Electric Scooter: తస్సాదియ్యా ‘టెస్సారెక్ట్’.. సింగిల్ చార్జ్ పై 261కి.మీ. కొత్త ట్రెండ్ సెట్ చేస్తోందిగా..!
అల్ట్రావయోలెట్ కంపెనీ నుంచి కొత్త స్కూటర్ టెస్సారెక్ట్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. స్కూటర్ ఇంకా లాంచ్ కాకముందే ప్రీ బుకింగ్స్ లో టాప్ లేపింది. ప్రారంభ ఆఫర్ గా మొదటి 50,000 కస్టమర్లకు రూ. 1.20లక్షల(ఎక్స్ షోరూం) ధరకే స్కూటర్ అందిస్తామని కంపెనీ ప్రకటించడంతో కస్టమర్లు బుక్ చేసుకునేందుకు పోటీ పడ్డారు. దీనిలో అత్యాధునిక టెక్నాలజీని వాడారు. సేఫ్టీ ఫీచర్లను అందించారు.

ఎలక్ట్రిక్ స్కూటర్లకు మన దేశీయ మార్కెట్లో డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా సంప్రదాయ పెట్రోల్ ఇంజిన్ లతో పోల్చితే అత్యాధునిక సాంకేతికత సాయంతో, అదనపు ఫీచర్లను జోడించి ఎలక్ట్రిక్ స్కూటర్లను డిజైన్ చేసి మార్కెట్లోకి తీసుకొస్తుండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు క్యూ కడుతున్నారు. ఇందుకు నిదర్శనం ఇటీవల లాంచ్ అయిన ఓ హైపర్ మోడర్న్ ఎలక్ట్రిక్ స్కూటర్. అల్ట్రావయోలెట్ కంపెనీ నుంచి వచ్చిన టెస్సారెక్ట్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీ బుకింగ్స్ లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ స్కూటర్ ను పరిచయం చేసిన రెండు వారాల సమయంలో ఏకంగా 50,000 యూనిట్లు బుక్ అవడం కొత్త రికార్డని పరిశీలకులు చెబుతున్నారు. మన దేశీయ మార్కెట్లో టాప్ టెక్ ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఉన్న డిమాండ్ తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో అల్ట్రా వయోలెట్ టెస్సారెక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
అల్ట్రావయోలెట్ టెస్సారెక్ట్ ప్రారంభ ఆఫర్..
అల్ట్రావయోలెట్ టెస్సారెక్ట్ ఈ నెలలోనే మన దేశంలో లాంచ్ అయ్యింది. ఈ స్కూటర్ ప్రారంభ ఆఫర్ గా మొదటి 10,000 కస్టమర్లకు ఈ స్కూటర్ ను రూ. 1.20లక్షలకే అందిస్తామని పేర్కొంది. దీంతో బజ్ క్రియేటైంది. దీంతో కేవలం 48 గంటల్లోనే 20,000 బుకింగ్స్ సాధించింది. దీంతో కంపెనీ ఈ ప్రారంభ ఆఫర్ ను మొదటి 50,000 కస్టమర్లకు ఇదే ధరకు అందిస్తామని పేర్కొన్నారు.
సింగిల్ చార్జ్ పై 261 కిలోమీటర్లు..
టెస్సారెక్ట్ స్కూటర్ కు అల్ట్రావయోలెట్ మూడు బ్యాటరీ ఆప్షన్లను అందిస్తోంది. అందులో చిన్న ప్యాక్ 3.5కేడబ్ల్యూహెచ్ యూనిట్. ఇది సింగిల్ చార్జ్ పై 162 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. తర్వాత యూనిట్ 5కేడబ్ల్యూహెచ్ ఉంటుంది. దీని రేంజ్ 220కిలోమీటర్లు. టాప్ ఎండ్ వేరియంట్ 6కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దీని రేంజ్ ఏకంగా 261కిలోమీటర్లు ఉంటుంది.
టెస్సారెక్ట్ ఫీచర్లు..
ఈ స్కూటర్లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా రైడర్ కు అదనపు వెసులుబాటు కల్పిస్తూ, సేఫ్టీకి అధిక ప్రాధన్యం ఇస్తోంది. ఇంటిగ్రేటెడ్ రాడార్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్ టేకింగ్ అసిస్ట్, లేన్ చేంజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాక ఈ స్కూటర్లో రియల్ టైం కొలిషన్ అలర్ట్ కూడా ఉంటుంది. ఇది బండి క్రాష్ అవడాన్ని నిరోధించేందుకు ఉపయోగ పడుతుంది. అంతేకాక దీనిలో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా బ్యాటరీ రీ చార్జ్ అవుతుంది.
ధర, డెలివరీలు..
ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.20లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉన్నప్పటికీ అసలు ధర రూ. 1.45లక్షలు. కాగా దీనిని మీరు బుక్ చేసుకోవాలనుకుంటే రూ. 999 టోకెన్ అమౌంట్ చెల్లించి ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ డెలివరీలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభవుతాయని కంపెనీ పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి