AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FASTag: ఫాస్టాగ్ ఖాతా పోర్టింగ్ ఎలా? పేటీఎం నుంచి మరో బ్యాంకుకు ఇలా సింపుల్ గా మారండి..

పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్) వినియోగదారులకు ఓ మెసేజ్ ఇచ్చింది. అదేంటంటే వారి సేవింగ్స్ ఖాతాలు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, ఎన్సీఎంసీ ఖాతాలలోని వినియోగదారు డిపాజిట్లపై ఆర్బీఐ ఆంక్షలు ప్రభావం చూపవని హామీనిచ్చింది. వాటి నిల్వలను ఇప్పటికీ ఉపయోగించవచ్చని పేర్కొంది.

FASTag: ఫాస్టాగ్ ఖాతా పోర్టింగ్ ఎలా? పేటీఎం నుంచి మరో బ్యాంకుకు ఇలా సింపుల్ గా మారండి..
Fastag
Madhu
|

Updated on: Mar 17, 2024 | 7:53 AM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆంక్షలు విధించిన విషయం అందరికీ తెలిసిందే. కొత్త ఖాతాలు తెరవడానికి లేకుండా నిషేధించింది. అయితే పేటీఎం ఆధారంగా నడిచే సేవలు నిలిచిపోకుండా వినియోగదారులు ప్రత్యామ్యాయాలు చూసుకునేందుకు కూడా గడువు విధించింది. అది మార్చి 15తో ముగిసింది. అంతేకాక ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఐహెచ్ఎంసీఎల్), నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌లను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేయకుండా చూసింది. కాగా ఇంకా పేటీఎం వ్యాలెట్లు, ఫాస్ట్ ట్యాగ్ లతో సహా కొత్త బ్యాంకులకు మారాల్సి ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేయడానికి అధికారం కలిగి ఉన్న 32 బ్యాంకుల నుంచి వినియోగదారులు ఫాస్ట్‌ట్యాగ్‌లను పొందాలని ఎన్ హెచ్ఏఐ సూచించింది. ఒకవేళ మీరు ఇప్పటికీ ఈ పని చేయకపోతే.. ఎలా చేయాలో తెలియకపోతే ఈ కథనం మీకు ఉపయోగపడుతుంది. దీనిలో పేటీఎం నుంచి కొత్త బ్యాంక్ కు మీ ఫాస్ట్ ట్యాగ్ ఖాతాను ఎలా పోర్ట్ చేసుకోవచ్చు సులభంగా అర్థమయ్యేలా స్టెప్ బై స్టెప్ గైడ్ అందిస్తున్నాం..

డీయాక్టివేట్ చేయాలి..

మీరు మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ ను పోర్టింగ్ చేసుకోవడానికి మొదటిగా మీరు మీ పేటీఎం అకౌంట్ ను డీయాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొత్త అకౌంట్ లోకి మారాల్సి ఉంటుంది.

పోర్టింగ్ ఎలా చేయాలంటే..

కొత్త బ్యాంక్ కస్టమర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్‌ని సంప్రదించి, వారి ఆదేశాలను అనుసరించండి. ముందు దరఖాస్తు చేసి, అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే పోర్టింగ్ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. మీ పోర్టింగ్ అభ్యర్థన ఆమోదం పొందినప్పుడు మీ కొత్త బ్యాంక్ మీకు నిర్ధారణ సందేశాన్ని పంపుతుంది. మీరు కొత్త బ్యాంక్ ఖాతాతో మీ ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగించడం ప్రారంభించవచ్చు.

ఇవి కూడా చదవండి

అయితే పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్) వినియోగదారులకు ఓ మెసేజ్ ఇచ్చింది. అదేంటంటే వారి సేవింగ్స్ ఖాతాలు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, ఎన్సీఎంసీ ఖాతాలలోని వినియోగదారు డిపాజిట్లపై ఆర్బీఐ ఆంక్షల ప్రభావం చూపవని హామీనిచ్చింది. వాటి నిల్వలను ఇప్పటికీ ఉపయోగించవచ్చని పేర్కొంది.

పేటీఎం చెబుతున్న దాని ప్రకారం, ఓసీఎల్, పీపీఎస్ఎల్ ఈ సమయంలో వివిధ బ్యాంకులకు నోడల్‌ను బదిలీ చేస్తాయి. వివిధ రకాల చెల్లింపు ఎంపికలను తన ఖాతాదారులకు అందించడానికి ఓసీఎల్ ఇతర బ్యాంకులతో పొత్తులను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

మీ ఫాస్ట్‌ట్యాగ్‌ని బదిలీ చేయాలా లేదా డియాక్టివేట్ చేయాలా అనే విషయాన్ని ఎంచుకునే ముందు మీ పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ వాలెట్‌లో ఎంత డబ్బు ఉందో మీకు తెలుసని నిర్ధారించుకోండి.

ఆన్‌లైన్‌లో కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయడానికి మీరు ఈ దశలను అనుసరించవచ్చు:

  • ‘మై ఫాస్టాగ్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
  • ఇ-కామర్స్ లింక్‌కి మళ్లించడానికి ‘ బై ఫాస్ట్‌ట్యాగ్‌’పై క్లిక్ చేయండి.
  • ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయండి. అది మీకు డెలివరీ అవుతుంది.
  • ‘మై ఫాస్టాగ్’ యాప్‌ను తెరవండి.
  • ‘యాక్టివేట్ ఫాస్ట్‌ట్యాగ్’పై క్లిక్ చేయండి.
  • అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌ని ఎంచుకోండి.
  • మీ ఫాస్ట్ ట్యాగ్ వాహన వివరాలను నమోదు చేయండి.
  • మీ ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేట్ అవుతుంది.
  • మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అలహాబాద్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్ వంటి సభ్య బ్యాంకుల నుంచి కూడా ఫాస్ట్‌ట్యాగ్‌లను కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్