AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF scheme: ఈపీఎఫ్‌లో చేరితే కోటీశ్వరులే..రిటైర్మెంట్ నాటికి నమ్మలేని రాబడి

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) పథకం గురించి మన దేశంలో దాదాపు అందరికీ తెలుసు. దీన్నే వాడుక భాషలో పీఎఫ్ అని సంభోదిస్తారు. ఇది ఒక పదవీ విరమణ పొదుపు పథకం. దేశంలో వివిధ కంపెనీల్లో పనిచేేసే ఉద్యోగులు, కార్మికులందరికీ ఈ పథకం అందుబాటులో ఉంది. దీనిలో చేరిన చందాదారుల జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తం మినహాయిస్తారు. ఆ డబ్బులను ఈపీఎఫ్ కు జమ చేస్తారు. అదే మొత్తాన్ని కంపెనీ యాజమాన్యం కూడా చందాదారుడి ఖాతాకు చెల్లిస్తుంది. ఆ ఉద్యోగి విరమణ అనంతరం పెద్ద మొత్తంలో డబ్బులు పొందుతాడు. ఈ నేపథ్యంలో ఒక ఉద్యోగి ఎలాంటి అంతరాయం లేకుండా ఈపీఎఫ్ కు డబ్బులు చెల్లిస్తూ ఉంటే, విరమణ నాటికి కళ్లు చెదిరే మొత్తం చేతికి అందుతుంది. ఆ లెక్కలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

EPF scheme: ఈపీఎఫ్‌లో చేరితే కోటీశ్వరులే..రిటైర్మెంట్ నాటికి నమ్మలేని రాబడి
Epfo
Nikhil
|

Updated on: Jun 20, 2025 | 3:30 PM

Share

ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంత జీవితం ప్రశాంతంగా, ఆర్థిక ఒడిదొడుకులు లేకుండా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం వివిధ పింఛన్ పథకాల్లో పెట్టుబడి పెడతారు. రిటైర్మెంట్ సమయానికి పెద్ద మొత్తంలో డబ్బులు అందేలా ప్లాన్ చేసుకుంటారు. అలాగే అందరికీ తెలిసిన ఈపీఎఫ్ పథకం నుంచి కూడా రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో డబ్బులు పొందవచ్చు. తద్వారా విశ్రాంత జీవితాన్ని ఒత్తిడి లేకుండా హాయిగా గడపవచ్చు. దీనికి క్రమశిక్షణ, ప్రణాళిక చాలా అవసరం.

ఈపీఎఫ్ అనే పదవీ విరమణ పొదుపు పథకాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ ఓ) నిర్వహిస్తుంది. 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీలన్నీ దీనిలో రిజిస్టర్ చేసుకోవాలి. తద్వారా ఆయా కంపెనీ ఉద్యోగులకు ఈపీఎఫ్ పథకం అమలవుతుంది. ప్రతి నెలా ఉద్యోగుల జీతం, డీఏలో 12 శాతాన్ని ఈపీఎఫ్ లో జమ చేస్తారు. అదే మొత్తాన్ని కంపెనీ కూడా ఉద్యోగి పేరున చెల్లిస్తుంది. ఈ 12 శాతంలో 8.33 శాతాన్ని పెన్షన్ ఫండ్ అయిన ఈపీఎస్ లో, మిగిలిన 3.67 శాతాన్ని ఈపీఎఫ్ లో జమ చేస్తారు. ప్రస్తుతం దీనిపై 8.25 శాతం వార్షిక వడ్డీ అమలు చేస్తున్నారు.

ఈపీఎఫ్ చందాదారులు రిటైర్మెంట్ సమయానికి అధిక మొత్తంలో డబ్బులు పొందే అవకాశం ఉంది. అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి
  • ఉదాహరణకు మీరు 25 ఏళ్లకు ఉద్యోగంలో చేరారు. మీ జీతం, డీఏ కలిసి నెలకు రూ.15 వేలు వస్తున్నాయని అనుకుందాం. మీ జీతం నుంచి 12 శాతం ఈపీఎఫ్ కు జమ చేస్తున్నారు. కంపెనీ సహకారం 3.67 శాతంగా ఉంది. ఏడాదికి జీతం 10 శాతం పెరుగుతూ వెళ్లింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 8.25 శాతం వడ్డీని లెక్కగడితే మీరు 58 ఏళ్లకు సుమారు రూ.62.70 లక్షలు చెల్లిస్తారు. రిటైర్మెంట్ నాటికి మీ పదవి విరమణ నిధి రూ.1.64 కోట్లు ఉంటుంది.
  • మీరు 25 ఏళ్ల వయసులో ఉద్యోగం చేరితే, మీకు బేసిక్, డీఏ రూ.25 వేలు అయితే, వార్షిక వేతన పెరుగుదల పది శాతంగా ఉంటే, రిటైర్మెంట్ నాటికి ఈపీఎఫ్ పథకం నుంచి రూ.3.12 కోట్లు పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి