టూ-వీలర్ ‘హీరో’ ప్లాంట్‌ మూసివేత!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ మూడు రోజుల పాటు తన ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి 18 వరకు ఈ మూసివేత కొనసాగుతుందని పేర్కొంది. మార్కెట్‌ పరిస్థితులు, వార్షిక సెలువుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే పలు కార్ల సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్న సమయంలో హీరో ప్రకటన రావడం గమనార్హం. ద్విచక్ర వాహన రంగంలో ప్లాంట్‌ను మూసివేసిన తొలి సంస్థ హీరోనే. ఈ మూసివేత మార్కెట్‌ పరిస్థితులను […]

టూ-వీలర్ 'హీరో' ప్లాంట్‌ మూసివేత!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 16, 2019 | 9:43 PM

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ మూడు రోజుల పాటు తన ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి 18 వరకు ఈ మూసివేత కొనసాగుతుందని పేర్కొంది. మార్కెట్‌ పరిస్థితులు, వార్షిక సెలువుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే పలు కార్ల సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్న సమయంలో హీరో ప్రకటన రావడం గమనార్హం. ద్విచక్ర వాహన రంగంలో ప్లాంట్‌ను మూసివేసిన తొలి సంస్థ హీరోనే. ఈ మూసివేత మార్కెట్‌ పరిస్థితులను అంచనా వేయడానికి, ఉత్పత్తి ప్రణాళికను తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని హీరో పేర్కొంది. ‘‘ ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా మా ఉత్పత్తి కేంద్రాలను ఆగస్టు 15 నుంచి 18 వరకు మూసివేస్తున్నాం. ఆగస్టు 15, రక్షాబంధన్‌, వారంతంతో పాటు మార్కెట్‌ పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నాం’’ అని కంపెనీ ఎన్‌ఎస్‌ఈకి అందజేసిన సమాచారంలో పేర్కొంది.