Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2025 MG Comet EV: సుజుకీ వ్యాగన్-ఆర్ కన్నా తక్కువ ధరకు ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అంతే..!

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ కామెట్ కొత్త మోడల్ ను లాంచ్ చేసింది. 2025 ఎంజీ కామెట్ ఈవీ పేరిట సిటీ కారుగా దీనిని ఆవిష్కరించింది. దీనిలో అదనపు సౌకర్యాలు, అత్యాధునిక టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లను జోడించింది. దీనిలో మరో విషయం ఏమిటంటే ఈ కారు ధర ప్రస్తుతం మార్కెట్లో అత్యధిక సేల్స్ చేసే మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కన్నా తక్కువ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

2025 MG Comet EV: సుజుకీ వ్యాగన్-ఆర్ కన్నా తక్కువ ధరకు ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అంతే..!
Mg Comet Ev
Follow us
Srinu

|

Updated on: Mar 21, 2025 | 5:15 PM

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు దూసుకుపోతున్నాయి. వాటి ప్రతికూలతలు ఎలా ఉన్నా.. సేల్స్ మాత్రం తగ్గడం లేదు. దీంతో భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ దే అన్న ఉద్దేశంతో కంపెనీలు పెద్ద ఎత్తున వాహనాలు లాంచ్ చేస్తున్నాయి. వాటిల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే ఎంజీ బ్రాండ్ నుంచి వచ్చిన కామెట్ కు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. చిన్న కారు అయినప్పటికీ అందులోని ఫీచర్లు కొనుగోలుదారులకు ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కొత్త మోడల్ ను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2025 ఎంజీ కామెట్ ఈవీ లేదా కామెట్ బ్లాక్ స్టార్మ్ పేరిట లాంచ్ చేసింది. ఈ సిటీ కార్ ను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా, అనువైనదిగా పరిచయం చేసింది. దీని ప్రారంభ ధర రూ. 4.99లక్షలుగా పేర్కొంది. బ్యాటరీ సర్వీస్ ఆప్షన్ ధర కిలోమీటర్ కు రూ. 2.5కిలోమీటర్లు ఉంటుందని పేర్కొంది. ఈ కారు మెరుగైన ఇంటీరియర్ డిజైన్, అప్ గ్రేడెడ్ టెక్నాలజీ, అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది. ఈ కారును మీరు రూ. 11,000లను చెల్లించి ఎంజీ డీలర్స్ వద్ద బుక్ చేసుకోవచ్చు.

2025 ఎంజీ కామెట్ ఈవీ బ్యాటరీ సామర్థ్యం

కామెట్ బ్లాక్ స్టార్మ్ ఐదు వేరియంట్లలో కంపెనీ లాంచ్ చేసింది. ఎగ్జిక్యూటివ్, ఎగ్జైట్, ఎగ్జైట్ ఫాస్ట్ చార్జ్, ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ ఫాస్ట్ చార్జ్ పేరిట ఐదు మోడళ్లు తీసుకొచ్చింది. ఎగ్జైట్, ఎగ్జైట్ ఫాస్ట్ చార్జ్ వేరియంట్లలో సేఫ్టీ కోసం రియర్ పార్కింగ్ కెమెరా, పవర్ ఫోల్డింగ్ ఓఆర్వీఎంను యాడ్ చేశారు. ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ ఫాస్ట్ చార్జ్ వేరియంట్లలో ని క్యాబిన్ లో ప్రీమియం లెదరేట్ సీట్లు, 4 స్పీకర్ ఆడియో సిస్టమ్ ఇచ్చారు. ఫాస్ట్ చార్జింగ్ వెర్షన్లలో 17.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 230 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

ఎంజీ కామెట్ బ్లాక్ స్టార్మ్ ఫీచర్లు..

ఈ కారు డార్క్ క్రోమ్ సాయంతో స్టేరీ బ్లాక్ ఎక్స్ టీరియర్ ను కలిగి ఉంటుంది. బ్లాక్ బ్యాడ్జెస్, లోపల రెడ్ యాక్సెంట్స్ ఇచ్చారు. క్యాబిన్ లో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ ఫోటైన్ మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఎలక్రానికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంలు, 4 స్పీకర్ల ఆడియో సిస్టమ్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ వర్సెస్ 2025 ఎంజీ కామెట్ ఈవీ..

మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ బేస్ మోడల్ వ్యాగన్ ఆర్ ఎల్ ఎక్స్ఐ ధర న్యూ ఢిల్లీలో రూ. 5.64లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో టాప్ వేరియంట్ వ్యాగన్ ఆర్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ ఏటీ డ్యూయల్ టోన్ ధర రూ. 7.47లక్షల నుంచి ప్రారంభవుతుంది. ఇవి ఎక్స్ షోరూం ధరలు. కాగా ఈ ధరలను ఎంజీ కామెట్ తో పోల్చితే.. ఎంజీ కామెట్ ఈవీ ప్రారంభ ధర రూ. 4.99లక్షలు(ఎక్స్ షోరూం నుంచి) హై ఎండ్ వేరియంట్ ధర రూ. 9.67లక్షలు( ఎక్స్ షోరూం)గా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి