచ్చు. దీనివల్ల ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్‌ను తెరవడం గతంలో కంటే సులభంగా మారింది.

మీరు చేయాల్సింది మీరు విద్యుత్తుతో నడిచే ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, వాణిజ్య, ప్రైవేట్ ట్రక్కులు లేదా బస్సులకు ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించవచ్చు. లాభాల గురించి చెప్పాలంటే ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, వాణిజ్య లేదా ప్రైవేట్ నాలుగు చక్రాల వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లను ఎక్కువగా నిర్మిస్తారు. ఛార్జింగ్ స్టేషన్‌కి విద్యుత్ కనెక్షన్‌ని కావాలి. దీంతోపాటు హెవీ డ్యూటీ కేబులింగ్ అవసరం. ఛార్జింగ్ స్టేషన్‌కు అత్యంత ముఖ్యమైన విషయం భూమి. సొంతదైనా పర్వాలేదు అవసరమైతే లీజుకు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్‌కి సంబంధించిన షెడ్‌లు, పార్కింగ్ ప్రాంతాలు తదితర మౌలిక సదుపాయాలను నిర్మించాల్సి ఉంటుంది. మొత్తం 7 లక్షలు ఖర్చు అవుతుంది.

Unstoppable with NBK.. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ అతిథుల లిస్ట్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే.. తారక్ కూడా !

PF Alert: పీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక..! ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే ఖాతా ఖాళీ అవుతుంది..?

సిటీ యువతకి షాకింగ్‌ న్యూస్‌..! ఆ శక్తి పూర్తిగా తగ్గిపోతుందట.. కారణం ఇదే..?