FD Interest Rate: ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై అత్యధిక వడ్డీని అందించే బ్యాంకులు ఇవే.. పూర్తి వివరాలు
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును యథాతథంగా ఉంచినా.. కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డ రేట్లను సవరించాయి. ఈ నేపథ్యంలో ఏ బ్యాంకుల్లో వడ్డీ రేటు మారింది? ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ వస్తుంది? ఏ బ్యాంకులో వడ్డీ రేటు మారలేదు? పూర్తి వివరాలు..
పర్సనల్ బ్యాంకింగ్ లో అత్యధిక భద్రతతో పాటు అధిక రాబడినిచ్చే పథకాలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒకటి. ఇవి ప్రజల్లో బాగా ఆదరణ పొందాయి. అయితే ఈ ఖాతాలపై వడ్డీ రేటు ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా ఉంటాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును యథాతథంగా ఉంచినా.. కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డ రేట్లను సవరించాయి. ఈ నేపథ్యంలో ఏ బ్యాంకుల్లో వడ్డీ రేటు మారింది? ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ వస్తుంది? ఏ బ్యాంకులో వడ్డీ రేటు మారలేదు? పూర్తి వివరాలు చూద్దాం రండి..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎఫ్‌డీ..
ఈ బ్యాంకు ఎఫ్ డీలపై వడ్డీ రేట్లను సవరించింది. నిర్ధిష్ట కాల వ్యవధితో కూడిన కొత్త రేట్లను ప్రకటించింది. సాధారణ పౌరులు, సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచింది. 444 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల కోసం, బ్యాంక్ సాధారణ పౌరులకు వడ్డీ రేటును 6.80% నుంచి 7.25%కి అంటే 45 బీపీఎస్ పెంచింది. అలాగే 666 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును 7.25% నుండి 7.05%కి తగ్గించింది. ఈ కొత్త రేట్లు 2023 మే 18నుంచి అమలులోకి వచ్చినట్లు పీఎన్బీ వెబ్ సెట్లో ప్రకటించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎఫ్‌డీ రేట్లు..
ఈ బ్యాంకు కూడా రూ. 2 కోట్ల వరకు వచ్చే వడ్డీ రేట్లను పెంచింది. సాధారణ ప్రజలకు అత్యధికంగా 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఈ సవరించిన వడ్డీ రేట్లు మే 12 నుంచి అమలులోకి వచ్చాయి. బరోడా తిరంగ ప్లస్ డిపాజిట్ స్కీమ్‌గా 399 రోజుల కాలవ్యవధికి ప్రత్యేక డిపాజిట్‌పై బ్యాంక్ ఆఫ్ బరోడా అత్యధికంగా 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్..
ఈ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్లుపెంచింది. సాధారణ పౌరులకు 2.75% నుండి 7.20%, సీనియర్ సిటిజన్లకు 3.25% నుండి 7.70% మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. సాధారణ పౌరులకు 390 రోజుల నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో అత్యధిక వడ్డీ రేటు 7.20% ఇస్తోంది. సవరించిన వడ్డీ రేటు రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు మే 11, 2023 నుండి అమలవుతోంది.
యాక్సిస్ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు..
ఇతర బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్న లేదా అదే రీతిలో కొనసాగిస్తున్న సమయంలో ఊహించని విధంగా యాక్సిస్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ తాజా రేట్లు 2023 మే 18నుంచి అమలులోకి వచ్చాయి. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధిపై 3.5% నుంచి 7.10% మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది.
ఎస్బీఐ ఎఫ్ డీ రేట్లు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు 3% నుండి 7.10% మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. జూన్ 30, 2023 వరకు చెల్లుబాటు అయ్యే అమృత్ కలాష్ డిపాజిట్లపై 400 రోజుల వ్యవధిలో అత్యధిక వడ్డీ రేటు 7.10% ఇస్తోంది. ఈ రేట్లు 2023, ఫిబ్రవరి 15 నుంచి అమలవతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇది తన ఎఫ్ డీ ఖాతాలపై వడ్డీలను ఎటువంటి మార్పు చేయలేదు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు 3% నుండి 7.10% మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. అత్యధిక వడ్డీ రేటు 7.10% 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వ్యవధిలో అందించబడుతుంది. ఈ రేట్లు 2023 ఫిబ్రవరి 21 నుంచి అమలవుతున్నాయి. కొత్త ఆర్థిక సంవ్సతరంలో కూడా ఎటువంటి మార్పు బ్యాంకు చేయలేదు.
ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు..
రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు సాధారణ పౌరులకు ఐసీఐసీఐ బ్యాంక్ 3% నుండి 7.10% మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. అత్యధిక వడ్డీ రేటు 7.10% 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వ్యవధిలో అందిస్తోంది. ఈ రేటు 2023, ఫిబ్రవరి 24 నుంచి అమలులో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..