AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godavari EBLU Feo: సింగిల్ చార్జ్‌పై ఏకంగా 110కి.మీ., రూ. లక్షలోపు ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్..

గోదావరి ఇబ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్ దేశ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఇది స్టైలిష్ లుక్ లో అదరగొడుతోంది. దీని గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు, బడ్జెట్ ధరలో లభించే ఈ స్కూటర్ ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. అనేక అద్భుత ఫీచర్లు, సామాన్యులకు కూడా అందుబాటులో ధరలో రూపొందించారు. భారతీయ ఈ-స్కూటర్ మార్కెట్లో ఓలా ఆధిపత్యాన్ని సవాలు చేసే మోడల్ గా దీన్ని భావిస్తున్నారు.

Godavari EBLU Feo: సింగిల్ చార్జ్‌పై ఏకంగా 110కి.మీ., రూ. లక్షలోపు ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్..
Godavari Eblu Feo Electric Scooter
Madhu
|

Updated on: Mar 07, 2024 | 8:26 AM

Share

దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. పెరుగుతున్న పెట్రోలు ధరలతో మంచి ప్రత్యామ్నాయంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలు రకరకాల మోడల్ స్కూటర్లను మార్కెట్లోకి దింపుతున్నాయి. అనేక అత్యుత్తమ ఫీచర్లను వాటిల్లో అందిస్తున్నాయి. వేగం, సౌకర్యం, స్టైలిష్ గా తీర్చిదిద్దిన వాహనాలకు ప్రజల ఆదరణ కూడా ఎంతో బాగుంటోంది. ఈ క్రమంలో గోదావరి ఇబ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్ దేశ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఇది స్టైలిష్ లుక్ లో అదరగొడుతోంది. దీని గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు, బడ్జెట్ ధరలో లభించే ఈ స్కూటర్ ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. అనేక అద్భుత ఫీచర్లు, సామాన్యులకు కూడా అందుబాటులో ధరలో రూపొందించారు. భారతీయ ఈ-స్కూటర్ మార్కెట్లో ఓలా ఆధిపత్యాన్ని సవాలు చేసే మోడల్ గా దీన్ని భావిస్తున్నారు.

110 కిలోమీటర్ల రేంజ్..

ఇబ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్ 110 కిలోమీటర్ల రేంజ్, గంటలకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పనిచేస్తుంది. దీని మోటారు నుంచి మంచి టార్క్ అవుట్ పుట్ వెలువడుతుంది. 2.52 కేడబ్ల్యూ లిథియం అయాన్ బ్యాటరీ కలిగి ఉంది. ఈ మోడల్ ను 181 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఎస్1 ప్రీమియం ఓలా ఎలక్ట్రిక్ మోడళ్ల కంటే మెరుగైనదిగా చెప్పవచ్చు. ఇబ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్ పై ప్రయాణం చేసేటప్పుడు చార్జింగ్ గురించి చింతించకుండా, స్వేచ్ఛగా ముందుకు సాగవచ్చు. 110 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ తో 3,600 డబ్ల్యూహెచ్ మోటారుతో వస్తుంది. కొండ ప్రాంతాలను ఎక్కడానికి, మలుపుల్లో సులభంగా ప్రయాణించడానికి ఎంతో వీలుగా ఉంటుంది.

అనేక అంశాల్లో అత్యుత్తమం..

ఓలా మోడళ్ల కంటే గోదావరి ఈబీఎల్ ఎఫ్ఈఓ ఈ-ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం కొంచెం తక్కువే. అయితే ఇతర అంశాల్లో మాత్రం ఎంతో మెరుగ్గా ఉంది. సాలిడ్ యాక్సిలరేషన్, స్మూత్ హ్యాండ్లింగ్ తో లభిస్తోంది. బ్లూటూత్ కనెక్టివిటీ, జీవీఎస్ నావిగేషన్, యాంటీ – థెప్ట్ ఫీచర్ల, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ తో అత్యాధునికంగా తీర్చిదిద్దారు. సాఫీగా, సురక్షిత ప్రయాణానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. సరైనా స్టాపింగ్ పవర్ కోసం యాంటీ – లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) అమర్చారు. సైడ్ స్టాండ్ ఇండికేటర్, బ్యాక్ లైట్ ను మెరుగుపరిచారు.

ఇవి కూడా చదవండి

అందుబాటు ధర..

ఇక ధర విషయానికి వస్తే గోదావరి ఇబ్లూ ఫియో ఈ-ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.99,999. ఇది సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది. ఈ సెగ్మెంట్ లోని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఇబ్లూ ఫియో స్కూటర్ ధర, పనితీరు, భద్రత, మైలేజ్ తదితర అంశాలను పరిశీలిస్తే, ఇది సామాన్యులకు ఎంతో ఉగయోగకరంగా ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్ లో గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..