Most Affordable SUVs: కారు చుట్టూ కెమెరాలే.. ఏ మూల ఏమున్నా తెలిసిపోతుంది. భద్రతకు పూర్తి భరోసా..
ఇటీవల కాలంలో భద్రతా ఫీచర్లకు ప్రాధాన్యం పెరిగింది. అందరూ కార్లలో సేఫ్టీ కి ఎయిర్ బాగ్స్ ఉండాలని కోరుకొంటున్నారు. అలాగే 360 డిగ్రీల కెమెరాలు పెట్టుకుంటున్నారు. ఇది కారులో కూర్చున్నప్పుడు లోపల స్క్రీన్ పై బయట పరిస్థితిని మనకు చూపుతుంది. కారు నడపడంలో కూడా సహాయ పడుతుంది.
మార్కెట్లో ఎన్ని రకాల కార్లు అందుబాటులో ఉన్నా వాటిల్లో వినియోగదారులు కొన్నింటి వైపే అధికంగా మొగ్గు చూపుతారు. ఇటీవల కాలంలో భద్రతా ఫీచర్లకు ప్రాధాన్యం పెరిగింది. అందరూ కార్లలో సేఫ్టీ కి ఎయిర్ బాగ్స్ ఉండాలని కోరుకొంటున్నారు. అలాగే 360 డిగ్రీల కెమెరాలు ఉండాలనుకొంటున్నారు. ఇది కారులో కూర్చున్నప్పుడు లోపల స్క్రీన్ పై బయట పరిస్థితిని మనకు చూపుతుంది. కారు నడపడంలో కూడా సహాయ పడుతుంది. ముఖ్యంగా కారుని వెనుకకు మళ్లించడానికి, పార్కింగ్ చేయడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. కారు చుట్టూ కెమెరాలు ఉంటాయి. లోపల ఓ సాఫ్టవేర్ సాయంతో స్క్రీన్ పై అన్ని కెమెరాలను మిక్స్ చేసి 360 డిగ్రీల కోణంలో చిత్రాలను మనకు చూపుతుంది. కనీసం నాలుగు కెమెరాలు ఈ ఫీచర్ కోసం వినియోగిస్తారు. అయితే ఈ 360 డిగ్రీల కెమెరా కలిగిన కార్లు కాస్త టాప్ వేరియంట్లలో మాత్రమే ఉంటుంది. వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ అటువంటి టాప్ వేరియంట్లలోనే కాస్త తక్కువ ధరకు లభ్యమవుతున్న టాప్ ఎస్ యూవీలను మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాం.
నిస్సాన్ మాగ్నైట్..
ఈ కారులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 100హెచ్‌పీ పవర్, 160ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంటుంది. ఇది 71హెచ్‌పీ పవర్, 96ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇందులో సేఫ్టీకి ఎయిర్ బ్యాగ్స్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, స్మార్ట్ కనెక్టివిటీ, చుట్టూ కెమెరాలతో కూడిన వీక్షణ మానిటర్ ఉంటుంది. క్యాబిన్ లో 7 అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వైర్ లెస్ చార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ మూడ్ లైటింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఏబీఎస్, ఈబీడీ, హెచ్ఎస్ఏ, హెచ్బీఏ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. దీన ధర రూ. 8.59లక్షల నుంచి రూ. 10.08లక్షల వరకూ ఉంటుంది.
మారుతి సుజుకీ బాలెనో..
దీనిలో 1.2 లీటర్, నాలుగు సిలిండర్ల కే12ఎన్ పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తోంది. 83బీహెచ్ పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. అలాగే సీఎన్జీ 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది 78పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 99ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఫ్రీ స్టాండింగ్ టచ్ స్క్రీన్ ఇన్ ఫోటైన్ మెంట్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. 9 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఇది వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలను సపోర్టు చేస్తుంది. ఇది 360 డిగ్రీల కెమెరాను కలిగి ఉంది. హెడ్ అప్ డిస్ ప్లే, కొత్త ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 9.33లక్షల నుంచి 9.88లక్షల రవకూ ఉంటుంది.
టయోటా గ్లాంజా..
ఇది బాలెనో ప్లాట్ ఫారమ్ పైనే తయారైంది. దీనిలో ఇంజిన్ సామర్థ్యాలు బాలెనో వలే ఉంటాయి. .2 లీటర్, నాలుగు సిలిండర్ల కే12ఎన్ పెట్రోల్ ఇంజిన్ తో నడుస్తోంది. 83బీహెచ్ పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. అలాగే సీఎన్జీ 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది 78పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 99ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఫ్రీ స్టాండింగ్ టచ్ స్క్రీన్ ఇన్ ఫోటైన్ మెంట్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది.ఇది వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలను సపోర్టు చేస్తుంది. అలాగే వైర్ సెల్ ఫోన్ చార్జింగ్, అలెక్సా వాయిస్ కమాండ్లు, హెడ్ అప్ డిస్ ప్లే, కొత్త ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీని ధర రూ. 9.63 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ ఉంటుంది.
మారుతి సుజుకీ ఫ్రాంక్స్..
దీనిలో 360 డిగ్రీల కెమెరా, హెడ్ అప్ డిస్ ప్లే, క్రూయిజ్ కంట్రోల్, లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ ఎక్స్ టీరియర్ కలర్స్, వైర్ లెస్ చార్జర్, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టవిటీతో కూడిన ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. 9 అంగుళాల టచ్ స్క్రీన్ , వెనుక వైపు సెపరేట్ కెమెరా ఉంటుంది. ఇది మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. దీని ధర రూ. 11. 48 లక్షల నుంచి రూ. 12.98లక్షల నుంచి ఉంటుంది.
మారుతి సుజుకీ బ్రెజ్జా..
దీనిలో కొత్త తరం కే సిరీస్ 1.5 డ్యూయల్ జెట్ డబ్ల్యూటీ ఇంజిన్ ఉంటుంది. ఇది స్మార్ట్ హై బ్రిడ్ టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. 103 హెచ్ పీ శక్తిని, 137 ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో బాలెనోలో ఉన్నట్లే 360 డిగ్రీల కెమెరా వ్యవస్థ ఉంటుంది. 9 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ టచ్ స్క్రీన్ ఇన్ఫో టైన్ మెంట్ సిస్టమ్ ఉంటుంది. వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. దీని ధర రూ. 12.48 లక్షల నుంచి రూ. 13.98 లక్షల వరకూ ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..