Ola Electric Scooters: ఓలా ఎలక్ట్రిక్ కీలక ప్రకటన.. ఇకపై ఆ స్కూటర్ కనిపించదు.. పూర్తి వివరాలు..
ఈ క్రమంలో పాత మోడల్ ఓలా ఎస్ 1 స్కూటర్ తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఓలా ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ పేరిట మూడు వేరియంట్లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు బేస్ మోడల్ ఎస్ 1 నిలిపివేతతో ఎస్1 ఎయిర్ స్కూటర్ బేస్ మోడల్ కానుంది. ఎస్1 ప్రో టాప్ మోడల్ గా అలాగే కొనసాగునుంది. కాగా ఎస్1 ఎయిర్ ప్రారంభం సందర్భంగా దాని ధరపై ప్రకటించిన తగ్గింపు ఆగస్టు 15 వరకూ కొనసాగుతుందని కంపెనీ ప్రకటించింది.

ఓలా ఎలక్ట్రిక్.. విద్యుత్ ద్విచక్ర వాహన శ్రేణిలో తనదైన ముద్ర వేసుకున్న బ్రాండ్. ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తూ దేశంలోనే నంబర్ వన్ గా కొనసాగుతోంది. అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతి ఇవ్వడంలో ఓలాకి సాటిలేదు. కంపెనీ వివిధ మోడళ్లను మిక్స్ అప్ చేసి సరికొత్త వేరియంట్లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలో పాత మోడల్ ఓలా ఎస్ 1 స్కూటర్ తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఓలా ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ పేరిట మూడు వేరియంట్లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు బేస్ మోడల్ ఎస్ 1 నిలిపివేతతో ఎస్1 ఎయిర్ స్కూటర్ బేస్ మోడల్ కానుంది. ఎస్1 ప్రో టాప్ మోడల్ గా అలాగే కొనసాగునుంది. కాగా ఎస్1 ఎయిర్ ప్రారంభం సందర్భంగా దాని ధరపై ప్రకటించిన తగ్గింపు ఆగస్టు 15 వరకూ కొనసాగుతుందని కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధంచిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎస్1 ఎయిర్ ప్రారంభ ధర ఇలా..
ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త బేస్ మోడల్ ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించింది. జూలై 27 నుంచి 31 వరకూ ప్రారంభ ధర రూ. 1.1 లక్షలుగా పేర్కొంటూ బుకింగ్స్ చేపట్టింది. తర్వాత దీనిని రూ. 1.2 లక్షలకు పెంచే అవకాశం ఉంది. అయితే ఈ స్కూటర్ ప్రీ బుకింగ్స్ హాట్ కేకుల్లా పూర్తయిపోయాయి. వినియోగదారుల నుంచి విపరీమైన స్పందన వచ్చింది. దీనిపై ఓలా సీఈఓ భవిష్ అగర్వాల ట్వీట్ చేస్తూ ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ కు 50,000 ప్రీ బుకింగ్స్ వచ్చాయని పేర్కొన్నారు. దీంతో ఈ రూ. 1.1లక్షలకే అందించే ఆఫర్ ను ఆగస్టు 15, మధ్యాహ్నం 12 గంటల వరకూ పొడిగించినట్లు వివరించారు.
- ఓలా ఎస్ 1 ఎయిర్ మోడల్ ను 2022, అక్టోబర్ లో తొలిసారిగా 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో లాంచ్ అయ్యింది. అప్పుడు దీని ధర రూే. 79,999గా ఉంది. 2023, ఫిబ్రవరిలో, కంపెనీ దీనిని మూడు వేరియంట్‌లకు విస్తరించింది, కానీ తర్వాత 2kWh మరియు 4kWh వేరియంట్‌లను తొలగించి, 3kWh వేరియంట్‌ను మాత్రమే ఉంచింది.
- ఓలా ఎస్1 ఎయిర్ ఇప్పుడు ఒకే 3kWh వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది, దీని ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఫేమ్-II సబ్సిడీతో సహా). గతంలో రూ.80,000తో స్కూటర్‌ను బుక్ చేసుకున్న కస్టమర్లు ఇప్పుడు ఎస్1 ఎయిర్ కావాలంటే పూర్తిగా రూ.1.1 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
- ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ 3kWh బ్యాటరీని కలిగి ఉంది. ఇది సింగిల్ చార్జ్ పై 125 కిమీల రేంజ్ ని అందిస్తుంది. దీనిలో మోటారు 4.5కిలోవాట్ల పీక్ పవర్‌తో గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.
ఇక ఇప్పుడు నిలిపివేసిన ఎస్1 స్కూటర్ విషయానికి వస్తే ఇది 3kWh బ్యాటరీని కూడా కలిగి ఉంది, కాబట్టి దానిని ఎస్1 ఎయిర్‌తో భర్తీ చేస్తూ.. అత్యంత సరసమైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌గా దీనిని పరిగణనలోకి తీసుకుంటున్నారు.



మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..