FD Interest Rate: ఎఫ్‌డీ చేస్తే ఈ బ్యాంకుల్లోనే చేయాలి.. అధిక వడ్డీ.. అధిక భరోసా..
ప్రస్తుతం మన దేశంలో వడ్డీ రేట్లు అధికంగానే ఉన్నాయి. అది డిపాజిట్లకు అయినా లోన్లకు అయినా వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత నెలలో జరిగిన మానిటరీ పాలసీ ట్రాన్స్‌మిషన్ సమయంలో ఈ విషయాన్ని సూచన ప్రాయంగా తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల గురించి చూస్తే ఐసీఐసీఐ బ్యాంక్ లో చేసే ఎఫ్‌డీలపై 7.60శాతం, ఎస్‌బీఐ ఎఫ్‌డీ 7.50శాతం, పీఎన్‌బీలో 7.75శాతం వడ్డీ రేటు అందిస్తోంది.

ప్రజలు సురక్షిత పెట్టుబడి పథకం భావించే అత్యధికంగా పెట్టుబడి పెట్టే పథకాలలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ప్రథమ స్థానంలో ఉంటాయి. వీటిలో కచ్చితమైన రాబడితో పాటు అధిక వడ్డీ, పన్ను ప్రయోజనాలు కూడా ఉండటంతో మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మన దేశంలో ఎఫ్డీ వడ్డీ రేట్లు అధికంగానే ఉన్నాయి. అది డిపాజిట్లకు అయినా లోన్లకు అయినా వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత నెలలో జరిగిన మానిటరీ పాలసీ ట్రాన్స్‌మిషన్ సమయంలో ఈ విషయాన్ని సూచన ప్రాయంగా తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల గురించి చూస్తే ఐసీఐసీఐ బ్యాంక్ లో చేసే ఎఫ్‌డీలపై 7.60శాతం, ఎస్‌బీఐ ఎఫ్‌డీ 7.50శాతం, పీఎన్‌బీలో 7.75శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), ఐసీఐసీఐ బ్యాంక్‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల మధ్య వడ్డీ రేట్ల తేడాలు ఇప్పుడు చూద్దాం.
బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా..
ఎస్‌బీఐ ఎఫ్‌బీ రేటు (రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై)..
- 7 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
- 46 రోజుల నుండి 179 రోజులు: సాధారణ ప్రజలకు 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం
- 180 రోజుల నుంచి 210 రోజుల వరకు: సాధారణ ప్రజలకు5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.75 శాతం
- 211 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు: సాధారణ ప్రజలకు 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం
- 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు 6.80 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం
- 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
- 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.00 శాతం
- 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు (రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై)..
- 7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
- 15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
- 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
- 46 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం
- 91 రోజుల నుంచి 179 రోజులు: సాధారణ ప్రజలకు 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం
- 180 రోజుల నుంచి 270 రోజులు: సాధారణ ప్రజలకు 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం
- 271 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు: సాధారణ ప్రజలకు 5.80 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.30 శాతం
- 1 సంవత్సరం: సాధారణ ప్రజలకు 6.80 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం
- 1 సంవత్సరం నుంచి 443 రోజులు పైన: సాధారణ ప్రజలకు 6.80 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం
- 444 రోజులు: సాధారణ ప్రజలకు 7.25 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం
- 445 రోజుల నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 6.80 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం
- 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
- 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.00 శాతం
- 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పైన: సాధారణ ప్రజలకు 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం.
ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు (రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై)..
- 7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
- 15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
- 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
- 46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం
- 61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం
- 91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం
- 121 రోజుల నుంచి 150 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం
- 151 రోజుల నుంచి 184 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం
- 185 రోజుల నుంచి 210 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం
- 211 రోజుల నుంచి 270 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం
- 271 రోజుల నుంచి 289 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం
- 290 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు: సాధారణ ప్రజలకు 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం
- 1 సంవత్సరం నుంచి 389 రోజులు: సాధారణ ప్రజలకు 6.70 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం
- 390 రోజుల నుంచి 15 నెలల లోపు: సాధారణ ప్రజలకు 6.70 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం
- 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం
- 18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం
- 2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
- 3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
- 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 6.90 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..