Kawasaki Ninja H2: కెప్టెన్ కూల్ ధోనీ వాడే స్పోర్ట్స్ బైక్ ఇది.. ధర తెలిస్తే షాక్
మన దేశంలో స్పోర్ట్స్ బైక్ లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా సెలబ్రిటీల్లో వీటిని వాడేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారిలో మన క్రికెట్ టీం ఇండియా స్టార్ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ముందు వరుసలో ఉంటారు. ఈయన వద్ద ప్రపంచంలోని హై ఎండ్ స్పోర్ట్స్ అండ్ రేస్ బైక్స్ చాలానే ఉన్నాయి. వాటిల్లో జపనీస్ సూపర్ బైక్ కవాసకీ నింజా హెచ్2ఆర్ ఒకటి. ఇది ప్రపంచంలో టాప్ స్పోర్ట్స్ బైక్ లలో ఒకటి. అంతలా ఈ బైక్ లో ఏముంది? తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..

క్రికెట్ స్టార్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. తన హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్, ఎఫర్ట్ లెస్ కీపింగ్ తో, కెప్టెన్ గా సూపర్ స్ట్రాటజీలతో టీంకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. అయితే ధోనీ చాలా మంది బైక్ రైడర్ అని కూడా చాలా మందికి తెలుసు. తనకు స్పోర్ట్స్, రేస్ బైక్స్ అంటే ఏంటో ఆసక్తి అని చాలా సందర్భాల్లో ఆయన కూడా చెప్పారు. తన వద్ద అనేక హై ఎండ్ స్పోర్ట్స్ బైక్ కూడా ఉన్నాయి. వాటిల్లో జపనీస్ సూపర్ బైక్ అయిన రోడ్ రీగల్ వెర్షన్ కూడా ఉంది. ఈ బైక్ ను సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
కవాసకీ నింజా హెచ్2ఆర్..
కవాసకీ నింజా హెచ్2ఆర్ బైక్ రెండ్ చక్రాలపై నడిచే మోన్ స్టర్ అని పిలుస్తారు. ఇది 998సీసీ, సూపర్ చార్జెడ్ ఫోర్ సిలెండర్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ 321 హెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కేవలం మూడు సెకండ్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 380 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. అందువల్ల ఇది పబ్లిక్ రోడ్లలో ప్రయాణించలేదు. ఈ కవాసకీ ఇప్పుడు హెచ్2ఆర్ కామర్ వెర్షన్ ను రీసెంట్ గా లాంచ్ చేసింది. అదే రోడ్ రీగల్ నింజా హెచ్2. దీనిని మనదేశంలో ఒకరు కలిగి ఉన్నారు. అదే ఎవరో కాదు.. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. ఈ నేపథ్యంలో రోడ్ రీగల్ నింజా హెచ్2 బైక్ ను గురించి తెలుసుకుందాం..
కవాసకీ నింజా హెచ్2 ఇంజిన్ సామర్థ్యం..
ఈ కొత్త మోడల్ బైక్ 998సీసీ ఇంజిన్ తో వస్తుంది. హెచ్2ఆర్ కన్నా తక్కువ పవర్ అవుట్ పుట్ ను అందిస్తుంది. లిక్విడ్ కూల్డ్, సూపర్ చార్జెడ్, ఇన్ లైన్ ఫోర్ సిలెండర్ ఇంజిన్ 239 హెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 142 ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మూడు సెకండ్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 294 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది.
కవాసకీ నింజా హెచ్2లో బ్రెంబో బ్రేక్స్..
నింజా హెచ్2 అత్యాధునిక బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది. అదే ప్రయాణించే వేగానికి బ్రేకింగ్ వ్యవస్థ సరిగా లేకుంటే కష్టం అందుకే ఎప్పుడు ఆగాలనుకుంటే అప్పుడు సులభంగా కంట్రోల్ అయ్యే విధంగా దీనికి ముందు వైపు 330ఎంఎం సెమీ ఫ్లోటింగ్ డిస్క్స్, వెనుకవైపు డ్యూయల్ రేడియల్ మౌంట్ 4 పిస్టన్ బ్రెంబో స్టైలెమా కాలిపర్స్, 250ఎంఎం డిస్క్ అపోస్డ్ 2 పిస్టన్ కాలిపర్ ఉంటుంది.
కవాసకి నింజా హెచ్2 సేల్..
ఎంఎస్ ధోనీ ఈ బైక్ ను 2015లో కొనుగోలు చేశారు. అప్పుడు దీని ధర రూ. 29లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో హెచ్2 అమ్మకాలు జరగడం లేదు. దీని స్థానంలో హెచ్2 ఎస్ ఎక్స్ స్పోర్ట్స్ టారెర్ అందుబాటులో ఉంది. ఇది కూడా 998సీసీ, సూపర్ చార్జెడ్ ఫోర్ సిలెండర్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 200హెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. నింజా హెచ్2 ఎక్స్ ఎక్స్ ధర మన దేశంలో రూ. 32.95లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి