FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలంటే ఈ బ్యాంకులే బెస్ట్.. వృద్ధులకైతే మరింత అధిక వడ్డీ
సీనియర్ సిటిజన్ల తమ ఫిక్స్ డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీని కొన్ని బ్యాంకులు అందజేస్తున్నాయి. దాదాపు 8.1 శాతం వడ్డీ ఇస్తున్నాయి. మూడేళ్ల కాలపరిమితితో చేసిన రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లకు ఈ వడ్డీ లభిస్తుంది. ఇలా అత్యధిక వడ్డీ రేటు అందజేస్తున్న 14 పబ్లిక్, ప్రైవేటు సెక్టార్ బ్యాంకుల వివరాలు తెలుసుకుందాం.

ఉద్యోగం నుంచి, వ్యాపారాలు చేసి విశ్రాంతి తీసుకునే సీనియర్ సిటిజన్లు తమ దగ్గర ఉన్న సొమ్మును ఎక్కడ దాచాలా అని ఆలోచిస్తారు. వాటి నుంచి వచ్చే వడ్డీని తమ అవసరాలకు ఉపయోగించుకోవాలని భావిస్తారు. సాధారణంగా డబ్బు దాచుకోవడానికి సురక్షిత ప్రదేశం బ్యాంకులే. వాటిలోనూ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని అందించే బ్యాంకుల గురించి తెలుసుకోవడం ఎంతో ప్రయోజనం. సీనియర్ సిటిజన్లు చేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లపై పలు బ్యాంకులు మంచి వడ్డీని అందిస్తున్నాయి. వాటిలొ తక్కువ కాలపరిమితితో ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంకులు కొన్ని ఉన్నాయి.
సీనియర్ సిటిజన్ల తమ ఫిక్స్ డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీని కొన్ని బ్యాంకులు అందజేస్తున్నాయి. దాదాపు 8.1 శాతం వడ్డీ ఇస్తున్నాయి. మూడేళ్ల కాలపరిమితితో చేసిన రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లకు ఈ వడ్డీ లభిస్తుంది. ఇలా అత్యధిక వడ్డీ రేటు అందజేస్తున్న 14 పబ్లిక్, ప్రైవేటు సెక్టార్ బ్యాంకుల వివరాలు తెలుసుకుందాం.
డీసీబీ బ్యాంక్: ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు డిపాజిట్లపై 8.1 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. 26 నెలల నుంచి 37 నెలలలోపు కాలపరిమితితో కూడిన డిపాజిట్లకు ఈ వడ్డీరేటు వర్తిస్తుంది.
ఆర్బీఎల్ బ్యాంక్: ఈ బ్యాంక్ లో కూడా సీనియర్ సిటిజన్లకు డిపాజిట్లపై 8 శాతం వడ్డీ ఇస్తున్నారు. డిపాజిట్ల కాలపరిమితి 24 నెలల నుంచి 36 నెలల లోపు ఉండాలి.
ఎస్ బ్యాంక్: ఎస్ బ్యాంక్ లో వడ్డీ రేటు 8 శాతం ఉంది. 36 నెలల నుంచి 60 నెలల లోపు కాలపరిమితితో సీనియర్ సిటిజన్లు డిపాజిట్లు చేయాలి. ఆ మొత్తాలకే 8 శాతం వడ్డీ లభిస్తుంది.
బంధన్ బ్యాంక్: సీనియర్ సిటిజన్లకు ఈ బ్యాంకు 7.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలపరిమితితో బ్యాంకులో వేసిన డిపాజిట్లకు ఈ వడ్డీ వర్తిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా: బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ అందుతుంది. ఇక్కడ 7.75 శాతం వడ్డీని అందిస్తున్నారు. గరిష్ట కాలపరిమితి బంధన్ బ్యాంకు కన్నా కొంచె తక్కువగా ఉంది. రెండేళ్లు పైబడి మూడేళ్ల లోపు డిపాజిట్లకు అందజేస్తున్నారు.
ఐడీఎఫ్ సీ బ్యాంక్: ఈ బ్యాంకు సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీని అందజేస్తుంది. రెండు సంవత్సరాల ఒక్క రోజు నుంచి మూడేళ్ల లోపు డిపాజిట్లు చేయాలి.
ఇండస్ ఇండ్ బ్యాంక్: ఇండస్ ఇండ్ బ్యాంకులో కూడా సినియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని డిపాజిట్లపై ప్రకటించారు. రెండేళ్ల తొమ్మిది నెలల నుంచి మూడేళ్ల లోపు చేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లకు ఈ రేటు వర్తిస్తుంది.
యాక్సిస్ బ్యాంక్: ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీరేటును 7.6 శాతంగా నిర్ణయించారు. మూడేళ్ల లోపు కాలపరిమితితో డిపాజిట్ చేస్తే ఈ వడ్డీ అందుతుంది.
కోటక్ మహీంద్ర బ్యాంక్: కోటక్ మహీంద్ర బ్యాంకు 7.6 శాతం వడ్డీని అందిస్తోంది. మూడేళ్ల కాలపరిమితితో ఈ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలి
పంజాబ్ నేషనల్ బ్యాంక్: సీనియర్ సిటిజన్ల ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఈ బ్యాంకులో 7.5 శాతం వడ్డీ ఇస్తున్నారు. రెండేళ్లకు పైబడి మూడేళ్ల కాలపరిమితితో డిపాజిట్ చేయాలి.
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్: ఈ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ 7.5 శాతం. రెండేళ్ల పదకొండు నెలల ఒక్క రోజు నుంచి మూడేళ్ల లోపు డిపాజిట్ చేసిన సీనియర్ సిటిజన్లకు ఈ అవకాశం ఉంది.
ఐసీఐసీఐ బ్యాంక్: ఐసీఐసీఐ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు ఫిక్స్ డ్ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీని అందిస్తున్నారు. రెండేళ్ల నుంచి మూడేళ్ల కాలపరిమితితో డిపాజిట్ చేయాలి.
కరూర్ వైశ్యాబ్యాంక్: ఈ బ్యాంకులో వడ్డీ రేటు 7.4 శాతం ఇస్తున్నారు. రెండేళ్లకు పైబడి మూడేళ్ల లోపు చేసిన సీనియర్ సిటిజన్ల డిపాజిట్లకు వర్తిస్తుంది.
కెనరా బ్యాంక్: కెనరా బ్యాంక్ లో సీనియర్ సిటిజన్ల ఫిక్స్ డ్ డిపాజిట్లపై 7.3 శాతం వడ్డీ ఇస్తున్నారు. మూడేళ్లకు నుంచి ఐదేళ్ల లోపు కాలపరిమితితో డబ్బులు డిపాజిట్ చేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








