Credit Cards: క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడం ఎలా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి..
ఎక్కువ కార్డులను మెయింటేన్ చేయడం కాస్త కష్టం. పైగా రిస్క్. అందుకే ఎక్కువగా వినియోగించని కార్డులను క్లోజ్ చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే క్రెడిట్ కార్డును తీసుకోవడం తెలుసు, వినియోగించుకోవడం తెలుసు, మరీ కార్డును ముగించాలంటే ఏం చేయాలి? దానికి సులువైన పద్ధతులేవి? వాటి గురించి తెలుసుకుందాం రండి..

ఇటీవల కాలంలో అందరి దగ్గర క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల వద్ద ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. కొంతమంది దగ్గర రెండు మూడు కార్డులు కూడా ఉంటున్నాయి. వీటి ద్వారా అనేక ప్రయోజనాలు ఉండటం, ఆన్ లైన్, ఆఫ్ లైన్ ప్లాట్ పారాలు పలు డిస్కౌంట్లను అందిస్తుండటంతో వీటిని అధికంగా వినియోగిస్తున్నారు. అయితే ఎక్కువ కార్డులను మెయింటేన్ చేయడం కాస్త కష్టం. పైగా రిస్క్. అందుకే ఎక్కువగా వినియోగించని కార్డులను క్లోజ్ చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే క్రెడిట్ కార్డును తీసుకోవడం తెలుసు, వినియోగించుకోవడం తెలుసు, మరీ కార్డును ముగించాలంటే ఏం చేయాలి? దానికి సులువైన పద్ధతులేవి? సాధారణంగా పలు రకాలుగా క్రెడిట్ కార్డు రద్దు చేయాలని దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కస్టమర్ కేర్..
క్రెడిట్ కార్డు కలిగిన వినియోగదారుడు ఆ కార్డు జారీ చేసిన బ్యాంకు కస్టమర్ కేర్ కు కాల్ చేయడం ద్వారా కార్డును రద్దు చేయాలని కోరవచ్చు. క్రెడిట్ కార్డులను జారీ చేసే అన్ని బ్యాంకులు తమకు ప్రత్యేకమైన హెల్ప్ లైన్ నంబర్లను కలిగి ఉంటాయి. వాటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేయొచ్చు..
వినియోగదారుడు తన క్రెడిట్ కార్డు క్లోజ్ చేయమని లెటర్ రాయోచ్చు. ఓ పేపర్ పై వినియోగదారుడి వివరాలు, కార్డు వివరాలు పొందుపరచి బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. దానిని బ్యాంక్ మేనేజర్ పరిశీలించి క్రెడిట్ కార్డును క్లోజ్ చేస్తారు.
ఈ-మెయిల్ చేయొచ్చు..
బ్యాంకు అధికారిక మెయిల్ ఐడీకి రిక్వెస్ట్ మెయిల్ పంపడం ద్వారా క్రెడిట్ కార్డును రద్దు చేయించుకోవచ్చు. ప్రతి బ్యాంకుకు ఫిర్యాదులు, సూచనల కోసం ప్రత్యేకమైన ఈ-మెయిల్ ఐడీలు ఉంటాయి. వాటని తెలుసుకొని అవసరమైన సమాచారాన్ని ఆ మెయిల్లో ఉంచి పంపడం ద్వారా కార్డును రద్దు చేసుకోవచ్చు.
ఆన్ లైన్లో కూడా..
మీకు అవసరం లేని క్రెడిట్ కార్డును ఆన్ లైన్ విధానంలో కూడా రద్దు చేసుకోవచ్చు. అందుకోసం ఆన్ లైన్లో బ్యాంకు అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి ఫారం నింపి రిక్వెస్ట్ పంపొచ్చు.
ఈ విషయాలు మర్చిపోవద్దు..
- మీరు మీ క్రెడిట్ కార్డు రద్దు చేయాలని కోరే ముందు కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా అవుట్ స్టాండింగ్ మొత్తాన్ని క్లియర్ చేశారని నిర్ధారించుకోవాలి.
- అలాగే ఆ కార్డుపై ఉన్న రివార్డు పాయింట్లు ఉంటాయి. ఆ రివార్డు పాయింట్లన్నీ రిడీమ్ చేసుకున్నారని నిర్ధారించుకోవాలి.
- క్రెడిట్ కార్డు క్లోజ్ చేసే ముందు ఆ కార్డుపై అప్పటికే ఉన్న ఆటోమేటిక్ పే, బిల్, పేమెంట్ వంటి ఆప్షన్లను క్లియర్ చేసుకోవాలి.
- బ్యాంకులు చివరి నిమిషంలో రద్దు చేసే కార్డులకు ఎలాంటి చార్జీలు వసూలు చేయదు. అయితే మీ గత లావాదేవీలను క్షుణ్ణంగా తనిఖి చేసుకొని కార్డును క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..