Car loans: కొత్త కారు కొనడానికి ఇదే ‘అక్షయ’ తరుణం.. పిలిచి మరీ లోన్లు ఇస్తున్న బ్యాంకులు.. త్వరపడండి..
కారు కొనుగోలు చేయడానికి సాధారణంగా బ్యాంకు రుణాలపై ఆధారపడతారు. ఈ అక్షయ తృతీయకు బ్యాంకులు బెస్ట్ డీల్ ను అందిస్తున్నాయి. కారు లోన్ల పై వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులపై ఆఫర్ల ప్రకటించాయి. నాలుగు సంవత్సరాల కాల వ్యవధితో రూ. 10 లక్షల రుణంపై 8.70 నుంచి 9.10 శాతం మధ్య వడ్డీ రేట్ల ను వసూలు చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఆయా వివరాలన్నీ తెలుసుకుందాం.
అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకం. దానికి అనుగుణంగా గానే జ్యుయలరీ షాపులు అనేక ఆఫర్లు ప్రకటిస్తాయి. బంగారం, వెండి వస్తువులతో పాటు డైమండ్ జ్యుయలరీపై కూడా డిస్కౌంట్లు ఇస్తాయి. ఆ రోజు గోల్డ్ షాపులన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడతాయి. అయితే కారు కొనుగోలు చేయడానికి కూడా అక్షయ తృతీయ మంచిదని పలువురి నమ్మకం.
కొత్తకార్ల కొనుగోలుకు రుణాలు..
కారు కొనుగోలు చేయడానికి సాధారణంగా బ్యాంకు రుణాలపై ఆధారపడతారు. ఈ అక్షయ తృతీయకు బ్యాంకులు బెస్ట్ డీల్ ను అందిస్తున్నాయి. కారు లోన్ల పై వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులపై ఆఫర్ల ప్రకటించాయి. నాలుగు సంవత్సరాల కాల వ్యవధితో రూ. 10 లక్షల రుణంపై 8.70 నుంచి 9.10 శాతం మధ్య వడ్డీ రేట్ల ను వసూలు చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఆయా వివరాలన్నీ తెలుసుకుందాం.
వివిధ బ్యాంకులు, వాటి వడ్డీరేట్లు..
ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కారు కొనుగోలుకు రూ. 10 లక్షల వరకూ రుణం అందిస్తుంది. దీనిపై వడ్డీ 8.70 శాతం వసూలు చేస్తుంది. నాలుగేళ్ల కాలపరిమితి విధించింది. ప్రతి నెలా రూ.రూ. 24,565 ఈఎమ్ఐ చెల్లించాలి.
- దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కార్ లోన్లు మంజూరు చేస్తుంది. ఈ బ్యాంకులో వడ్డీరేటు 8.75 శాతం ఉంది.
- పంజాబ్ నేషనల్, కెనరా, ఇండియన్ బ్యాంకులతో పాటు ఇతర బ్యాంకులలో కూడా ఈ సౌకర్యం ఉంది. నాలుగు సంవత్సరాల కాలవ్యవధితో 8.75 శాతం వడ్డీకి కొత్త కారు రుణాలను అందిస్తున్నాయి. ఈ బ్యాంకులలో ఈఎమ్ఐగా రూ. 24,587 చొప్పున కట్టాలి.
- బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కారు రుణాలపై వడ్డీరేటు 8.85 శాతం ఉంది. ప్రతినెలా రూ. 24,632లను ఈఎమ్ఐగా చెల్లించాలి.
- ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త కారు కొనుగోలుకు నాలుగు సంవత్సరాల కాలవ్యవధితో రూ.10 లక్షల రుణం ఇస్తుంది. ఈ బ్యాంకులో వడ్డీరేటు 8.90 శాతం ఉంది. ఈఎమ్ఐగా రూ.రూ. 24,655 ఉంటుంది.
ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు..
- ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు సెక్టార్ లోని బ్యాంకులు సైతం కారు కొనుగోలుకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. వాటిలో ఇచ్చే రుణం, వడ్డీ రేట్లు ఈ కింద విధంగా ఉన్నాయి.
- ఐసీఐసీఐ బ్యాంకు నాలుగేళ్ల కాలపరిమితికి కారు రుణాలను మంజూరు చేస్తుంది. ఈ బ్యాంకులో రూ.10 లక్షల రుణంపై వడ్డీరేటు 9.10 శాతం ఉంది. ఈఎమ్ఐ రూ.24,745 పడుతుంది.
- యాక్సిస్ బ్యాంక్ లో వడ్డీ రేటు 9.30 శాతం ఉంది. నాలుగేళ్ల కాలవ్యవధితో రూ.పది లక్షల రుణం మంజూరు చేస్తుంది. రూ.24,835 చొప్పున ఈఎమ్ఐలు చెల్లించాలి.
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లో కొత్త కారు కొనుగోలుకు రూ.10 లక్షల రుణం ఇస్తున్నారు. నాలుగు సంవత్సరాల కాలపరిమితితో 9.40 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. ఈ బ్యాంకులో ఈఎమ్ఐ రూ. 24,881 చొప్పున కట్టాలి.
సంబంధిత బ్యాంకులలో ఏప్రిల్ 23 నాటికి ఉన్న వడ్డీరేట్లు ఇవి. కారు కొనుగోలు చేయాలనుకునేవారు ఆయా బ్యాంకులు మంజూరు చేసే రుణం, వడ్డీరేట్లను పరిశీలించి రుణం తీసుకోవాలి. రూ.పది లక్షల రుణంపై వసూలు చేసే వడ్డీ, ఈఎమ్ ఐలుగా కట్టాల్సిన మొత్తం తదితర వివరాలు ఉన్నాయి. అయితే బ్యాంకు నిబంధనలు, షరతుల ప్రకారం మారే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..