AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2024: ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్.. పన్ను చెల్లింపుదారులకు సీతమ్మ గుడ్ న్యూస్ చెబుతారా?

ఫిబ్రవరి ఒకటో తేదీన 2024-25 ఇంటెరిమ్(మధ్యంతర) బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ పన్ను చెల్లింపు దారుల్లో ఆశలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త పన్ను విధానంలో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ యూనియన్ బడ్జెట్ దీర్ఘకాలిక ఆందోళలను పరిష్కరించడానికి, భవిష్యత్ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే విధంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Union Budget 2024: ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్.. పన్ను చెల్లింపుదారులకు సీతమ్మ గుడ్ న్యూస్ చెబుతారా?
Union Budget 2024
Madhu
| Edited By: Janardhan Veluru|

Updated on: Jan 08, 2024 | 6:31 PM

Share

యూనియన్ బడ్జెట్ 2024కి సమయం ఆసన్నమైంది. అదేంటి బడ్జెట్ సమావేశాలు మార్చిలో కదా జరిగేది అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది సాధారణ బడ్జెట్ సమావేశాలు కాదు. 2024 సార్వత్రిక ఎన్నికల ఏడాది కావడంతో మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీన 2024-25 ఇంటెరిమ్(మధ్యంతర) బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ పన్ను చెల్లింపు దారుల్లో ఆశలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త పన్ను విధానంలో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ యూనియన్ బడ్జెట్ దీర్ఘకాలిక ఆందోళలను పరిష్కరించడానికి, భవిష్యత్ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే విధంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్ ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధన్యం ఇస్తుందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2024 నుంచి ఆదాయ పన్ను ప్రయోజనాలు కొన్ని ఉండే అవకాశం ఉందంటున్నారు. అవి ఎలా ఉంటాయో ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ ఆదాయ పన్నుప్రయోజనాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

80డీ డిడక్షన్ లిమిట్..

వైద్య బీమా ప్రీమియంల కోసం సెక్షన్ 80డీ కింద డిడక్షన్ పరిమితిని వ్యక్తులకు రూ. 25,000 నుంచి రూ. 50,000కి, సీనియర్ సిటిజన్‌లకు రూ. 50,000 నుంచి రూ. 75,000కి పెంచే అవకాశం ఉంది. ఇది పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులను ప్రతిబింబిస్తుంది. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 80డీ ప్రయోజనాలను పొడిగించడం వల్ల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుంది.

గృహ కొనుగోలుదారులకు టీడీఎస్ సులభతరం..

ప్రస్తుతం రూ. 50 లక్షలకు మించిన ఆస్తి కొనుగోళ్లపై 1శాతం టీడీఎస్ కట్ అవుతోంది. ఈ ప్రక్రియ రెసిడెంట్ అమ్మకందారులకు (ఫారమ్ 26క్యూబీ ఉపయోగించి) సులభంగా ఉన్నప్పటికీ నాన్-రెసిడెంట్ ఇండియన్ (ఎన్ఆర్ఐ) విక్రేతలకు ఇది మరింత క్లిష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో గృహ కొనుగోలుదారులకు టీడీఎస్ ప్రక్రియను మరింత సులభతరం చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మూలధన లాభాల పన్ను సరళీకరణ..

ప్రస్తుత మూలధన లాభాల పన్ను(క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సేషన్) విధానం, సంక్లిష్టత పెట్టుబడిదారులకు సవాళ్లను కలిగిస్తుంది. ఆస్తి తరగతులు, హోల్డింగ్ పీరియడ్‌లు, పన్ను రేట్లు, నివాస స్థితి వంటి అనేక అంశాలను పరిగణించాలని, ఈక్విటీ, డెట్ సాధనాల వర్గీకరణను క్రమబద్ధీకరించాలని, లిస్టెడ్, అన్‌లిస్టెడ్ సెక్యూరిటీలకు పన్ను చికిత్సను ఏకీకృతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇండెక్సేషన్ నిబంధనలను సులభతరం చేస్తే బాగుంటుందని చెబుతున్నారు.

బెంగళూరులో హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు..

భారత రాజ్యాంగం ప్రకారం మెట్రో నగరంగా గుర్తించబడినప్పటికీ, ఆదాయపు పన్ను ప్రయోజనాల కోసం బెంగళూరు నాన్-మెట్రోగా వర్గీకరించి ఉంది. ఈ క్రమంలో ఇతర మెట్రో నగరాల్లో లభించే 50%కి బదులుగా బెంగళూరు నివాసితులకు హెచ్ఆర్ఏ తగ్గింపులను 40%కి పరిమితం చేస్తోంది. దీనిపై ఓ చర్య తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..