Post Office Special Scheme: మీ పెట్టుబడిని రెండింతలు చేసే బెస్ట్ ప్లాన్ ఇది.. రూ. 5లక్షలతో రూ. 10.5లక్షలు సంపాదించొచ్చు.. వివరాలు ఇవి..
మీరు ఒకవేళ ఎఫ్ డీ చేయాలనే ఆలోచనలో ఉంటే ఈ సారి బ్యాంకుకు బదులు పోస్ట్ ఆఫీసులో చేయండి. అక్కడ పోస్ట్ ఆఫీసు టైం డిపాజిట్ అనే స్కీమ్ ఉంటుంది. దీనిలో మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా పదేళ్లలో రెండింతల ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో మీకు వడ్డీ రేటు ఐదేళ్ల కాల వ్యవధిపై ఓపెన్ చేసే ఖాతాపై 7.5 శాతంగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మీరు ఏదైనా మంచి పథకంలో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారా? అధిక రాబడితో పాటు భద్రత కూడా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మీకిదే బెస్ట్ ఆప్షన్. సాధారణంగా పోస్ట్ ఆఫీసు పథకాలలు చాలా వరకూ భద్రంగ ఉంటాయి. అలాగే అధిక రాబడిని అందిస్తాయి. అటువంటి పథకాలలో పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒకటి. ఈ ఎఫ్‌డీలు బ్యాంకులతో పోల్చితే అధిక వడ్డీని అందిస్తాయి. మీరు ఒకవేళ ఎఫ్ డీ చేయాలనే ఆలోచనలో ఉంటే ఈ సారి బ్యాంకుకు బదులు పోస్ట్ ఆఫీసులో చేయండి. అక్కడ పోస్ట్ ఆఫీసు టైం డిపాజిట్ అనే స్కీమ్ ఉంటుంది. దీనిలో మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా పదేళ్లలో రెండింతల ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో మీకు వడ్డీ రేటు ఐదేళ్ల కాల వ్యవధిపై ఓపెన్ చేసే ఖాతాపై 7.5 శాతంగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
పోస్ట్ ఆఫీసు టైం డిపాజిట్..
పోస్ట్ ఆఫీసు ఫిక్స్ డ్ డిపాజిట్ లను టైం డిపాజిట్ అని పిలుస్తారు. ఈ పోస్ట్ ఆఫీసు టైం డిపాజిట్ స్కీమ్ లో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల కాలపరిమితితో ఖాతా ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఒక్కో టెర్మ్ కి ఒక్కో రకమైన వడ్డీ రేటు వస్తుంది. అధిక వడ్డీ రేటు కావాలంటే ఐదేళ్లు కాల వ్యవధితో ఖాతా ప్రారంభించాలి. ఒకవేళ మీరు డబ్బులను పదేళ్ల వ్యవధితో డిపాజిట్ చేస్తే రెండింతల కన్నా ఎక్కువ ఆదాయాన్ని సంపాదించవచ్చు. అదెలాగో చూద్దాం రండి..
మీ డబ్బులు రెండింతలు అవుతాయి..
పోస్ట్ ఆఫీస్ ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్ లో ప్రస్తుతం 7.5శాతం వడ్డీ రేటు వస్తోంది. ఈ లెక్క ప్రకారం మీరు ఒకవేళ రూ. 5 లక్షలను పోస్ట్ ఆఫీసులో ఈ పథకం కింద డిపాజిట్ చేస్తే.. ఐదేళ్లలో మీకు వచ్చే వడ్డీ రూ. 2,24, 974 అవుతుంది. అసలుతో ఈ వడ్డీ మొత్తాన్ని కలిపితే మొత్తం రూ. 7,24,974 అవుతుంది. ఈ సొమ్ము ఐదేళ్ల తర్వాత విత్ డ్రా చేయకుండా.. మరో ఐదేళ్లు కొనసాగిస్తే ఈ మొత్తం మెచ్యూరిటీ సమయానికి రూ. 10,51,175 అవుతుంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి రెండింతలకు పైగానే ఉంటుందన్నమాట. మీరు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశిస్తే ఈ పథకం చాలా బెస్ట్ అని నిపుణులు సైతం చెబుతున్నారు. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఆశించే వారికి ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఐదేళ్ల కాలానికి టైం డిపాజిట్ పై వడ్డీ రేట్లు ఇలా..
- 1 సంవత్సరం వ్యవధికి – 6.9%
- 2 సంవత్సరాల కాల పరిమితికి – 7.0%
- 3 సంవత్సరాల వ్యవధితో చేసే డిపాజిట్పై – 7.0%
- 5 సంవత్సరాల కాలపరిమితికి – 7.5%
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..