AI బూచి నుంచి మీ ఉద్యోగాలు ఎలా కాపాడుకోవాలి? ఏ జాబ్ సేఫ్.. ఏది డేంజర్ జోన్లో ఉందో తెల్సా..
ప్రస్తుతం AI మొత్తం ఉద్యోగ విధులను భర్తీ చేసే స్థితికి చేరుకుంది. కాబట్టి ఉద్యోగ రక్షణకు కొత్త స్కిల్స్ నేర్చుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. అయితే ఏఐ ప్రొడక్టివిటీ వల్ల వర్కర్స్ ప్రభావితం అవుతారా? దీనివల్ల కార్మికులకు ఏమైనా ప్రయోజనాలు ఉందా అనే విషయంపై లిండా నజరేత్ మాట్లాడుతూ..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వర్క్‌ప్లేస్ రూపురేఖలను వేగంగా మారుస్తుంది. దీనిపై ప్రముఖ ఆర్థికవేత్త, ఫ్యూచరిస్ట్ లిండా నజరేత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇలాంటి టైంలో వర్కర్స్‌కు ఓ కవచం అవసరమని, అది యంత్రాలు భర్తీ చేయలేని ప్రత్యేకమైన మానవ నైపుణ్యాల సమితి అని అన్నారు. స్థితిస్థాపకత, సృజనాత్మకత, ఎంపథీ, ప్రేరణ, స్వీయ-అవగాహన, ఉత్సుకత, సేవా ధోరణి, బోధన, మార్గదర్శకత్వం వంటి లక్షణాలను నేర్చుకోవడం వల్ల కెరీర్‌ను AI ప్రూఫ్ చేయడానికి ఉత్తమ మార్గంగా ఆమె వెల్లడించారు. AI-ఆధారిత ఆర్థిక వ్యవస్థలో ఈ మానవ నైపుణ్యాలు మరింత విలువైనవిగా పరిగణింపబడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం వల్ల రాబోయే అన్ని మార్పులకు వ్యతిరేకంగా కవచం మాదిరి ఉద్యోగాలకు రక్షణగా నిలుస్తాయని నజరేత్ తెలిపారు.
ప్రస్తుతం AI మొత్తం ఉద్యోగ విధులను భర్తీ చేసే స్థితికి చేరుకుంది. కాబట్టి ఉద్యోగ రక్షణకు కొత్త స్కిల్స్ నేర్చుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. అయితే ఏఐ ప్రొడక్టివిటీ వల్ల వర్కర్స్ ప్రభావితం అవుతారా? దీనివల్ల కార్మికులకు ఏమైనా ప్రయోజనాలు ఉందా అనే విషయంపై లిండా నజరేత్ మాట్లాడుతూ.. AI అనేక ఎంట్రీ-లెవల్ వైట్-కాలర్ ఉద్యోగాలను భర్తీ చేస్తోందని, ఇది భవిష్యత్ మేనేజర్లు, లీడర్ల పైప్‌లైన్‌కు అంతరాయం కలిగిస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయని అన్నారు. ఎందుకంటే ఈ ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వకపోతే మధ్య, ఉన్నత స్థాయి కార్మికులు కరువవుతారని ఆమె అన్నారు.
ఏయే ఉద్యోగాలు AIకి ఎక్కువగా, తక్కువగా గురవుతాయి?
లిండా నజరేత్ వ్యాఖ్యలను ఇండీడ్ జెన్‌ఏఐ స్కిల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇండెక్స్ ఉటంకించాయి. ఈ నివేదిక ప్రకారం దాదాపు 2,900 సాధారణ పని నైపుణ్యాలలో 41 శాతం AI ద్వారా గణనీయంగా రూపాంతరం చెందుతాయని, 26% అధికంగా బహిర్గతం అయ్యాయని పేర్కొంది. సాధారణ ఉద్యోగ పోస్టింగుల్లో 46% నైపుణ్యాలు హైబ్రిడ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు గురయ్యే అవకాశం ఉందని ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు అత్యంత ఎక్కువగా ప్రభావితం అవుతాయని, శారీరక ఉనికి, మానవ స్పర్శ అవసరమయ్యే ఉద్యోగాలు, నర్సింగ్ వంటివి తక్కువగా ప్రభావితమవుతాయని తెలిపింది.
అమెజాన్‌లో కొత్తగా మరో 14 వేల మంది హుఫ్..
కృత్రిమ మేధస్సు ఇప్పటికే ఎందరినో ఇంటికి పంపిచేసింది. తాజాగా సుమారు 14 వేల మంది కార్పొరేట్ ఉద్యోగాలను అమెజాన్ ఇంటికి పంపించాలని భావిస్తుంది. 2023లో దాదాపు 27 వేల ఉద్యోగాలను తొలగించింది. తాజా కోతల నేపథ్యంలో అమెజాన్ తన ఉద్యోగులకు మంగళవారం నోటీసులను జారీ చేసినట్లు అమెజాన్ పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెట్టి తెలిపారు. ఈ కంపెనీలో కొత్త ఉద్యోగాల బదిలీకి 90 రోజుల సమయం ఉంటుందని, బదిలీకి వీలుకాని లేదా ఇష్టపడని వారికి అవుట్‌ప్లేస్‌మెంట్ సహాయం, ఆరోగ్య ప్రయోజనాలు అందించనున్నట్లు వెల్లడించారు. అమెజాన్‌లో ప్రస్తుతం దాదాపు 3,50,000 మంది కార్పొరేట్ సిబ్బందితో కలిపి మొత్తం 1.56 మిలియన్ల మంది వర్క్ ఫోర్స్‌ను కలిగి ఉంది. తాజా కోతలతో కార్పొరేట్ శ్రామిక శక్తిలో దాదాపు 4 శాతాన్ని తగ్గించుకోనుంది. తాజా కోతల వల్ల ప్రభావితమైన విభాగాల్లో పరికరాలు, ప్రకటనలు, ప్రైమ్ వీడియో, మానవ వనరులు, కార్యకలాపాలు, అలెక్సా, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ఉన్నాయి. కొంతమంది ఉద్యోగులు మంగళవారం తెల్లవారుజామున వ్యక్తిగత ఇమెయిల్ ద్వారా ఉద్యోగం తొలగింపు నోటీసులు అందుకున్నారు. కంపెనీ కోసం ఇకపై పని చేయాల్సిన అవసరం లేదని మెయిల్స్‌లో అమెజాన్ పేర్కొంది. అయితే క్లౌడ్ కంప్యూటింగ్, AI వంటి అధిక ప్రాధాన్యత ఉన్న రంగాలలో నియామకాలు కొనసాగుతూనే ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.








