Fixed Deposit: అమాంతం పెరిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు.. ఏకంగా 9.6శాతం వరకూ వడ్డీ.. ఆ బ్యాంకులు ఇవే..
చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్‌లకు 5 సంవత్సరాల పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7-8% వడ్డీని అందిస్తున్నాయి. అదే సాధారణ పౌరులకు అయితే 6.5-7.6% వడ్డీని అందిస్తున్నాయి. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఏకంగా సీనియర్ సిటిజన్‌లకు ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పై 9.6% వడ్డీని అందిస్తోంది.

ప్రజల్లో విశేషాదరణ పొందిన పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్. అన్ని బ్యాంకులు, పోస్టు ఆఫీసుల్లో ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఇటీవల కాలంలో అన్ని బ్యాంకు తమ బ్యాంకుల్లో ప్రారంభించే ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలపై వడ్డీ రేట్లు బాగా పెంచాయి. అలాగే 5ఏళ్ల కాలపరిమితితో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రూ. 1.5 లక్షల వరకూ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ మినహాయింపు కూడా లభిస్తోంది. ఒక వేళ ఇప్పటి వరకూ మీరు ఎటువంటి పన్ను ప్రయోజిత పథకాలలో పెట్టుబడి పెట్టకపోతే.. మీకు ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది.
చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్‌లకు 5 సంవత్సరాల పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7-8% వడ్డీని అందిస్తున్నాయి. అదే సాధారణ పౌరులకు అయితే 6.5-7.6% వడ్డీని అందిస్తున్నాయి. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఏకంగా సీనియర్ సిటిజన్‌లకు ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పై 9.6% వడ్డీని అందిస్తోంది. ఇది హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి అగ్ర శ్రేణి బ్యాంకులు అందిస్తున్న దానికంటే 2% ఎక్కువ.
సీనియర్ సిటిజన్‌లకు ఐదేళ్ల కాల వ్యవధితో ప్రారంభించే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8% కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్న బ్యాంకులలో డీసీబీ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలోని ఫిక్స్‌డ్ డిపాజిట్ పై అధిక శాతం వడ్డీ అందిస్తున్న బ్యాంకుల జాబితాను ఇప్పుడు చూద్దాం..
జాతీయ బ్యాంకుల్లో ఇలా..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఇది 5 సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6.5% సీనియర్ సిటిజన్‌లకు 7% వడ్డీని అందిస్తోంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్: ఇది 5 సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6.2%, సీనియర్ సిటిజన్‌లకు 6.7% వడ్డీని అందిస్తోంది.
హెచ్ డీఎఫ్సీ బ్యాంక్: ఇది 5-సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7% వడ్డీని, సీనియర్ సిటిజన్‌లకు 7.5% వడ్డీని అందిస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్: ఇది 5-సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6.5%, సీనియర్ సిటిజన్‌లకు 7% వడ్డీని అందిస్తోంది.
ఐడీఎఫ్సీ బ్యాంక్: ఇది 5 సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7% వడ్డీని, సీనియర్ సిటిజన్‌లకు 7.5% వడ్డీని అందిస్తోంది.
డ్యుయిష్ బ్యాంక్: ఇది 5-సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7.5%, సీనియర్ సిటిజన్‌లకు 7.5% వడ్డీని అందిస్తోంది.
యాక్సిస్ బ్యాంక్: ఇది 5 సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7% వడ్డీని, సీనియర్ సిటిజన్‌లకు 7.75% వడ్డీని అందిస్తోంది.
సీసీబీ బ్యాంక్: ఇది 5-సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7.6% వడ్డీని, సీనియర్ సిటిజన్‌లకు 8.1% వడ్డీని అందిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా: ఇది 5-సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6.5% వడ్డీని, సీనియర్ సిటిజన్‌లకు 7.15% వడ్డీని అందిస్తోంది.
ఆర్బీఎల్ బ్యాంక్: ఇది 5 సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7% వడ్డీని, సీనియర్ సిటిజన్‌లకు 7.5% వడ్డీని అందిస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంక్: ఇది 5-సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7% వడ్డీని, సీనియర్ సిటిజన్‌లకు 7.5% వడ్డీని అందిస్తోంది.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లలో ఇలా..
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఇది 5-సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 9.1% వడ్డీని సీనియర్ సిటిజన్‌లకు 9.6% వడ్డీని అందిస్తోంది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఇది 5-సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7.2% వడ్డీని, సీనియర్ సిటిజన్‌లకు 7.95% వడ్డీని అందిస్తోంది.
ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఇది 5-సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6.25%, సీనియర్ సిటిజన్‌లకు 6.75% వడ్డీని అందిస్తోంది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఇది 5-సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7.65% వడ్డీని, సీనియర్ సిటిజన్‌లకు 8.15% వడ్డీని అందిస్తోంది.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఇది 5-సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6%, సీనియర్ సిటిజన్‌లకు 6.7% వడ్డీని అందిస్తోంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఇది 5-సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7.5% వడ్డీని సీనియర్ సిటిజన్‌లకు 8.25% వడ్డీని అందిస్తోంది.
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఇది 5 సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 8% వడ్డీ, సీనియర్ సిటిజన్‌లకు 8.6% వడ్డీని అందిస్తోంది.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఇది 5-సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7.2% వడ్డీని, సీనియర్ సిటిజన్‌లకు 7.4% వడ్డీని అందిస్తోంది.
క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఇది 5-సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 7.1% , సీనియర్ సిటిజన్‌లకు 7.75% వడ్డీని అందిస్తోంది.
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఇది 5-సంవత్సరాల ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు 6.5%, సీనియర్ సిటిజన్‌లకు 7.25% వడ్డీని అందిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..