AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలులో ప్రయాణించేటప్పుడు ట్రైన్‌ టికెట్‌ పోగొట్టుకున్నారా? అయితే ఇది మీకోసమే.. డోంట్ వర్రీ.!

దూరప్రయాణాలు చేసేవాళ్లు ఎక్కవగా రైళ్లనే ఎంచుకుంటారు. రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రోజూ లక్షలమందిని రైళ్లు తమ గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి.

రైలులో ప్రయాణించేటప్పుడు ట్రైన్‌ టికెట్‌ పోగొట్టుకున్నారా? అయితే ఇది మీకోసమే.. డోంట్ వర్రీ.!
Train Ticket
Ravi Kiran
|

Updated on: Mar 07, 2024 | 9:21 AM

Share

దూరప్రయాణాలు చేసేవాళ్లు ఎక్కవగా రైళ్లనే ఎంచుకుంటారు. రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రోజూ లక్షలమందిని రైళ్లు తమ గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. అందుకే ప్రయాణికులు ముందుగానే టికెట్లను రిజర్వేషన్‌ చేయించుకుంటారు. వాటిని భద్రంగా దాచుకుంటారు. ఎంత భద్రంగా దాచుకున్నా ప్రయాణ సమయానికి ఒక్కోసారి టికెట్లను పోగొట్టుకుంటుంటారు కొందరు. తీరా రైలు ఎక్కిన తర్వాత టికెట్‌ కనిపించక ఇబ్బందులు పడతారు. ఇక టీటీ కూడా వారిని టికెట్‌ లేని ప్రయాణికుడిగానే పరిగణిస్తారు. అందుకే ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా భారతీయ రైల్వే ఓ ప్రత్యామ్నాయ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

టికెట్‌ పోయిన సందర్భంలో ప్రయాణానికి ఇబ్బంది రాకుండా డూప్లికేట్‌ టికెట్‌ను పొందే వీలును భారతీయ రైల్వే కల్పిస్తోంది. దీనికి కొంతమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. డూప్లికేట్‌ టికెట్‌ కోసం చార్ట్‌ ప్రిపేర్‌ కాకముందే రైల్వే ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ కౌంటర్‌ వద్దకు వెళ్లి విషయాన్ని తెలియజేయాలి. లేదంటే ఛార్ట్‌ ప్రిపేర్‌ అవ్వక ముందు, ఛార్ట్‌ ప్రిపేర్‌ అయిన తర్వాత ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. ఒకవేళ మీ టికెట్‌ కన్ఫర్మ్‌ అయి ఛార్ట్‌ ప్రిపేపర్‌ అవ్వకముందే రైల్వే అధికారులను సంప్రదిస్తే మీకు డూప్లికేట్ టికెట్‌ను జారీ చేస్తారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి క్లరికేజ్‌ ఛార్జీలు వసూలు చేస్తారు. RAC టికెట్లు ఉన్న వారు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఛార్ట్‌ ప్రిపేపర్‌ అయ్యాక.. పోయిన టికెట్‌ స్థానంలో డూప్లికేట్‌ టికెట్‌కు దరఖాస్తు చేస్తే మొత్తం ఫేర్‌లో 50 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. RAC టికెట్‌ కలిగిన వారికి ఈ సదుపాయం లేదు.

ఛార్ట్‌ ప్రిపేర్‌ అయ్యాక చిరిగిన టికెట్‌ స్థానంలో డూప్లికేట్‌ టికెట్‌ కోసం RAC టికెట్‌ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మొత్తం ఫేర్‌లో 25 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ డూప్లికేట్‌ టికెట్‌ తీసుకున్న తర్వాత ఒరిజినల్‌ టికెట్‌ దొరికితే ప్రయాణం కంటే ముందే రైల్వే అధికారులకు సమర్పిస్తే 5 శాతం ఛార్జీ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని రీఫండ్‌ చేస్తారు. ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకుంటే.. IRCTC అకౌంట్‌లోకి వెళ్లి టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Follow Us
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?