Health Insurance Policy: మధుమేహ రోగుల కోసం ప్రత్యేక ఆరోగ్యా బీమా పాలసీ.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

వయసు పైబడిన వారికి లేదా మధుమేహం మరియు రక్తపోటు వంటి ముందస్తు ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి జీవిత బీమా లేదా ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం అంత తేలికైన పని కాదు. వారు తిరస్కరణను ఎదుర్కొంటారు లేదా చాలా ఎక్కువ ప్రీమియంలను చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే, మరణం లేదా అనారోగ్యం సాపేక్షంగా ఎక్కువ ప్రమాదం ఉన్నందున బీమా సంస్థలు అలాంటి వ్యక్తులకు కవర్‌లను అందించడంలో జాగ్రత్త వహిస్తాయి.

Health Insurance Policy: మధుమేహ రోగుల కోసం ప్రత్యేక ఆరోగ్యా బీమా పాలసీ.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Insurence
Follow us
Srinu

|

Updated on: Jun 03, 2023 | 4:52 PM

ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా వివిధ వ్యాధులు అందరినీ వేధిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం, 18 ఏళ్లు పైబడిన 77 మిలియన్ల భారతీయులు మధుమేహంతో బాధపడుతున్నట్లు అంచనా వేశారు. వయసు పైబడిన వారికి లేదా మధుమేహం మరియు రక్తపోటు వంటి ముందస్తు ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి జీవిత బీమా లేదా ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం అంత తేలికైన పని కాదు. వారు తిరస్కరణను ఎదుర్కొంటారు లేదా చాలా ఎక్కువ ప్రీమియంలను చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే, మరణం లేదా అనారోగ్యం సాపేక్షంగా ఎక్కువ ప్రమాదం ఉన్నందున బీమా సంస్థలు అలాంటి వ్యక్తులకు కవర్‌లను అందించడంలో జాగ్రత్త వహిస్తాయి. అయితే, ఇప్పుడు బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రత్యేకంగా మధుమేహ వ్యాధిగ్రస్తులను లక్ష్యంగా చేసుకుని ఒక ప్లాన్‌ను ప్రారంభించింది.

ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు స్వచ్ఛమైన రక్షణ కవచంలా నిలుస్తుంది. డయాబెటీస్‌తో బాధపడుతున్న భారతదేశ జనాభాలో గణనీయమైన సంఖ్యలో పెరుగుతున్నారు. భవిష్యత్‌లో ఏకంగా మరో 25 మిలియన్ల మందికి డయాబెటిస్‌తో ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా మధుమేహాన్ని దీర్ఘకాలిక వ్యాధిగా పేర్కొనడంతో, దానితో బాధపడుతున్న వారు తమ కుటుంబ అవసరాలను ఆర్థికంగా భద్రపరచడానికి సమగ్రమైన లైఫ్‌కవర్‌ను పొందడం సవాలుగా పరిగణిస్తారు. అలాంటి వారి కోసం డయాబెటిక్-నిర్దిష్ట టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రారంభిస్తున్నట్లు బజాజ్ అలయన్స్ లైఫ్ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి పాలసీలో పాలసీదారు మరణించిన సందర్భంలో వారిపై ఆధారపడిన వారికి బీమా మొత్తం చెల్లిస్తారు. అయితే పాలసీదారుడు పాలసీ వ్యవధి పూర్తయ్యాక కూడా జీవించి ఉంటే ఎటువంటి మెచ్యూరిటీ ప్రయోజనాలకు అర్హులు కారు. అయితే ఈ పాలసీ వల్ల కలిగే లాభాలు ఏంటో ఓ లుక్కేద్దాం.

బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ డయాబెటిక్ టర్మ్ ప్లాన్ సబ్ 8 హెచ్‌బీఏ1సీ టైప్ 2 డయాబెటిక్, ప్రీ-డయాబెటిక్ వ్యక్తులను లక్ష్యంగా రూపొందించారు. పేరుకు తగినట్లుగా 8 వరకు హెచ్‌బీఏ1సీ  (గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్) ఉన్న ప్రీ-డయాబెటిక్స్, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ కవర్‌ను కొనుగోలు చేయడానికి అర్హులు. ముఖ్యంగా ఈ పాలసీ డయాబెటిక్ కస్టమర్‌లకు వారి ఆరోగ్యాన్ని నిర్వహించడంతో పాటు కుటుంబానికి బీమా కవరేజీని అందించడానికి రూపొందించారు. ఖాతాదారులు హెచ్‌బీఏ1సీ మరుసటి సంవత్సరం పునరుద్ధరణ సమయంలో బేస్ ప్రీమియంపై 10 శాతం తగ్గింపు పొందవచ్చు. ముఖ్యంగా బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాలసీల్లో మొదటిదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా డయాబెటిక్ రెగ్యులర్ టర్మ్ ప్లాన్‌లను కొనుగోలు చేస్తారు. ఒకవేళ వారి అంతగా ఆరోగ్యంగా లేకుంటే, ప్రీమియంపై లోడింగ్‌ను వసూలు చేస్తూ ఉంటారు. అయితే ఈ అదనపు వసూలు మధుమేహం, ఇతర సహ-వ్యాధులు, ఇన్సులిన్ డిపెండెన్సీ మొదలైన వాటితో సహా అనేక అంశాలపై రేటు పెరుగుదల ఆధారపడి ఉంటుంది. ఈ లోడింగ్ వయస్సు, మధుమేహం, తీవ్రత మరియు ఇతర కారకాలతో పాటు బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) ఆధారంగా 25 శాతం నుండి 100 శాతం వరకు ఉండవచ్చు. ఈ సరికొతక్త డయాబెటిక్ పాలసీ ప్రకారం డయాబెటిక్, ధూమపానం చేయని 35 ఏళ్ల పురుష దరఖాస్తుదారు రూ. 26,838 (జీఎస్టీతో సహా) వార్షిక ప్రీమియం చెల్లిస్తే రూ. 1 కోటి హామీ మొత్తంగా ఉంటుంది. అలాగే ఈ పాలసీ వ్యవధి 20 సంవత్సరాలుగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి