AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal loans: పర్సనల్ రుణాలతో జాగ్రత్త సుమా.. ఒక శాతం వడ్డీ పెరిగినా అదనపు భారమే

జీవితంలో అనుకోని ఖర్చులు, అత్యవసర పరిస్థితులు, వైద్య చికిత్సలకు డబ్బులు అవసరమైనప్పుడు మనమందరం బ్యాంకులను ఆశ్రయిస్తాం. వాటి నుంచి రుణాలను తీసుకుని అవసరాలను తీర్చుకుంటాం. ఫైనాన్స్ వ్యాపారులతో పోల్చితే అతి తక్కువ వడ్డీకి బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. వాటిని ప్రతి నెలా సులభ వాయిదాలతో తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. బ్యాంకులు వివిధ రకాల రుణాలను మంజూరు చేస్తాయి. వాటిలో పర్సనల్ లోన్లు (వ్యక్తిగత రుణాలు) ఒకటి. మిగిలిన రుణాలతో పోల్చితే వీటికి వడ్డీ స్పల్పంగా పెరుగుతుంది. అయితే వడ్డీరేటు ఒక శాతం పెరిగినా మీ ఈఎంఐలపై తీవ్ర ప్రభావం పడుతుంది. రుణం తీర్చే సమయానికి అధిక మొత్తం అవుతుంది. ఈ నేపథ్యంలో పర్సనల్ లోన్ తీసుకునే ముందు గమనించాల్సిన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Personal loans: పర్సనల్ రుణాలతో జాగ్రత్త సుమా.. ఒక శాతం వడ్డీ పెరిగినా అదనపు భారమే
Loan
Nikhil
|

Updated on: Jun 20, 2025 | 3:00 PM

Share

ప్రయాణ అవసరాలు, ఇంటి మరమ్మతులు, విద్య, వైద్యానికి సంబంధించిన ఖర్చుల కోసం పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. దీనికి పూచీకత్తు అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల్లో త్వరగా మంజూరు చేస్తారు. మీరు ఎంపిక చేసుకున్న కాలవ్యవధికి అనుగుణంగా ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించవచ్చు. తద్వారా వడ్డీతో కలిసి రుణం తీర్చివేసే అవకాశం కలుగుతుంది. అయితే ఈ రుణాల్లో ఒక శాతం వడ్డీ రేటు పెరిగినా మీకు అదనపు భారం పడుతుంది. ఉదాహరణకు ఐదేళ్లకు రూ.5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంటే.. 12 శాతం వడ్డీతో కలిపి మీరు నెలకు రూ.11,122 చొప్పున ఈఎంఐగా చెల్లించాలి. అయితే వడ్డీ 13 శాతం అయితే మీ నెలవారీ వాయిదా రూ.11,377కు పెరుగుతుంది. అంటే మీరు రుణం పూర్తిస్థాయిలోె చెల్లించేటప్పటికీ రూ.15 వేలు అదనంగా కట్టాల్సి ఉంటుంది.

బ్యాంకులు పర్సనల్ లోన్లు మంజూరు చేసేటప్పుడు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. వాటి ఆధారంగా వడ్డీరేటును నిర్ణయిస్తాయి. కాబట్టి పర్సనల్ లోన్ తీసుకునేవారు ఈ కింద విషయాలు సక్రమంగా ఉండేలా చూసుకుంటే తక్కువ వడ్డీకి రుణాలను పొందే అవకాశం ఉంటుంది.

క్రెడిట్ స్కోర్

మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణం మంజూరు చేస్తాయి. సాధారణంగా 650 కన్నా ఎక్కువ స్కోర్ ఉంటే బాగుంటుంది.

ఇవి కూడా చదవండి

ఆదాయం

మీకు ప్రతి నెలా వచ్చే ఆదాయానికి అనుగుణంగా బ్యాంకులు నిర్ణయం తీసుకుంటారు. మీరు వాయిదాలు సక్రమంగా చెల్లిస్తారని భావించినప్పుడే రుణం ఇస్తాయి.

కాలపరిమితి

రుణాన్ని తిరిగి చెల్లించే కాల పరిమితిని ఎక్కువగా పెట్టుకుంటే ఈఎంఐ మొత్తం తగ్గుతుంది. కానీ వడ్డీరేటు బాాగా ఎక్కువవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ కాలపరిమితిని తగ్గించుకోవాలి.

రుణం

ఉత్తమ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి తక్కువ వడ్డీకే ఎక్కువ మొత్తంలో రుణం మంజూరు చేసే అవకాశం ఉంటుంది.

పర్సనల్ లోన్లకు వడ్డీరేటు ఎక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ మంది వీటిని తీసుకోవడానికి అనేక కారణాలున్నాయి. దాదాపు 24 గంటల్లోనే త్వరిత ఆమోదం, వేగవంతమైన చెల్లింపులు, 96 నెలల కాలపరిమితి, సులభమైన పార్ట్ ప్రీపేమెంట్, ఫోర్ క్లోజర్ ఎంపికలు వాటిలో ప్రధానమైనవి. కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఈఎంఐలను తెలివిగా చెల్లిస్తే వడ్డీ భారం నుంచి తప్పించుకోవచ్చు. దాని కోసం వీలైనంత వరకూ పార్ట్ ప్రీపేమెంట్లు చేయండి. దీని వల్ల అసలు మొత్తం తగ్గిపోతుంది. సమయానికి నెలవారీ వాయిదా చెల్లించండి. క్రెడిట్ స్కోర్ బాగుండేలా చర్యలు తీసుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి