EPFO: ఆన్లైన్లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం చాలా సింపుల్? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
ఇప్పుడు సింపుల్ గా ఆన్లైన్ యాప్ లేదా పోర్టల్ లో సైన్ అప్ అయ్యి అన్ని సేవలను పొందుకోవచ్చు. కేవలం పీఎఫ్ బ్యాలెన్స్ మాత్రమే చెక్ చేసుకోవడానికి కాకుండా అనేక ఇతర సేవలను కూడా వినియోగించుకోవచ్చు.
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక సంస్థ. దీనిలో ఉండే వినియోగదారుల ద్వారా జరిపే ఆర్థిక లావాదేవీల పరంగా ఇది ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. కొంత కాలం క్రితం వరకూ వినియోగదారులకు ఈవీఎఫ్ లో సేవలు పొందాలంటే కష్టతరంగా ఉండేవి. సరైన సర్వీస్ ఉండే ది కాదు. అయితే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ.. సేవలను వినియోగదారులకు సులభతరం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం ఈపీఎఫ్ ను డిజిటల్ బాట పట్టిస్తోంది. ఇప్పుడు సింపుల్ గా ఆన్లైన్ యాప్ లేదా పోర్టల్ లో సైన్ అప్ అయ్యి అన్ని సేవలను పొందుకోవచ్చు. కేవలం పీఎఫ్ బ్యాలెన్స్ మాత్రమే చెక్ చేసుకోవడానికి కాకుండా అనేక ఇతర సేవలను కూడా వినియోగించుకోవచ్చు. ఉద్యోగం చేసే కంపెనీ మారినా నామినేషన్ చేంజ్ చేసుకోవాల్సిన వచ్చినా ఎక్కడా సర్వీస్ కోల్పోకుండా చూసుకోవచ్చు.
యూఏఎన్ తప్పనిసరి..
ఈపీఎఫ్ ఖాతాదారులు తమ బ్యాలెన్స్ ను ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఆన్ లైన్ సర్వీసెస్ ద్వారా పొందవచ్చు. దీనికి సంబంధించిన వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం యూఏఎన్(UAN) యాక్టివేట్ అయ్యి ఉండాలి. అది మీ మొబైల్ నంబర్ కు అనుసంధానమై ఉండాలి.
యూఏఎన్ అంటే..
ఈపీఎఫ్ లో రిజిష్టర్ అయి ప్రతి ఎంప్లాయీకీ ప్రత్యేకంగా యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ వస్తుంది. ఇది తన లైఫ్ టైంలో ఒక్కటే ఉంటుంది. ఖాతాదారుడు ఎన్ని కంపెనీలు మారినా ఈ నంబర్ మారదు. దీని ద్వారా మాత్రమే ఖాతాదారుడు తమ అకౌంట్ వివరాలు పొందగలడు.
యూఏఎన్ యాక్టివేట్ చేయాలంటే..
- epfindia.gov.in లోకి లాగిన్ అవ్వాలి.
- దానిలో యాక్టివేట్ యూఏఎన్ బటన్ ని క్లిక్ చేయాలి.
- అప్పుడు మిమ్మల్ని సైట్ కొత్త పేజీలోకి తీసుకెళ్తుంది.
- దానిలో యూఏఎన్, పాన్ కార్డ్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి.
- ఆ తర్వాత గెట్ ఆథరైజేషన్ పిన్ ని క్లిక్ చేయాలి.
- అప్పుడు మళ్లీ ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో మీ సెల్ నంబర్ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసి, యూఏఎన్ ను యాక్టివేట్ చేయాలి.
- అప్పుడు మీ ఫోన్ కి మరో పిన్ తో కూడిన ఓ ఎస్ఎంఎస్ వస్తుంది.
- దానిని ఎంటర్ చేసి, లాగిన్ అయ్యి.. కొత్త పాస్ వర్డ్ ని మార్చకొని , మళ్లీ లాగిన్ చేయాలి.
- ఇది విజయవంతం అయితే ఆరు గంటల తర్వాత మీ పాస్ బుక్ చూసుకొనే అవకాశం ఉంటుంది.
ఫోన్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేయడం ఇలా.. ఈపీఎఫ్ ఖాతాదారుడు తన నెలవారీ జీతం నుంచి కట్ అయ్యే నగదు పీఎఫ్ ఖాతాలో జమయ్యాయా లేద అన్నది మీ ఫోన్ లో నుంచే చెక్ చేసుకోవచ్చు. కాల్ చేయడం ద్వారా.. ఈపీఎఫ్ ఖాతాకు లింకై ఉన్న మీ మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. ఒక రింగ్ తర్వాత కాల్ దానంతట అదే కట్ అయిపోతుంది. తర్వాత ఖాతా వివరాలతో మెసేజ్ వస్తుంది.
మెసేజ్ పంపడం ద్వారా.. పీఎఫ్ ఖాతాకు లింకైన నంబర్ నుంచి EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899కి ఎస్ఎంఎస్ పంపితే తిరిగి అకౌంట్ వివరాలతో మెసేజ్ వస్తుంది. అందుటో పీఎఫ్ కంట్రిబ్యూషన్, బ్యాలెన్స్, కేవైసీ సమాచారం ఉంటుంది. ఇక్కడ UAN అంటే మీ ఖాతాకు సంబింధించిన యూఏఎన్ నంబర్, ENG అంటే ఇంగ్లిష్. ఖాతా వివరాలుమీకు కావాల్సిన భాషలో పొందే వెసులుబాటు ఉంది. ENG స్థానంలో TEL అని టైప్ చేస్తే మెసేజ్ తెలుగులో వస్తుంది. HIN అని టైప్ చేస్తే హిందీలో వస్తుంది. ఇంకా చాలా భాషా ఎంపికలు ఉన్నాయి.
UMANG యాప్ ద్వారా.. మీ స్మార్ట్ ఫోన్ లో UMANG యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. తర్వాత మీకు అనువైన భాషను ఎంపిక చేసుకోవాలి. మీ ఫోన్ నంబర్ ను రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత All services ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చిన లిస్ట్ నుంచి EPFO సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత View passbook పైన క్లిక్ చేయాలి. అప్పుడు ఓపెన్ అయిన విండోలో మీ యూఏఎన్ నంబర్ టైప్ చేసి.. మీ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ అయ్యి మీ మొబైల్ స్క్రీన్ పై సూచించే విధంగా చేయాలి. అప్పుడు మీ ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ కనిపిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..