AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold price: నగదుతో ఎంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చో తెలుసా.. దీనికో లెక్కుంది..

దేశంలో ప్రజలు చాలా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. పండుగల సందర్భంలో బంగారంపై పెట్టుబడి పెడతారు.దేశంలో పండుగ సీజన్ కొనసాగుతోంది. రానున్న రోజుల్లో దేశంలో ధన్తేరస్ పండుగ కూడా రాబోతోంది. పండుగల సందర్భంగా సాంప్రదాయకంగా బంగారం, వెండిని కొనుగోలు చేస్తారు. ధన్‌తేరస్‌లో బంగారం, వెండి కొనుగోలుకు ప్రాధాన్యత చాలా ఎక్కువ. అయితే, బంగారాన్ని నగదు రూపంలో కొనుగోలు చేయాలంటే ఎంత మొత్తంలో కొనుగోలు చేయవచ్చో తెలుసా? మీకు తెలియకపోతే దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం..

Gold price: నగదుతో ఎంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చో తెలుసా.. దీనికో లెక్కుంది..
Gold
Sanjay Kasula
|

Updated on: Sep 23, 2023 | 7:04 PM

Share

అతివల మదిని దోచే ఆభరణాలు.. స్వర్ణకాంతులే..! కానీ.. బంగారం ధర.. రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. అయితే.. ఈ అక్షయ తృతియలో.. ధరలు తగ్గే అవకాశం ఉందా? పసిడి పరుగులకు.. ఎప్పుడు బ్రేక్‌ పడుతుంది? అసలు.. గ్లోబల్‌ మార్కెట్‌లో.. గోల్డ్‌ పరిస్థితి ఏంటి? తర్వాత తెలుసుకుందాం.. అయితే నగదుతో ఎంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలో పండుగ సీజన్ కొనసాగుతోంది. రానున్న రోజుల్లో దేశంలో ధన్తేరస్ పండుగ కూడా రాబోతోంది. పండుగల సందర్భంగా సాంప్రదాయకంగా బంగారం, వెండిని కొనుగోలు చేస్తారు. ధన్‌తేరస్‌లో బంగారం, వెండి కొనుగోలుకు ప్రాధాన్యత చాలా ఎక్కువ. మీరు ఈ ధన్‌తేరస్‌లో బంగారం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం అవసరం.

నిజానికి, మనం నగదు రూపంలో కూడా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటాం. అయితే, ఒక వ్యక్తి ఎంత బంగారాన్ని నగదు రూపంలో కొనుక్కోవచ్చు.. అని కొంతమందికి ఈ ప్రశ్న వస్తుంది. నగదు రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఏదైనా పరిమితి ఉందా..? లేదా? అనే సందేహం కూడా ప్రజల్లో ఉంది. దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఆదాయ పన్ను..

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, నగదు రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎటువంటి పరిమితి లేదు. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. గ్రహీత( అమ్ముతున్న వ్యక్తి) ఏ ఒక్క లావాదేవీలోనూ రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును అంగీకరించకూడదని ఆదాయపు పన్ను చట్టం ఖచ్చితంగా చెబుతోంది.  మీరు బంగారాన్ని కొనుగోలు చేయడానికి నగదు రూపంలో ఏదైనా ఇవ్వవచ్చు. కానీ అమ్మకందారుడు రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును అంగీకరించరు.

నగదుతో ఎంత కొనాలంటే..

ఆభరణాలను విక్రయించే ప్రతి లావాదేవీకి రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని విక్రేత వసూలు చేయడాన్ని చట్టం నిషేధిస్తుంది. ఆభరణాల విక్రయదారుడు రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదును అంగీకరించినట్లయితే, ఆదాయపు పన్ను శాఖ చట్టపరమైన నిబంధనను ఉల్లంఘించి అంగీకరించిన మొత్తానికి సమానమైన జరిమానా విధించవచ్చు.

గుర్తింపు సర్టిఫికేట్..

ఇది కాకుండా, మీరు నగల వ్యాపారి నుంచి రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదు లేదా ఇతర మార్గాల ద్వారా కొనుగోలు చేస్తే, విక్రేత పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ వంటి మీ గుర్తింపు రుజువును అందించాలి. అయితే, కొనుగోలు రూ. 2 లక్షల కంటే తక్కువ ఉంటే, మీరు ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేకుండా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం