E-sprinto Amery E- Scooter: అమేజింగ్ ‘అమెరీ’.. స్టన్నింగ్ లుక్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
దిగ్గజ కంపెనీలతో పాటు పలు స్టార్టప్ లు కూడా ప్రస్తుతం మన దేశ మార్కెట్ పై ఫోకస్ పెట్టాయి. ఈ-స్ప్రింటో అమెరీ పేరుతో ఓ స్మార్టప్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. ఇది రూ. 1.20లక్షల ఎక్స్ షోరూం ధరతో మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నెమ్మదిగా అందరి అటెన్షన్ ను వాటి వైపు మళ్లుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహన శ్రేణి విపరీతమైన వృద్ధిని నమోదు చేస్తోంది. గత రెండేళ్లలో విభిన్న రకాల ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లు ఇక్కడ లాంచ్ అయ్యాయి. వాటిల్లో వినూత్న ఫీచర్లు, ఆసక్తికరం స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీని స్కూటర్లలో ఇవ్వడంతో వినియోగదారులు బాగా కనెక్ట్ అవుతున్నారు. దిగ్గజ కంపెనీలతో పాటు పలు స్టార్టప్ లు కూడా ప్రస్తుతం మన దేశ మార్కెట్ పై ఫోకస్ పెట్టాయి. ఈ-స్ప్రింటో అమెరీ పేరుతో ఓ స్మార్టప్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. ఇది రూ. 1.20లక్షల ఎక్స్ షోరూం ధరతో మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ-స్ప్రింటో అమెరీ డిజైన్ అండ్ లుక్..
మొదటిగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ ను పరిశీలిస్తే ఇది నియో రెట్రో డిజైన్ తో వస్తుంది. దీనిని చూడగానే కంటికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మ్యాట్ ఎల్లో, వైట్, మ్యాట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇది ప్లాస్టింగ్ బాడీతో స్టైలిష్ ఫినిష్ ను కలిగి ఉంటుంది. నాణ్యమైన ఫ్లోర్ బోర్డు, రైడ్ మోడ్ స్విచ్ లు, ముందు ప్యానల్స్ వంటివి హై క్వాలిటీ మెటీరియల్ తో చేయడంతో మొత్తం స్కూటర్ సోలిడ్ గా కనిపిస్తుంది.
ఈ-స్ప్రింటో అమెరీ పనితీరు ఇలా..
దీని పనితీరు బాగుంది. అధిక యాక్సెలరేషన్, స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దీనిలో 2.5కేడబ్ల్యూ మోటార్ ఉంటుంది. ఇది మంచి యాక్సెలరేషన్ ను అందిస్తుంది. దీని సాయంతో ట్రాఫిక్ లో కూడా సులభంగా బండి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. దీనిలో మూడు రైడింగ్ మోడ్లు ఉంటాయి. ఎకో, సిటీ, పవర్. దీని యాక్సెలరేషన్ అధికంగా ఉండటం వల్ల సిగ్నల్ లేదా ట్రాఫిక్ ఆగి మళ్లీ మొదలయ్యే సమయంతో బండి ముందుకు దూకుతుంది. అందుకే రైడర్లు దీనిని ప్రారంభించేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. హైవే మీద ఇది గంటకు 70కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతుంది.
ఈ-స్ప్రింటో అమెరీ బ్రేక్స్..
ఈ స్కూటర్ రైడర్ కు అనువుగా ఉంటుంది. మంచి రైడింగ్ లనుభవాన్ని అందిస్తుంది. సీటు మంచి సౌకర్యవంతమైన పొజిషన్ ను అందిస్తుంది. రైడర్ తో పాటు వెనకాల కూర్చొనే వ్యక్తికి కూడా మంచి కంఫర్ట్ ను ఇస్తుంది. ఎక్కువ దూరాలు ప్రయాణాలు చేసినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వెనుకవైపు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చారు. ముందు వైపు డిస్క్ బ్రేక్ ఉంటుంది.
ఈ-స్ప్రింటో అమెరీ బ్యాటరీ రేంజ్..
ఈ స్కూటర్ లో 60V, 50AH లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 95 నుంచి 110 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని రివ్యూయర్స్ చెబుతున్నారు. అయితే కంపెనీ మాత్రం 140కిలోమీటర్లు ఇస్తుందని క్లయిమ్ చేస్తోంది. బ్యాటరీని ఫుల్ గా చార్జ్ చేయడానికి నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది.
ఈ-స్ప్రింటో అమెరీ ఫీచర్లు..
ఇక ఫీచర్ల విషయానికి వస్తే దీనిలో యాంటీ థెఫ్ట్ అలారం, రిమోట్ కంట్రోల్ లాక్, మొబైల్ చార్జింగ్ సాకెట్, ఫైండ్ మై వెహికల్ ఫీచర్ ఉంటుంది. హాలోజెన్ హెడ్ లైట్లు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




