AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Fuel Efficient Bikes: అధిక మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. టాప్ బ్రాండ్లు.. నమ్మశక్యం కానీ ధరల్లో..

బండి ఇంజిన్ సామర్థ్యం, లైఫ్, కంఫర్ట్, ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో పాటు మైలేజీని కూడా పరిశీలిస్తాం. తరచూ ఎక్కువ దూరాలు ప్రయాణించే వారు, చిరు వ్యాపారులు, మార్కెటింగ్ సంస్థల్లో పనిచేసే వారు తప్పనిసరిగా ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాలనే కొనుగోలు చేస్తుంటారు. మరి మన దేశంలో అందుబాటులో ఉన్న బైక్ లలో ఏది అధిక మైలేజీ ఇస్తుంది? తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.

Best Fuel Efficient Bikes: అధిక మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. టాప్ బ్రాండ్లు.. నమ్మశక్యం కానీ ధరల్లో..
Budget Bikes
Madhu
|

Updated on: Mar 05, 2024 | 8:22 AM

Share

సామాన్య, మధ్య తరగతి వారి జీవితంలో ద్విచక్ర వాహనం ఒక భాగమైంది. ఉదయాన్నే పాలు పోసే వారి దగ్గర నుంచి కూరగాయలు, పండ్లు విక్రయించే వారందరూ వీటినే ఉపయోగిస్తారు. ఇక ప్రయాణానికి, కొన్ని రకాల సరుకుల రవాణాకు ఇవే ఆధారం. రైతులు కూడా పొలాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ద్వి చక్ర వాహనాలపైనే వేరే చోటుకి తరలిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ వాహనాలను కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. బండి ఇంజిన్ సామర్థ్యం, లైఫ్, కంఫర్ట్, ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో పాటు మైలేజీని కూడా పరిశీలిస్తాం. తరచూ ఎక్కువ దూరాలు ప్రయాణించే వారు, చిరు వ్యాపారులు, మార్కెటింగ్ సంస్థల్లో పనిచేసే వారు తప్పనిసరిగా ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాలనే కొనుగోలు చేస్తుంటారు. మరి మన దేశంలో అందుబాటులో ఉన్న బైక్ లలో ఏది అధిక మైలేజీ ఇస్తుంది? తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి. దీనిలో హీరో స్పెండర్ ప్లస్ నుంచి బజాజ్ పల్సస్ ఎస్ఎస్ 125 వరకూ వివిధ రకాల మోటారు సైకిళ్ల సామర్థ్యం, అవి ఇచ్చే మైలేజ్ లను అందిస్తున్నాం..

దేశంలోని ఆటోమొబైల్ మార్కెట్ లో మోటారు సైకిళ్లు, స్కూటర్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉండే మన దేశంలో వీటికే డిమాండ్ అధికం. ప్రజలు తమ రాకపోకలకు వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఐసీఈ పవర్ నుంచి ఎలక్ట్రిక్ వరకూ మన మార్కెట్లో మోటారు సైకిళ్లు, స్కూటర్లు లభిస్తున్నాయి. వీటి మైలేజ్, ఇంజిన్ సామర్థ్యాలు ఇలా ఉన్నాయి.

హీరో స్లెండర్ ప్లస్ ఎక్స్ టెక్.. హీరో స్లెండర్ ప్లస్ ఎక్స్ మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 79,911 నుంచి (ఎక్స్ షోరూమ్) ప్రారంభమవుతుంది. ఈ బండి ఇంజిన్ సామర్థ్యం 97.2 సీసీ. అలాగే 8 బీహెచ్ పీ పవర్ ను, 8 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ పెట్రోలుకు 80.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

హీరో హెచ్ఎఫ్ డీలక్స్.. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ధర నుంచి 59,998 నుంచి 68,768 వరకూ పలుకుతుంది. దీని ఇంజిన్ సామర్థ్యం 97.2 సీసీ. 8 బీహెచ్ ప్ పవర్ ను, 8 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బండి లీటర్ పెట్రోలుకు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

టీవీఎస్ రైడర్.. టీవీఎస్ రైడర్ 95,219 నుంచి రూ.1.03 లక్షల ధరలో మార్కెట్ లో అందుబాటులో ఉంది. దీనికి 124.8 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. 11.4 బీహెచ్ పీ పవర్, 11 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే లీటర్ పెట్రోలుకు 67 కిలోమీటర్లు ఇస్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125.. బజాబ్ పల్సర్ రూ. 99,571 (ఎక్స్ షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది. దీని ఇంజిన్ సామర్థ్యం 124.45 సీసీ. 12 బీహెచ్ పీ, 11 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బండి లీటర్ కు 65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..