Electric scooter: సింగిల్ చార్జ్‌తో 90 కిలోమీటర్లు.. ధర కేవలం రూ. 76,750, ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరిపోయింది..
మీరు కూడా తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకో బెస్ట్ ఆప్షన్ అందుబాటులో ఉంది. హయాసా ఇరా ఎలక్ట్రిక్ స్కూటర్.
మార్కెట్లో వందల సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లు, బైక్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి ధర కాస్త ఎక్కువగానే ఉందనే చెప్పాలి. మంచి ఫీచర్లు, కాస్త బెటర్ రేంజ్ కావాలంటే ధర ఎక్కువ పెట్టాల్సిందే. అయితే తక్కువ బడ్జెట్ లో ఉన్న మంచి ఫీచర్లతో కూడిని బైక్లు, స్కూటర్లు తక్కువగా ఉన్నాయి. మీరు కూడా తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకో బెస్ట్ ఆప్షన్ అందుబాటులో ఉంది. హయాసా ఇరా ఎలక్ట్రిక్ స్కూటర్. తక్కువ బడ్జెట్, మంచి మైలేజీపాటు అద్భుతమైన ఫీచర్లు ఈ స్కూటర్ సొంతం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
హయాసా ఇరా ధర..
కంపెనీ ఈ హయాసా ఇరా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లో ప్రారంభ ధర రూ. 76,750 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) తో విడుదల చేసింది. రేంజ్, గరిష్ట వేగాలను పరిశీలిస్తే దీనిలోని బ్యాటరీ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్ల రేంజ్ అందుబాటులో ఉంటుందని, ఈ రేంజ్‌తో గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగం లభిస్తుందని కంపెనీ పేర్కొంది.
బ్రేకింగ్, సస్పెన్షన్ సిస్టమ్..
బ్రేకింగ్ , సస్పెన్షన్ సిస్టమ్ లను పరిశీలస్తే స్కూటర్ ముందు, వెనుక చక్రాలలో డిస్క్ బ్రేక్‌లను అందించింది. దానితో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అందించింది. సస్పెన్షన్ సిస్టమ్ విషయానికి వస్తే, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్ సస్పెన్షన్, వెనుక వైపున స్ప్రింగ్ ఆధారిత షాక్ అబ్జార్బర్ సిస్టమ్ అందిస్తోంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు..
హైయాసా ఇరా ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డిజిటల్ ట్రిప్ మీటర్, డిజిటల్ స్పీడోమీటర్, పుష్ బటన్ స్టార్ట్, ఎల్ఈడీ హెడ్ లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్, ఎల్ఈడీ టర్న్ సిగ్నల్ ల్యాంప్, అల్లాయ్ వీల్, ట్యూబ్‌లెస్ టైర్ ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..