SBI ATM: ఏటీఎం సెంటర్ కోసం మీ ఇంటి స్థలంను అద్దెకు ఎలా ఇవ్వాలో తెలుసా.. బ్యాంక్ నియమాలు కూడా తెలుసుకోండి..
మీ ఇంటిని సరైన వ్యక్తికి అద్దెకివ్వటమనేది చాలా తెలివైన పని. అందులోనూ ప్రభుత్వ కార్యాలయాలకు లేదా.. బ్యాంకులకు ఇవ్వడం ఓ మంచి ఆదాయ ఆలోచన అని చెప్పవచ్చు.

మీ ఇంటిని సరైన వ్యక్తికి అద్దెకివ్వటమనేది చాలా తెలివైన పని. అందులోనూ ప్రభుత్వ కార్యాలయాలకు లేదా.. బ్యాంకులకు ఇవ్వడం ఓ మంచి ఆదాయ ఆలోచన అని చెప్పవచ్చు. అందులోనూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలకు ఇవ్వడం అంటే బంగారు బాతును తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్లే అని ఆర్ధిక విశ్లేషకులు అంటుంటారు. అయితే మన ఇంట్లో ఏటీఎం సెంటర్‌కు ఎలా ఇవ్వాలనేది మాత్రం చాలా మందికి తెలియదు. ఈ మధ్యకాలంలో చాలా గ్రామాల్లో ATM లను ఏర్పాటు చేసింది ఎస్బీఐ. తద్వారా కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటోంది. కేవలం బ్యాంకు ప్రాంగణంలో మాత్రమే కాకుండా, రోడ్డు పక్కన ఉండే దుకాణాలలో కూడా ATM సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇలా సొంత బిల్డింగ్స్‌లో మాత్రమే కాకుండా.. ఇప్పుడు అద్దెకు ప్రైవేట్ స్థలాలను కూడా తీసుకుని అందులో ఏటీఎం సెంటర్‌లను ఏర్పాటు చేస్తోంది. మీ దగ్గర ఖాళీ దుకాణం లేదా భూమి ఉంటే.. మీరు దానిలో ATM ని ఇన్‌స్టాల్ చేసి మంచి డబ్బు సంపాదించవచ్చు. మీరు మీ దుకాణం లేదా మీ స్థలంను ATM కోసం ఎలా అద్దెకు ఇవ్వాలో తెలుసుకుందాం. ATM నుండి ఎలా సంపాదించాలో ATM ఏర్పాటు ప్రక్రియ ఏమిటో కూడా తెలుసుకుందాం.
SBI ATM ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి?
మీరు SBI ATMని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే.. మీరు ముందుగా బ్యాంకును సంప్రదించాలి. బ్యాంక్ పేర్కొన్న నిబంధనల ప్రకారం మీకు సమీపంలోని SBI రీజినల్ బిజినెస్ ఆఫీస్ (RBO) కి ATM వ్యవస్థాపన కోసం దరఖాస్తు ఇవ్వాలి. బ్యాంక్ ‘మీరు మీ ప్రాంతంలోని RBO చిరునామాను వెబ్‌సైట్ నుండి పొందవచ్చు. అంతేకాకుండా మీ సమీప శాఖ నుండి కూడా చిరునామాను పొందవచ్చు. ఇది ఆ RBO కింద పనిచేసే అన్ని శాఖల బ్యాంకింగ్ హాల్‌లో కనిస్తుంటాయి.
ATM ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి?
మీరు కూడా ATM నుండి సంపాదించాలనుకుంటే మీకు తప్పనిసరిగా స్థలం ఉండాలి. ATM సెటప్ చేయగలిగేలా భూమి ఉండాలి. ఈ ప్రదేశం కూడా ఒక దుకాణం లాగా ఉంటుంది. కానీ ATM ప్రకారం షాప్ కొంచెం పెద్దదిగా ఉండాలి. నేరుగా బ్యాంకును సంప్రదించడమే కాకుండా.. అనేక ఏజెన్సీలు ATM లను ఇన్‌స్టాల్ చేస్తున్నాయి. వీటిని కూడా మీరు సంప్రదించవచ్చు. ఈ ఏజెన్సీలలో టాటా ఇండికాష్ ATM, ముత్తూట్ ATM, ఇండియా వన్ ATM వంటివి అనేకం ఉన్నాయి.